Advice for Work-Life Balance : వర్క్‌లోని టెన్షన్స్‌ని, టార్గెట్స్‌ని చాలామంది పర్సనల్ లైఫ్‌కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. పర్సనల్ లైఫ్‌ని, వర్క్ లైఫ్‌ని రెండింటీని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసినప్పుడు మీరు హ్యూమన్‌గా మిగులుతారు. లేదంటే మీరు కూడా ఓ రోబోలా తయారవుతారు. మీరు అలా మారిపోకుండా.. వర్క్ లైఫ్‌ని పర్సనల్ లైఫ్‌ని సింపుల్‌గా ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బౌండరీలు పెట్టుకోండి..
మీరు చేసే పనికి ఎంత టైమ్ పడుతుందో డిసైడ్ చేసుకోండి. దీనివల్ల మీ వ్యక్తిగత జీవితానికి ఎంత సమయం కేటాయించాలో తెలుస్తుంది. మీరు సెట్ చేసుకున్న సమయంలోనే వర్క్‌ని కంప్లీట్ చేయడం నేర్చుకోండి. దీనివల్ల మీ పని తొందరగా పూర్తవుతుంది. అలాగే మీ పర్సనల్ స్పేస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రెజర్ ఉండదు.
ఒకవేళ ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటే.. ఆ స్పేస్ మీరు డైవర్ట్ కాకుండా పనిపై ఫోకస్ చేయగలిగేలా చూసుకోండి. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్‌ని పర్సనల్ లైఫ్‌లో మిక్స్ చేసి.. రోజంతా లాప్టాప్ ముందే కూర్చొని ఉంటారు. దీనివల్ల మీ పర్సనల్ లైఫ్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరు వర్క్ చేసేందుకు ఒక స్పేస్‌ని క్రియేట్ చేసుకుంటే.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా.. మీరు వర్క్ లైఫ్‌ని ఈజీగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు.
సెల్ఫ్ కేర్..
పర్సనల్ లైఫ్‌ని ఎప్పుడూ మిస్ చేసుకోవద్దు. ఇది కేవలం ఫ్యామిలీ టైమ్ మాత్రమే కాదు.. మీకంటూ మీరు అన్ని పనుల నుంచి స్పేస్ తీసుకోవాల్సిన సమయం. చదవడం, జర్నల్స్ మెయింటైన్ చేయడం, వ్యాయామం వంటివి ఈ సమయంలో చేయవచ్చు. అలాగే మీకు ఇష్టమైనవారితో సమయం గడపవచ్చు. అన్ని ఆలోచించడం మానేసి రెస్ట్ కూడా తీసుకోవచ్చు.
బ్రేక్ ముఖ్యం బిగిలు..
మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న అంశాలనుంచి బ్రేక్ తీసుకోండి. మిమ్మల్ని రీఛార్జ్ చేసుకోవడానికి చిన్న ట్రిప్స్‌కి వెళ్తూ ఉండండి. మీ బ్రేక్ టైమ్‌లో వర్క్‌కి సంబంధించిన విషయాలకు దూరంగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీరు రిలాక్స్ అవుతారు. క్రియేటివ్ థాట్స్ కూడా పెరుగుతాయి. ధాన్యం, యోగా వంటివి చేస్తూ ఉంటే.. ఒత్తిడి తగ్గుతుంది. వర్క్ చేసేప్పుడు కూడా చిన్న బ్రేక్స్ తీసుకోవడం ప్రెజర్ ఉండదు. డీప్ బ్రీతింగ్ కూడా స్ట్రెస్ నుంచి విముక్తినిస్తుంది.
నో చెప్పడం ఈజీనే..
ఆఫీస్‌లో చేసే పని సరిపోదన్నట్టు.. మీ బాస్ లేదా ఇతరులు ఇచ్చే పనులు కూడా చేసేస్తూ ఎక్స్ట్రా ప్రెజర్ తీసుకుంటారు కొందరు. నో చెప్పలేకపోవడం మీ బలహీనత అయితే.. అది అవతలివారు అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశముంది. కాబట్టి మీపై ప్రెజర్ పెట్టే విషయాలకు నో చెప్పండి. నో చెప్పలేను సిగ్గు, మొహమాటం అనుకోకుండా.. సింపుల్‌గా మీకు వేరే పని ఉందని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోండి.
టెక్నాలజీని వాడుకోండి..
మీ వర్క్ లైఫ్‌లో టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తూ ఉండండి. వీటివల్ల పని తొందరగా అవుతుంది. అలాగే మీరు కాస్త ఈజీగా వర్క్‌ని ఫినిష్ చేయవచ్చు. వర్క్ పరంగా టూ డూ లిస్ట్‌ని మొయింటైన్ చేయండి. రిమైండర్స్ పెట్టుకోండి. దీనివల్ల మీరు చేయాల్సిన వర్క్ మరింత ఈజీ అయిపోతుంది.
రివ్యూ
మీరు చేస్తున్న వర్క్‌పై మీరే రివ్యూ ఇచ్చుకోండి. దీనివల్ల మీ వర్క్‌ని ఇంకా బెటర్ చేయొచ్చో లేదో తెలుస్తుంది. అలాగే మీరు చేస్తున్న మిస్టేక్స్ కూడా తెలుస్తుంటాయి. దీనివల్ల మీ వర్క్ మరింత బెటర్ అవుతుంది. తర్వాత ఈ తప్పులు చేయకుండా వర్క్ ఫినిష్ చేసేసి మీ పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేసేయండి.
Also Read : హైదరాబాద్ టూ ఈషా ఫౌండేషన్ రౌండ్ ట్రిప్ డిటైల్స్.. బడ్జెట్ కేవలం రూ.3,500 మాత్రమే