Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప, కార్తీక్ కలిసి ఆఫీస్‌లో తనని రెచ్చగొట్టిన విషయం జ్యోత్స్న పారిజాతంతో చెప్పి రగిలిపోతుంది. దీప నాకు మొగుడై కూర్చొందని నా ఓర్పు సహనం అన్నీ చచ్చాయని నాలో మంచితనం కూడా పోయిందని.. ఇంటి లోనూ మనస్శాంతి లేదు ఆఫీస్‌లోనూ మనస్శాంతి లేదు అని చాలా ఇరిటేట్ అవుతుంది.
జ్యోత్స్న: నేను ఆ దీపని చంపేస్తాను.
దాసు: అది నేను ఉండగా జరగదు. నచ్చని వాళ్లని దారికి అడ్డు వచ్చే వాళ్లని చంపమని నేర్పుతున్నావా నీ మనవరాలికి.
జ్యోత్స్న: ఈ మాట ఎవరు వినకూడదో వాళ్లే విన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడినా ఈయన గారు దీపే వారసురాలు అని అందరికీ చెప్పేలా ఉన్నారు.
పారిజాతం: దీని బాధ నీకు అర్థం కావడం లేదురా నీ కొడుకు ఇలాగే పెళ్లి చెడిపోయి ఉంటే నీకు అర్థం అయ్యేది.
దాసు: నా కొడుకు స్వప్నలు ప్రేమించుకున్నారు. కానీ కార్తీక్, జ్యోత్స్నలు ప్రేమించుకోలేదు కదా పెద్దల కోసం కార్తీక్ ఒప్పుకున్నాడు.
పారిజాతం: సర్లే ముసలోడు చూస్తే ఊరుకోడు ఎందుకు వచ్చావో అది చెప్పు.
దాసు: చెప్పను తొందర్లోనే అన్ని అర్థమవుతాయి. మీరు తొందర పడి ఏం చేయకండి. జ్యోత్స్న దీప జోలికి వెళ్లొద్దు అది నీకు అంత మంచిది కాదు.
పారిజాతం: ఆ దీపని ఏం చేయాలో ఆలోచిద్దాం నువ్వు మనసు పాడు చేసుకోకు పద లోపలికి వెళ్దాం.
కార్తీక్ రాత్రి గదిలో ఉంటే దీప పాలు తీసుకొని వెళ్తుంది. శౌర్య గురించి అడిగితే వాళ్ల నానమ్మల దగ్గర పడుకోవడానికి వెళ్లిందని చెప్తాడు. శౌర్య అక్కడ పడుకోని మనం ఇక్కడే పడుకుందాం అంటాడు. దీప మనసులో వీళ్లంతా కలిసి మమల్ని దగ్గర చేయాలి అని అనుకుంటున్నారని అనుకుంటుంది. ఇక దీప కార్తీక్‌కి పాలు ఇస్తుంది. ఇద్దరం సగం సగం పంచుకుందామని కార్తీక్ అంటే దీప సరే అంటుంది. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇక కార్తీక్ దీపతో ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మళ్లెపూలు తీసుకొచ్చా పెట్టుకోవాలి అని అంటే దీప దేవుడికి పెట్టానని చెప్తుంది. దానికి కార్తీక్ కొన్ని నువ్వు పెట్టుకోవచ్చు కదా అంటాడు. ఇక కార్తీక్ పడుకుందామని దీపతో అంటాడు. దీప వద్దని అంటే కార్తీక్ సరదాగా కాసేపు మాట్లాడుకుందామని అంటాడు. ఇక దీప ఆఫీస్‌లో అవమానాలు పడుతున్నారు. మిమల్ని జ్యోత్స్న దక్కించుకునే వరకు వదలదు అని నా వల్ల మిమల్ని తను ఇబ్బంది పెడుతుంది అది నాకు ఇష్టం లేదు అని అంటుంది.
ఇక ఉదయం జ్యోత్స్న ఆఫీస్‌లో చాలా ఫైల్స్ మేనేజర్‌కి ఇచ్చి కార్తీక్‌తో ఆ వర్క్ అంతా ఈరోజే పూర్తి చేయమని చెప్తుంది. ఆయన కార్తీక్ దగ్గరకు వెళ్లి ఫైల్స్ అన్నీ ఇస్తే దానికి జ్యోత్స్న ఎంత లేట్ అయినా వర్క్ పూర్తి చేసే వెళ్లు బావ అని చెప్తుంది. కాఫీ, టీ, జ్యూస్, ఫుడ్ అంతా నీ దగ్గరకే వస్తుందని అంటుంది. ఇంత వర్క్ ఒక్క రోజులో పూర్తి అవ్వదని కార్తీక్ అంటాడు. నువ్వు ఇప్పటికీ నాకు ఇష్టమే బావ నిన్ను బాధ పెట్టాలని ఇలా చేయడం లేదు అంటుంది. దాంతో కార్తీక్ వర్క్ చేస్తా నువ్వు వెళ్లు అని అంటాడు. ఇక దీప తన క్యాబిన్‌కి వెళ్లి నువ్వు వర్క్ చేసుకో బావ నేను నిన్ను దూరం నుంచి చూసుకుంటూ ప్రేమించుకుంటానని అనుకుంటుంది. దూరంగా చూస్తూ టీ కాఫీ స్నాక్స్ ఇస్తూ ప్రేమిస్తుంది. ఉండిపోవా నువ్విలా రెండు కళ్లలోపల అంటూ బావనే చూస్తూ ఉంటుంది. అందరూ ఆఫీస్‌లో నుంచి వెళ్లిపోతే జ్యోత్స్న, కార్తీక్ మాత్రమే ఉంటారు. ఇక దీప ఇంటి దగ్గర కార్తీక్ ఇంకా రాలేదని కంగారు పడుతుంది. ఫోన్ చేయమని అనసూయ, కాంచన చెప్తారు. ఇక పారిజాతం జ్యోత్స్నకి కాల్ చేసి చాలా లేట్ అయింది ఇంటికి రాలేదు ఏం అని అడిగితే జ్యోత్స్న విషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కిలాడీ లేడీని పట్టించిన సీత.. మహాలక్ష్మీ యాక్టింగ్ అంతా తుస్సేనా!