Hyderabad to Gokarna and Dandeli Budget Trip Under 9k : హైదరాబాద్​లో ఉంటూ కర్ణాటకను ఎక్స్​ప్లోర్ చేయాలనుకుంటే.. మీరు గోకర్ణ, దండేలి బెస్ట్ ఆప్షన్. టెంపుల్స్, బీచ్​లను ఎంజాయ్ చేసేవారికి ఈ ట్రిప్ బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. ప్రకృతిని ఇష్టపడేవారు, ట్రెక్కింగ్, బీచ్​ వ్యూలు ఎంజాయ్ చేసేవారు.. బడ్జెట్​లో వెళ్లాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. మరి ఈ ట్రిప్​కి బడ్జెట్​లో ఎలా వెళ్లొచ్చు? మూడు రోజుల్లో అక్కడ ఏయే ప్రదేశాలు కవర్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


హైదరాబాద్ నుంచి హుబ్లీకి ప్రతిరోజు సాయంత్రం 3.50కి ట్రైన్ అందుబాటులో ఉంటుంది. HYD UBL EXP(17320) ట్రైన్​ ఎక్కితే.. హుబ్లీలో ఉదయం 6.35కి వెళ్తారు. స్లీపర్ టికెట్ ధర రూ.370 ఉంటుంది. హుబ్లీ నుంచి గోకర్ణ, దండేలి వెళ్లేందుకు  మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకోవచ్చు. నలుగురు కలిసి క్యాబ్​ను మూడురోజులకు తీసుకుంటే రూ.12,000 ఛార్జ్ చేస్తారు. అంటే మనిషికి మూడువేలు పడుతుంది. 


Day - 1 (దండేలీ ప్యాకేజ్​)


హుబ్లీ నుంచి దండేలి వెళ్లాక అక్కడ ఒకరోజుకు స్టే బుక్ చేసుకోవచ్చు. ఫుడ్, స్టే చేయడానికి, యాక్టివిటీల(silver wood Adventure stay packge) కోసం బుక్ చేసుకుంటే (24 Hours package) రూ.1300 పడుతుంది. ఈ ప్యాకేజ్​లో మూడు పూటల భోజనం ఫ్రీ. లంచ్​లో వెజ్ మాత్రమే ఉంటుంది కానీ అన్​లిమిటెడ్. డిన్నర్​లో వెజ్, నాన్​వెజ్​ కూడా ఉంటుంది. ఇది కూడా అన్​లిమిటెడ్. ఈ ప్యాకేజ్​లో మూడు వాటర్ యాక్టివిటీలు చేయవచ్చు. బోటింగ్, కైకింగ్, జోర్బింగ్ చేయవచ్చు. ఇండోర్ యాక్టివిటీలు ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, క్యారమ్స్, రైన్ డ్యాన్స్, డార్ట్​బోర్డ్, ఆర్చరీ, బ్యాడ్​మెంట్, వాలీబాల్, స్విమ్మింగ్ పూల్ ఇలా యాక్టివిటీలు చేయవచ్చు. 


Day - 2 (గోకర్ణ)


దండేలి నుంచి గోకర్ణ మార్నింగ్ స్టార్ట్ అయితే.. దారిలో విబూధి వాటర్ ఫాల్స్​ని విజిట్ చేయవచ్చు. గోకర్ణలో స్టే ఒక రోజుకు తీసుకోవచ్చు. స్టేకి రూ.500 అవుతుంది. గోకర్ణలో మురుదేశ్వర్, హోన్నవర్​ని విజిట్ చేయవచ్చు. 


Day - 3 (మహబళేశ్వరం)


మార్నింగ్ శ్రీ మహబళేశ్వరం గుడికి వెళ్లి.. అక్కడి నుంచి గోకర్ణలోని ఫేమస్ బీచ్​లు చూడొచ్చు. వీటిని ట్రెక్ చేయడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. కాబట్టి మీ షెడ్యూల్​ని దీని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెనింగ్​ మీరు హబ్లీకి వెళ్లొచ్చు. ఈ రెండు రోజులకు ఫుడ్​కి రూ. 1000 అవుతుంది. వాటర్ యాక్టివిటీస్​లో పాల్గొనాలనుకుంటే 1000 అవుతుంది. 


రిటర్న్


మీరు హుబ్లీ నుంచి హైదరాబాద్​కు రోజూ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. స్లీపర్ టికెట్ ధర రూ.370. హుబ్లీ జంక్షన్​లో రాత్రి 8.50కి ఎక్కితే.. హైదరాబాద్ ఉదయం 10.40కి రీచ్​ అవుతారు. 


ఈ ట్రిప్​లో భాగంగా మూడురోజులకు రూ. 8,500 అవుతుంది. మీరు చేసే యాక్టివిటీలు, వాటర్ గేమ్స్ బట్టి ఖర్చు తగ్గడం లేదా పెరుగుతూ ఉంటుంది. మరి ఇంకేమి ఆలస్యం. మీరు కూడా వీకెండ్ సమయంలో లేదా న్యూ ఇయర్​లో భాగంగా ట్రిప్​కి వెళ్లాలనుకుంటే ఈ ట్రిప్​ మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 



Also Read : హైదరాబాద్ టూ అరకు 3 డేస్, 2 నైట్స్ ట్రిప్.. బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్ ఇవే