Meghasandesam Serial Today Episode:   తన ఇంటికి వచ్చిన గగన్‌ను ఎందుక వచ్చావని శరత్‌ చంద్ర కోపంగా అడుగుతుంటాడు. గగన్‌ కూల్‌గా అపూర్వ వైపు చూస్తాడు. అపూర్వ షాక్‌ అవుతుంది. పక్కనే ఉన్న సుజాత మాత్రం అమ్మాయి వీడు నిన్ను ఇరికించేలా ఉన్నాడు అని చెప్తుంది. తర్వాత ప్రసాద్‌ వైపు చూస్తాడు. దీంతో నాకు తెలుసు ప్రసాద్‌ నువ్వే వీడిని పార్టీకి పిలిచావు కదా అంటాడు. ఇంతలో గగన్‌ భూమి వైపు చూస్తాడు. శరత్‌ చంద్ర కోసంగా అరేయ్‌ నువ్వు భూమి కోసం వచ్చావు కదా… అంటూ గగన్‌ గల్ల పట్టుకుంటాడు శరత్‌ చంద్ర. ఇంతలో శరత్‌ చంద్ర అంటూ మినిస్టర్‌ వస్తాడు. గగన్‌ ను నేనే తీసుకొచ్చాను  అని చెప్తాడు. నన్నే కాదు గగన్‌ కూడా బాగా చూసుకోండని చెప్తాడు మినిస్టర్‌ చెప్పి వెళ్లిపోతాడు.


అపూర్వ: రారా మెక్కుదువు కానీ..


సుజాత: అమ్మాయి మర్యాద మర్యాద..


అపూర్వ: రండి విందు ఆరగిద్దురు కానీ


గగన్‌: అంత మర్యాదగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను పదండి.


అపూర్వ: కూర్చోండి..


గగన్: ఇంటికి వచ్చిన గెస్టును ఎలా చూసుకోవాలో తెలియదా..? నాకు జ్యూస్‌ కావాలి.


అపూర్వ: లక్ష్మీ జ్యూస్‌ తీసుకురా..


గగన్‌: ఏయ్‌ వాళ్లు కాదు నువ్వే నువ్వే తీసురావాలి.


అపూర్వ: ఏంటి నేనా…?


గగన్‌: అతిథిని అలా చూసుకుంటాను.. ఇలా చూసుకుంటాను అంటావు.. ఇక జ్యూస్‌ కూడా నువ్వే చేసుకుని తీసుకురావాలి. ఏంటి అలా చూస్తున్నావు. ఈ పార్టీకి పిలిచింది నీ కూతురే అని మీ ఆయనకు చెప్పాలా..?


అపూర్వ: ఇప్పుడేంటి నేనే స్వయంగా జ్యూస్‌ చేసుకుని తీసుకురావాలి అంతేగా…


అంటూ అపూర్వ జ్యూస్‌ తీసుకురావడానికి వెళ్తుంది. చెర్రి, శారదకు  ఫోన్‌ చేసి గగన్‌.. నక్షత్ర బర్తుడే పార్టీకి వచ్చాడని చెప్తాడు. శారద షాక్‌ అవుతుంది. వాడు అక్కడికి వచ్చాడా..? ఏమైనా గొడవ అవుతుందా..? అంటూ కంగారు పడుతుంది. ఏం లేదని అంత కూల్‌గా ఉందని ఒకవేళ గొడవ అయితే నేనే మీకు ఫోన్‌ చేస్తాను అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. గగన్‌, మంత్రి, శరత్‌చంద్ర కూర్చుని మాట్లాడుతుంటారు. ఇంతలో పనిమనిషి జ్యూస్‌ తీసుకొచ్చి ఇస్తుంది. శరత్‌ చంద్ర మినిస్టర్‌కు ఇస్తాడు. గగన్‌ జ్యూస్‌ తీసుకోడు. నా గెస్టు మీరు ఇవ్వలేదని తీసుకోలేదు అంటాడు మినిస్టర్‌. దీంతో శరత్‌చంద్ర జ్యూస్‌ తీసి గగన్‌కు ఇస్తాడు. తర్వాత పార్టీలో గగన్‌, భూమి కోసం వెతుకుతుంటాడు. భూమి తప్పించుకుని తిరుగుతుంది. గగన్‌ కోసం చెర్రి వెతుకుతుంటాడు.


చెర్రి: సోదరా… సోదరా…


గగన్‌: ఎంట్రా ఆ అరుపులు.. కాస్త డీసెన్సీ మెయింటెన్‌ చెయ్యరా…


చెర్రి: సారీ అన్నయ్యా ఇందాక నుంచి వెతుకుతున్నాను. కనబడేసరికి పరుగెత్తుకొచ్చాను. అవును నువ్వు పెద్దమ్మకు చెప్పి వచ్చావా…?


గగన్‌: చెప్పి వస్తే.. నన్ను రానిస్తుందా…?


చెర్రి: అవును అసలు నువ్వు ఎందుకు వచ్చావు. అంటే ఇది నేను అడుగుతున్నట్టు కాదు. పెద్దమ్మ అడుగుతున్నట్టు..


గగన్: భూమి కోసం .. నేను భూమి కోసం వెతుకుతున్నాను. భూమి ఎక్కడ..?


చెర్రి: భూమి కోసమా.. భూమి కోసం ఎందుకు సోదరా..?


ప్రసాద్‌: అరేయ్‌ ఏంట్రా ఎందుకు టెన్షన్‌ పడుతున్నావు.


చెర్రి: అన్నయ్యా భూమి కోసం వచ్చాడంట నాన్నా..


ప్రసాద్‌: వాడు భూమి కోసం వస్తే నీకెందుకురా టెన్షన్‌.


అనగానే చెర్రి ప్రసాద్‌ను తిట్టి వెళ్లిపోతాడు. చెర్రికి భూమి ఎదురుపడుతుంది. మా అన్నయ్య ఎందుకో నీ కోసం వెతుకుతున్నాడు అని చెప్తాడు. దీంతో లవ్‌ విషయం మొత్తం చెప్పేశాడా ఏంటి అని భూమి మనసులో బయపడుతుంది. మా అన్నయ్య ప్రేమిస్తుంది నిన్నా అని అడుగుతాడు చెర్రి. భూమి షాక్‌ అవుతుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!