Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీని చంపాలని ప్రయత్నించింది విద్యాదేవి కాదు అని మరో అమ్మాయి అని సీత నిరూపిస్తుంది. అనవసరంగా టీచర్‌ని తప్పుగా అనుకున్నారని సీత మహాలక్ష్మీ వాళ్లతో చెప్తుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత సీత మహాలక్ష్మీ ఆపి మీకు చావు తప్పి కన్ను లొట్టు పోయింది కదా ఇదంతా మీ స్కెచ్ అని నాకు తెలుసు అని సుమతి అత్తమ్మని ఇంటి నుంచి పంపించలేరని అంటుంది. ఇక విద్యాదేవి మహాలక్ష్మీతో ఆ లేడీ నోరు విప్పి ఉంటే నీ పని అయిపోయేదని అంటుంది. నేను నా మేనకోడలు కలిసి నీ నిజస్వరూపం బయట పెడతాం రెడీగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది.


రాత్రి మహాలక్ష్మీ జనార్థన్ ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతుంది. జనార్థన్‌కి కాల్ చేసి ఇంకా రాలేదేంటి అని అడిగితే పార్టీలో ఉన్నాను లేటు అవుతుంది. నువ్వు పడుకో అని చెప్తాడు. ఇక మహాలక్ష్మీ విద్యాదేవిని జైలుకి పంపిస్తేనే మనస్శాంతి అనుకొని పడుకుంటుంది. ఇక ఉదయం మహాలక్ష్మీ లేచి చూసే సరికి పక్కన జనార్థన్ ఉండడు. రాత్రి ఎంత లైట్ అయినా వస్తా అన్నాడు రాలేదా అనుకొని బయటకు వెళ్లి చూస్తుంది. అయితే జనార్థన్ విద్యాదేవి గదిలో విద్యాదేవి పక్కన పడుకోవడం చూసి మహాలక్ష్మీ బిత్తర పోతుంది. ఇప్పుడే విద్యాదేవి సంగతి తేల్చేస్తా అనుకొని తలుపు గడియ పెట్టి అందరిని పిలుస్తుంది. అందరినీ టీచర్, జనా కలిసి పడుకోవడం చూపిస్తుంది. భార్యభర్తలు కలిసి పడుకుంటే తప్పేంటి అని సీత అడుగుతుంది. మహాలక్ష్మీ సీతని నోర్ముయ్ అని తిడుతుంది. జనార్థన్, టీచర్‌ని నిద్ర లేపుతుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. సిగ్గు లేకుండా పరాయివాడి పక్కన పడుకుంటావా అని అర్చన తిడుతుంది. నీ లాంటి దాని వల్లే కుటుంబాలు కూలిపోతున్నాయి అని గిరిధర్ కూడా తిడతాడు. రామ్ కూడా తిడతాడు. నా తప్పు లేదు అని విద్యాదేవి అంటే నా భర్తతో పడక పంచుకుంటున్నావు సిగ్గులేదా అని మహాలక్ష్మీ తిడుతుంది. 


విద్యాదేవి అందరితో నేను నా గదిలో పడుకున్నా ఆయనే నా గదిలో పడుకున్నారు అని అంటుంది. సీత కూడా కరెక్టే కదా అంటుంది. ఇక జనార్థన్ పార్టీలో మందు ఎక్కువ అవ్వడం వల్ల పొరపాటున ఈ గదిలోకి వచ్చానని అంటాడు. ఇక అర్చన నిద్రలో బావ గారు నీ మీద చేయి వేశారా అంటే వేసుండొచ్చు నాకు తెలీదు దగ్గరకు తీసుకున్నారామో నాకు గుర్తులేదు అని విద్యాదేవి అంటుంది. అలాంటి ప్రశ్నలు వద్దని చిరాకుగా ఉందని మహాలక్ష్మీ చెప్తుంది. మీ కాపురం అయిపోయింది అత్తో అని సీత మహాలక్ష్మీకి సెటైర్లు వేస్తుంది. ఉదయం సీత రామ్‌తో మామయ్య అత్తయ్యని దగ్గరకు తీసుకొని ఉంటారా తాగిన మైకంలో ఏమైనా అయిందా అని రామ్‌ని అడుగుతుంది. మా నాన్న అలాంటి వాడు కాదని రామ్ అంటాడు. ఇక రిజిస్టర్ ఆఫీస్‌ నుంచి జనార్థన్‌ని కాల్ వస్తుంది.


ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మీ సైట్ క్లియర్ అయిందని మీరు సుమతి వస్తే సంతకాలు పెట్టి సైట్ దక్కించుకోవచ్చని చెప్తాడు. దాంతో జనార్థన్ చాలా సంతోషంతో కిచెన్లో ఉన్న విద్యాదేవి ఉంటే సుమతి సుమతి అని పిలుస్తాడు. అక్కడే ఉన్న మహాలక్ష్మీతో పాటు అందరూ షాక్ అయిపోతారు. సుమతి ఎవరు అని మహాలక్ష్మీ అడిగితే విద్యాదేవిని చూపించి తనే సుమతి అని అంటాడు. నీతో పని ఉంది అర్జెంటుగా బయటకు వెళ్లాలి అని సుమతిని తీసుకెళ్తుంటే మహాలక్ష్మీ అడ్డుకుంటుంది. జనార్థన్ తప్పుకో మహా అని మహాలక్ష్మీని తోసేసి సుమతిని తీసుకొని వెళ్తాడు. ఇంట్లో అందరూ ఏమైంది అని షాక్ అయిపోతారు. సుమతి, విద్యాదేవి ఒక్కరే అని మామయ్యకి తెలిసిపోయిందని సీత అంటుంది. ఇక అర్చన నీ పని అయిపోయింది మహా ఆ టీచర్ బావగారిని బట్టలో వేసుకుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఉండిపోవా నువ్విలా రెండు కళ్లలో ఇలా.. బావతో ఏకాంతంలో జ్యో.. దీప, కార్తీక్‌ల ఫస్ట్‌నైట్!