Must Visit Places in Andhra Pradesh : ట్రిప్‌కి వెళ్లాలని అందరికీ ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలీక.. లేదా ఎవరితో వెళ్లాలో తెలీక కొందరు ఆగిపోతుంటారు. మరికొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటారు. కానీ అక్కడ తమకి భాషతో, ఫుడ్‌తో ప్రాబ్లమ్ వస్తుందని ఆగిపోతూ ఉంటారు. లేదంటే అన్ని సెట్ అయ్యేవరకు ఆగుదామని.. పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తారు. కానీ మీరు ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే ఏపీలోని కొన్ని ప్రదేశాలు చుట్టేయొచ్చు.
ఇయర్ ఎండింగ్ 2024లోపు లేదా.. కొత్త సంవత్సరం 2025లో మీరు ఏపీలోని కొన్ని ప్రదేశాలను విజిట్ చేసి.. వాటి అందాలను ఆస్వాదించవచ్చు. దూరం ఉండే వాటికి వెళ్లట్లేదనే బాధతో దగ్గర్లో ఉండే ప్రకృతి అందాలను మిస్ అయ్యేవారికి ఇది మంచి మూవ్ అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో విజిట్ చేయగలిగే ప్రాంతాలు ఏంటో.. అక్కడ ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అరకు (Araku Valley)
విశాఖపట్నంలోని అరకు మీకు మంచి సీనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సహజమైన అందాలతో.. గొప్ప సాంస్కృతికతతో, కాఫీ సువాసనలతో మిమ్మల్ని ఇది ఆహ్వానిస్తూ ఉంటుంది. అక్కడ మీరు కాఫీ ప్లాంటేషన్స్, బొర్రా కేవ్స్, కటికి వాటర్ ఫాల్స్, ట్రైబల్ మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్‌ని చూడొచ్చు.
ట్రెక్కింగ్, హైకింగ్ ఇష్టపడేవారికి ఇది మంచి స్పాట్ అవుతుంది. కాఫీ ఇష్టపడేవారు ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్ ఆస్వాదించవచ్చు. ఫోటోలు దిగడానికి మంచి లోకేషన్లు ఉంటాయి. మానసికంగా ప్రశాంతతను కోరుకునేవారు అరకు వెళ్లి.. హాయిగా ఎంజాయ్ చేవచ్చు. అరకును సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరిలోపు వెళ్తే మంచి ఎక్స్‌పీరియ్స్ మీ సొంతమవుతుంది.
వైజాగ్(Vizag)
విశాఖపట్నం(The City of Destiny). ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత నగరం.. తూర్పు కనుమలు, బంగాళాఖాతంలో కూడిన ప్రధాన ఓడరేవు దీని సొంతం. ఇక్కడ మీరు బీచ్‌లు, సింహాచలం టెంపుల్, ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్, డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్, కైలాసగిరి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి.
వైజాగ్‌లో మీరు వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, షాపింగ్, టేస్టీ ఫుడ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వైజాగ్‌ని విజిట్ చేస్తే వెదర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది.
పాపికొండలు (Papikondalu)
పాపికొండలు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న సుందరమైన హిల్ స్టేషన్. ప్రకృతి సౌందర్యం, సాంస్కృతి, అడ్వెంచర్స్ని ఇష్టపడేవారు అక్కడికి ట్రిప్‌కి వెళ్లొచ్చు. పాపికొండలు హిల్స్, బోట్లో వెళ్తూ గోదావరి అందాలు, పోచమ్మ టెంపుల్, దగ్గర్లోని రాజమండ్రిని మీరు విజిట్ చేయవచ్చు. బోట్ రైడ్ మీకు గోదావరి సినిమా వైబ్స్ ఇస్తుంది. ట్రెక్కింగ్ చేయవచ్చు. వైల్డ్ లైఫ్, క్యాంపింగ్, అడ్వెంచర్స్ చేయాలనుకునేవారు ఇక్కడికి వెళ్లొచ్చు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
మారేడిమిల్లి(Maredumilli)
ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి మారేడుమిల్లి బెస్ట్ ఆప్షన్. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ గ్రామం అందమైన పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు. మారేడుమిల్లి ఫారెస్ట్, వాల్మీకి టెంపుల్, స్వర్ణధార, జలపాతంను చూడొచ్చు. ట్రెక్కింగ్, బోట్ రైడ్స్, వైల్డ్ లైఫ్, క్యాంపింగ్, క్లైంబింగ్ వంటి అడ్వెంచర్స్ చేయవచ్చు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇక్కడికి వెళ్తే వెదర్ బాగుంటుంది.
ఈసారి మీ ట్రిప్‌ని ఏపీలోని ఈ ప్రదేశాలకు షిఫ్ట్ చేయండి. తక్కువ ఖర్చులో ఈజీగా వెళ్లగలిగే ఈ ప్రాంతాలు మిమ్మల్ని అస్సలు డిస్సాపాయింట్ చేయవు.
Also Read : హైదరాబాద్ టూ గోకర్ణ, దండేలి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్.. మూడురోజులకు ఎంత ఖర్చువతుందంటే