Jagadhatri  Serial Today Episode:   జగధాత్రి, కేదార్‌ ఇంటిని శుభ్రం చేస్తూ.. రొమాంటిక్‌గా  ఫీలవుతుంటే.. దూరం నుంచి చూసిన నిషిక బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి అది అంతే ఏం లేక పోయినా హ్యాపీగా ఉంటుంది. నాకు కోట్ల ఆస్థి ఉన్నా నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని చెప్పుకుంటూ బాధపడుతుంది.

Continues below advertisement


నిషిక: పని చేయమన్నారు. ఎక్స్‌ ట్రాలు కాదు.


కాచి: పార్టీకి టైం అవుతుంటే మీరేంటి ఇంకా ఇల్లు కూడా క్లీన్‌ చేయలేదు. చూడండి అంతా ఎలా ఉందో…?


ధాత్రి: ఇంట్లో క్లీన్‌ చేయాలంటే ముందు కొంత మంది ఆలోచనలతో మొదలుపెట్టాలి కాచి. అదైతే ఇంత టైం పట్టదేమో కానీ ఇంత పెద్ద ఇల్లు అయితే కొంచెం టైం పడుతుంది.


నిషిక: ఏంటో చెత్త ఆలోచనలు అని మా అయన్ని చూసి అంటున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటే..


వైజయంతి: ఆ అమ్మికి లేని ఉద్దేశాలు కూడా  ఈ అమ్మి వచ్చేలాగా ఉందే..( మనసులో అనుకుంటుంది)


కేదార్‌: ధాత్రి అలా అందో లేదో కానీ మీకు అలా అనిపించింది అంటే ఇప్పుడు మీకు డౌటు వస్తుంది నిషిక.


యువరాజ్‌: నిషిక నువ్వు ఆగు.. మీరు పని కానివ్వండి..


 అనగానే ధాత్రి, కేదార ఇల్లు క్లీన్ చేస్తుంటారు. బూచి కావాలని అటూ ఇటూ ఫోన్‌ మాట్లాడుతూ తిరుగుతుంటాడు. నిషిక, బూచి కూడా క్లీన్‌ చేస్తుంటే చెడగొట్టాలని ప్లాన్‌ చేస్తారు. కానీ ప్లాన్‌ బెడిసికొట్టడంతో నిషిక కింద పడిపోతుంది. బయట నుంచి వచ్చిన బూచి కూడా కాలు జారి కింద పడి ధాత్రి కాళ్ల దగ్గర పడిపోతాడు.


ధాత్రి: కేదార్‌ చెడపకురా చెడేవు అన్న సామెత ఎప్పుడైనా విన్నావా..?


కేదార్‌: ఆహా.. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాను.


కాచి: సారీ నిషి.. సారీ అన్నయ్య..


వైజయంతి: అయ్యో వెంకన్న స్వామి ఎప్పుడు వాళ్ల వైపే ఉంటావా..? ( అని మనసులో అనుకుంటుంది.)


బూచి: జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని నిషిక వాళ్లకు చెప్పావా..?


కాచి: చెప్పాను. నిషిక వాళ్ల మీద పిచ్చ కోపంగా ఉంది. వచ్చాక వాళ్ల పని చెప్తా అంది.


బూచి: అయినా ఎప్పుడూ వాళ్ల జోలికి వెళ్లొద్దని చెప్పినా వినరు. హీరో, రౌడీలు కొట్టుకుంటే కమేడియన్స్‌ దెబ్బతిన్నట్టు ఉంది మన పరిస్థితి.


కాచి: వీళ్లు ఎక్కడున్నారు.. పని చేయకుండా పారిపోయారా..?


బూచి: లేదు అక్కడ ఉన్నట్టున్నారు వెళ్దాం పద


 అని ఇద్దరూ మాట్లాడుకుని.. బయటకు వెళ్లి ధాత్రి, కేదార్‌ లను వెనక నుంచి గమనిస్తుంటారు. కాచి, బూచి వచ్చారని నిర్దారించుకున్న ధాత్రి, కేదార్‌ వాళ్లకు వినిపించేటట్టు ఆస్థి పేపర్స్‌ దొరకుతాయని ఇల్లు క్లీన్‌ చేయడానికి ఒప్పుకున్నాను అని ధాత్రి చెప్తుంది. అది విన్న బూచి వాళ్ల కన్న ముందే ఇల్లు క్లీన్‌ చేసి ఆస్థి పేపర్స్‌ మనమే తీసుకుందాం అని లోపలికి వెళ్తారు. ప్లాన్‌ వర్కవుట్‌ అయింది ధాత్రి అంటాడు కేదార్‌. తర్వాత ధాత్రి, కేదార్‌ లు ఇల్లు క్లీన్‌ చేస్తుంటే కాచి, బూచి వెళ్లి వాళ్లను కూర్చోబెట్టి ఇల్లు క్లీన్‌ చేస్తారు. ధాత్రి, కేదార్‌ కూర్చుని కూల్‌ డ్రింక్‌ తాగుతుంటే.. యువరాజ్‌, నిషిక వచ్చి చూసి షాక్‌ అవుతారు. కాచి, బూచిలను చూసి తిట్టుకుంటారు. దగ్గరకు వెళ్లి కాచి, బూచిలను నిషిక, యువరాజ్‌ తిడతారు. పని చేయోద్దని చెప్పినా వినకుండా ఇల్లు మొత్తం క్లీన్‌ చేస్తుంటారు. దీంతో నిషిక కోపంగా ఆ జగధాత్రి ఏదో చేసింది యువరాజ్‌ అంటుంది. మనం లేని టైం చూసి వాళ్లను ఏదో చేసింది అని చెప్తుంది.  దీంతో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!