బుల్లితెరపై స్ట్రీమింగ్ అయ్యే పలు షోలలో యాంకర్స్ మాత్రమే కాకుండా కమెడియన్స్ కూడా పంచుల మీద పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తారన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఆ పంచులు హద్దు మీరడం వివాదాలకు తెర తీస్తే, మరికొన్నిసార్లు ఆ హద్దు మీరిన కామెడీ కూడా కడుపుబ్బా నవ్విస్తుంది. తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ బట్టతలపై పంచులు వేయడం హాట్ టాపిక్ గా మారింది.
'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే బుల్లితెర షోలో రష్మి గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి ఇంద్రజ జడ్జ్ గా ఉండగా, అందులో పలువురు కమెడియన్స్ సమయస్ఫూర్తితో వేసే పంచులు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' డిసెంబర్ 15వ తేదీకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో రష్మీ ఇమ్మాన్యుయేల్ పై షాకింగ్ పంచ్ వేస్తూ కనిపించింది.
ముందుగా షోలో భాగంగా ఒక బిస్కెట్ ని ముఖం (నుదుటి)పై పెట్టుకుని, చేతులు వాడకుండా నోట్లోకి తీసుకురావాలని టాస్క్ పెట్టుకున్నారు. రష్మీ ఆ టాస్క్ ని పర్ఫెక్ట్ గా చేసి అదరగొట్టింది. ఆ తర్వాత జడ్జ్ ఇంద్రజతో పాటు షోలో పార్టిసిపేట్ చేసిన కమెడియన్లు కూడా ఇదే టాస్క్ ని ట్రై చేశారు. ఆల్మోస్ట్ అందరూ ఓడిపోయారు. ఇంద్రజ అయితే నోటిదాకా వచ్చిన బిస్కెట్ ను తినేస్తుందేమో అనుకునేలోపే అది జారిపోయింది. అయితే ఇమ్మాన్యుయేల్ వంతు వచ్చేసరికి రష్మీ గౌతమ్ మాట్లాడుతూ "ముఖంపై బిస్కెట్ పెట్టాలన్నారు... నీ ముఖం ఇక్కడుందా?" అంటూ బట్టల తలను చూపిస్తూ నవ్వేసింది.
దీంతో ఇమ్మాన్యుయేల్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నవ్వుతూ ఉండిపోయాడు. ఎందుకంటే ఇది షోలో భాగంగా కామెడీగా వేసిన పంచ్. కాబట్టి ఎవ్వరూ సీరియస్ అవ్వకుండా సరదాగా, ఆహ్లాదకరంగా షోని నడిపించారు. అయితే ఇలాంటి షోలలో పర్సనల్ విషయాలను కూడా సరదాగా ప్రస్తావించడం మామూలే. ఇక ఆ తర్వాత నూకరాజు వేసే వరుస పంచులు మరింత కామెడీగా ఉన్నాయి.
నూకరాజు, ఇమ్మాన్యుయేల్, ఆటో రాంప్రసాద్ మరో టాస్క్ ని పెట్టుకున్నారు. అందులో భాగంగా నూకరాజు చేతులు, తలపై గ్లాసులు పెట్టుకుని కదలకుండా నిలబడాలి. మరోవైపు నుంచి ఇమ్మాన్యుయేల్ బాల్ తో కొట్టి, ఆ గ్లాసులన్నీ కింద పడిపోయేలా చేయాలి. అయితే ఈ టాస్క్ లో ముందు గ్లాస్లను టార్గెట్ చేసిన ఇమ్మాన్యుయేల్, ఆ తర్వాత ఎక్కడెక్కడో కొట్టినట్టుగా చూపించారు ప్రోమోలో. చివరికి 'నువ్వు కొట్టాల్సింది గ్లాసుని రా' అంటూ నూకరాజు కింద కూర్చుండి పోయాడు. దీంతో ఇంద్రజ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మరో హైలెట్. సెట్ లో ఉన్న వారంతా ఈ సీన్ చూసి తెగ నవ్వుకున్నారు. మొత్తానికి తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమోలో ఇవే హైలెట్స్ గా నిలిచాయి. అలాగే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' రానున్న ఎపిసోడ్లో డ్యాన్స్ లు, పాటలతో ఫుల్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు.