Things to Unlearn in 2025 : మనం నమ్మే విషయాలు ఎప్పుడూ కరెక్ట్ అయి ఉండాలని రూల్ లేదు. కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటాము.  ఆ ప్రాసెస్​లో అది తప్పు అని రియలైజ్ అవుతూ ఉంటాము. చిన్నప్పుడు నమ్మే కొన్ని విషయాలు నిజం కాదని.. వయసు పెరిగాకే అర్థమవుతుంది. పెద్ద అయిన తర్వాత మనం కొన్ని జీవిత సత్యాలను గుర్తించాలి. లేదు మేము మారము. ఇప్పటికీ, ఎప్పటికీ అదే ధోరణిలో ఉంటామంటే దానివల్ల మీరు పొందేది ఏమి ఉండదు. ఇంకా మీ జీవితాన్ని కాంప్లికేట్ చేసుకోవడమే అవుతుంది. ఈ ఏడాది దాదాపు పూర్తి అవుతుంది. 2025లో అయినా కొన్ని విషయాల్లో మన ఆలోచన ధోరణి మారాలి. ఇప్పటికీ వరకు ఎలాంటి ఆలోచనలో ముందుకు వెళ్లినా.. ఇకపై ఆ ఆలోచనల్లో మార్పులు కచ్చితంగా తీసుకురావాలి. అప్పుడే మీరు హ్యాపీగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. 


ఆ ఆలోచన మారాలి..


అబ్బాయిలు ఈ పనులే చేయాలి. అమ్మాయిలు ఇలా ఉండాలనే ధోరణి మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. మనం 2025లోకి వెళ్తున్నాము. ఇప్పటికీ అబ్బాయి ఆఫీస్​కి వెళ్లాలి. అమ్మాయి వంట చేయాలనే ధోరణిలో ఉంటే కష్టం. అమ్మాయిని చదివించాలి. జాబ్ చేయించాలి. అబ్బాయి వంట చేస్తాను అన్నా ఆ ఫీల్డ్​లో ముందుకు వెళ్లనివ్వాలి. అలాగే భర్త జాబ్ చేసి.. భార్యను పోషించడం ఎంత కామనో.. భార్య జాబ్ చేసి భర్తని పోషించినా అంతే కామన్​గా మారాలి. ఈ ఆలోచన మారితే ఎందరి జీవితాలో బాగుపడతాయి. 


అసలైన సెల్ఫ్​ లవ్​ అదే


సెల్ఫ్​ లవ్ అనేది అతిపెద్ద తప్పు కింద చూస్తారు కొందరు. సెల్ఫ్ లవ్​ అనేది సెల్ఫిష్​నెస్ ఏమి కాదు. తమని తాము ప్రేమించుకోవడం, తమని తాము ముందు పెట్టుకోవడం. సెల్ఫ్​ కేర్ తీసుకోవడం అనేది ఓ మంచి రొటీన్. ఇతరులను నొప్పించకుండా.. మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్లడమనేది ఎప్పటికీ తప్పుకాదు. ఈ కాలంలో ఇతరుల గురించి ఆలోచిస్తూ.. సోషల్ స్ట్రాండర్డ్స్ కోసం సెల్ఫ్​ రెస్పెక్ట్​ని చంపుకొని బతకడం కన్నా సెల్ఫ్ లవ్​ అనేది వంద రెట్లు మేలు. 


ప్రేమతో విడిపోవడమూ మంచిదే.. 


ప్రేమ ఒక అందమైన అనుభూతి అని చాలామంది చెప్తారు. కానీ ప్రేమ అనేది ఓ రోలర్ కోస్టర్​ వంటిది. ఆ ప్రేమలో ప్రేమిచండంతో పాటు.. రాజీ పడడం, గొడవ పడడం, త్యాగం చేయడం.. ఆఖరికి వదలుకోవడం కూడా ఉంటాయి. కాబట్టి ప్రేమ అనేది కేవలం అందమైన అనుభూతినే కాదు.. మరెన్నో అనుభవాలు కూడా ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి. 


ఎండింగ్ హ్యాపీగానే ఉండాలా?


జీవితాంతం హ్యాపీగా ఉండాలనే ఆలోచనతోనే చాలామంది పనులు చేస్తారు. కానీ ఏది మన చేతిలో ఉండదు. మీరు అనుకున్న హ్యాపీ ఎండింగ్ రాకుంటే బాధపడాల్సిన రూల్ లేదు. ఎందుకంటే ఎఫర్ట్స్ మాత్రమే మ్యాటర్. రిజల్ట్ ముఖ్యమే అయినా.. దాని ఫలితం మన చేతిలో లేదు కాబట్టి విషాద ముగింపును కూడా ఆహ్వానించాలి. దాని నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లాలి. ఎగ్జామ్, జాబ్, పెళ్లి.. ఇలా అన్నింట్లోనూ హ్యాపీ ఎండింగ్ మాత్రమే ఎక్స్​పెక్ట్ చేస్తే.. మీరు హ్యాపీగా ఉండలేరు. 


మానసిక ఆరోగ్యం


ఆరోగ్యం అంటే కేవలం శారీరకంగా మాత్రమే అనుకుంటారు. మెంటల్లీ వీక్​గా ఉన్నానని ఎవరైనా చెప్తే.. అదొక తప్పుగా చూస్తారు. లేదా చులకనగా చూస్తారు. డిప్రెషన్​లో ఉన్నానని చెప్పినా.. స్ట్రెస్​, యాంగ్జైటీతో బాధపడుతున్నానని చెప్పినా చులకనగా మాట్లాడతారు. కానీ మీకు తెలుసా? ఎంతోమంది ఈ మానసిక రుగ్మతలతోనే చనిపోతున్నారని. అవతలివాడి పెయిన్ అర్థం చేసుకోకపోయినా పర్లేదు. కానీ మీ దగ్గరకి వచ్చి ఎవరైనా మాట్లాడితే మాత్రం చులకనగా చూడడం మానుకోండి.


ఒంటరితనం


ఒంటరిగా ఉండటం అంటే ఒంటరితనం అనుకుంటారు చాలామంది. కానీ అది పూర్తిగా తప్పు. ఒంటరిగా ఉండి జీవితాన్ని హ్యాపీగా లీడ్​ చేసేవారు ఉన్నారు. అలాగే అందరితోనూ కలిసి ఉండి ఒంటరిగా కుమిలిపోయేవాళ్లు కూడా ఉన్నారు. ఈ తేడాని అర్థం చేసుకున్నప్పుడు నిజమైన ఒంటరితనం ఏంటో తెలుస్తుంది. వచ్చే ఏడాదినుంచైనా.. ఒంటరిగా ఉంటారో.. ఒంటరితనంతో ఉంటారో మీ ఇష్టం. 


లుక్స్​ని చూసి జడ్జ్ చేయడం


ఎదుటివారి కామెంట్స్​ వల్లనే ఎక్కువమంది ఇన్​సెక్యూరిటీ​కి గురి అవుతారని తెలుసా? కొందరు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా.. తమని తాము ఇష్టపడతారు. ​కానీ వారి కాన్ఫిడెన్స్​ను కిల్ చేస్తూ.. లుక్స్​ని చూసి జడ్జ్ చేస్తారు కొందరు. మీరు కూడా వారిలో ఒకరు అయితే.. ఆ ధోరణిని మార్చుకోండి. ఎదుటివారిని జడ్జ్ చేయడం మానేసి మీ పని మీరు చూసుకుంటే సర్వేజనా సుఖినోభవంతు.


కాస్త క్రేజీగా ఉండాలబ్బా.. 


లైఫ్​ని ఎప్పుడూ సీరియస్​గా తీసుకుని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జోష్​ఫుల్​గా, క్రేజీగా కూడా ఉండొచ్చు. కొత్త విషయాలను ప్రయత్నించండి. కొత్త ప్లేస్​కి వెళ్లండి. ఫన్నీగా కొన్ని తప్పులు కూడా చేయండి. మీలోని హ్యాపీ పర్సన్​ని చంపేసుకోకండి. జాబ్స్, ఫ్యామిలీ, టెన్షన్స్ ఎప్పుడూ ఉండేవే. కానీ మీతో మీరు అయినా హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. 


ఇప్పటికీ మారకపోతే వేస్టే.. 


మతం, కులాలు, చర్మం రంగు. ఇవేవి పుట్టేప్పుడు మన చేతుల్లో ఉండవు. ఓ సిస్టమ్ ఉంది కాబట్టి దానిని ఫాలో అవ్వడంలో తప్పులేదు కానీ.. ఇప్పటికీ వీటినే పట్టుకుని వేలాడడం ఎందుకు చెప్పండి. ఎవరు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ రంగు, ఏ రూపులో ఉన్నా.. ఎలా ఉన్నారో.. వారిని అలానే యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది. 


కొత్త సంవత్సరం నుంచి అయినా.. మీరు ఈ విషయాల్లో అవగాహనతో ముందుకు వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు. మీతో ఉన్నవారు కూడా హ్యాపీగా ఉంటారు. 



Also Read : పర్సనల్​ లైఫ్​ని వర్క్​ లైఫ్​ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి..