Trinayani Serial Today Episode నయని బాధ పడుతుంటే అక్కడికి విశాల్ వస్తాడు. నా వేలి ముద్రలు మారిపోయాయి బాబుగారు అని నయని బాధ పడుతుంది. విశాల్ అలా ఎలా మారిపోతాయి నయని అని అడుగుతాడు. నువ్వు నువ్వు కాదని ఎవరు అన్నా నేను నమ్మను అని అంటాడు. నువ్వు మారలేదు నీ రూపం మారలేదు నీ మాట మారలేదు నీ ప్రేమ మారలేదు అని అంటాడు. నయని మనసులో ఎలా చెప్పను మీతో బాబు గారు అని బాధ పడుతుంది. ఎవరు ఏమన్నుకున్నా నేను పట్టించుకోను అని విశాల్ అంటాడు.
వల్లభ: మమ్మీ త్రినేత్రి నయని కాదని తెలిసినా కూడా విశాల్ తమ్మి నమ్మడం లేదు అంటే ఏమై ఉంటుంది.
తిలోత్తమ: నయని కాదు అని అంటే ఈ వార్త గుప్పుమంటుంది. గాయత్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత్రి ఎక్కడా అంటూ మీడియా అడుగుతుంది. సమాధానం చెప్పాలి అంటే స్పష్టత లేదు. అందుకే విశాల్ చాలా తెలివిగా అలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నా. ఎన్ని ప్రయత్నాలు చేసినా విహారిని ఎమోషనల్‌గా సెంటిమెంట్‌తో దెబ్బ తీసి మనం క్యాష్ చేసుకోవాలి. మనం ఇప్పుడు నేరుగా ఆఫీస్‌కి వెళ్లి ఓ ఫైల్ రెడీ చేసి దాని మీద సంతకం పెట్టమని పవర్ ఆఫ్ అథారటీ మన చేతికి వచ్చేలా చేద్దాం. అప్పుడే మనమే ఆ ఛైర్‌లో కూర్చొంటాం. అదీ నయనికీ తెలీకుండా. నయని లేకుండా.
హాల్‌లో అందరూ ఉంటారు. విక్రాంత్, విశాల్ ఫైల్స్ చెక్ చేస్తుంటారు. ఇక తిలోత్తమ ఫైల్ విశాల్ చేతికి ఇచ్చి సంతకం పెట్టమని అంటుంది. కొంచెం డీటైల్స్ చెప్పు సంతకం పెడతా అని విశాల్ అడిగితే దానికి తిలోత్తమ నీ భార్య నయని వచ్చే వరకు ఆ స్థానం నాకు ఇస్తున్నట్లు ఫైల్ సిద్ధం చేశానని సంతకం పెట్టమని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. నయని ఉంది కదా అలా ఎలా సాధ్యం అని విశాల్ అడిగితే తను నయని కాదని నయని వచ్చే వరకు అధికారం తనకు కావాలని తిలోత్తమ అంటుంది.
విక్రాంత్ కూడా విశాల్ నయని తరఫున మాట్లాడితే జీతం పెరుగుతుందనా వంత పాడుతున్నావని వెటకారం చేస్తారు. అందరూ తగులు కోవడంతో విశాల్ అందరినీ ఆపి నయని ఆఫీస్‌కి వచ్చే వరకు అమ్మ కోరుకున్నట్లే మ్యానేజింగ్ డైరెక్టర్ పోస్ట్‌లో పెడతాను అని సంతకాలు పెడతాడు. విక్రాంత్ వద్దని ఎంత చెప్పినా వినడు. దాంతో గాయత్రీ పాప అక్కడే ఉన్న కాఫీని ఆ పేపర్ల మీద తోసేస్తుంది. త్రినేత్రి క్లాప్స్ పెడుతుంది. బాబుగారు సంతకం పెట్టినా అది చెత్త కాగితం అయిపోయిందని అంటుంది. దాంతో తిలోత్తమ ఈ పిల్ల చేసిన పనికి రెండు తగిలించాలి అని కొట్టడానికి వెళ్తే తిలోత్తమను త్రినేత్రి చేయి పట్టుకొని ఆపుతుంది.
నయని తిలోత్తమతో పాప కావాలనే మీకు అధికారం రాకుండా ఆపిందని తను పిల్ల కాదు గత జన్మలో విశాల్ బాబు గారి తల్లి అన్నీ తెలిసే చేసిందని తిలోత్తమను వెనక్కి నెట్టేస్తుంది. అందరూ తిలోత్తమ తిక్క కుదిరింది అన్నట్లు చూస్తారు. నన్ను నువ్వు అవమానించినందుకు నాకు ఎక్కువ కోపంగా ఉందని తిలోత్తమ చెప్పి దీనికి ప్రతిఫలం అనుభవిస్తావని అంటుంది. ఇక వల్లభ మరో పేపర్ తెస్తా సంకతం పెడతావా అంటే విశాల్ నేను పెట్టను అంటే పెట్టను అని చెప్తాడు. తిలోత్తమ, వల్లభలు వెళ్లిపోతారు. పేపర్ మీద కాఫీ పడినందుకు సుమన చాలా ఫీలవుతుంది. విక్రాంత్ వెటకారంగా మాట్లాడుతాడు. నీకు అందులో భాగం ఉందా అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కిలాడీ లేడీని పట్టించిన సీత.. మహాలక్ష్మీ యాక్టింగ్ అంతా తుస్సేనా!