Meghasandesam Serial Today Episode: ఏడుస్తున్న భూమిని ప్రసాద్‌ ఓదారుస్తాడు. కన్నీటితో కష్టాలను దాటాలనుకోవడం తప్పు నాలాంటి పరిస్థితి నీకు రాకూడదమ్మా.. నీవైపు నుంచి కూడా ప్రయత్నం ఉండాలి. నువ్వు తన మనిషేనన్న నమ్మకం గగన్‌కు ఇవ్వాలి అని చెప్తాడు. అందుకు నేనేం చేయాలి మామయ్య అని భూమి అడుగుతుంది. ఒకసారి ఫోన్‌ చేసి మాట్లాడు అమ్మా.. అని చెప్పానే భూమి ఫోన్‌ చేస్తుంది. పూరి ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది. భూమిని ఎలా ఉన్నావని అడుగుతుంది. శారద వచ్చి భూమితో మాట్లాడుతుంది. తర్వాత భూమి తాను గగన్‌ తో మాట్లాడాలి అని అడుగుతుంది. పూరి ఫోన్‌ గగన్‌కు ఇచ్చి వెళ్లిపోతుంది.


గగన్‌: హలో భూమి నా మనసులో మాట నీకు చెప్పేశాను. కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియడం లేదు. నువ్వేదో చెప్తున్నావు అనుకునేంతలోనే వాడు వచ్చి నన్ను కొట్టాడు.


భూమి: అందుకు అంకుల్‌ తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను.


గగన్‌: ఏయ్‌ వాడు కొట్టినందుకు కాదు. నీ మనసులో ఏముందో తెలియకే బాధపడుతున్నాను భూమి. చెప్పు భూమి నీ మనసులో ఏముందో నాకు చెప్పు భూమి. చెప్పు భూమి నువ్వంటే నాకు ఇష్టమని ఒక్కమాట చెప్పు. అప్పుడు వాడు కాదు కదా.. ఆ దేవుడు కూడా మనల్ని ఎవ్వరూ ఆపలేరు. అవసరమైతే వాణ్ని చంపేస్తాను. ఆ ఇంటి నుంచి నిన్ను తెచ్చుకుంటాను.


  అంటూ గగన్ చెప్పగానే భూమి ఏడుస్తూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. గగన్‌ కూడా బాధగా ఫోన్‌ కట్‌ చేస్తాడు. భూమి ఏడుస్తుంటే.. ఎందుకమ్మా ఏడుస్తూ ఫోన్‌ కట్‌ చేశావు అని ప్రసాద్‌ అడుగుతాడు. ఇష్టమని ఒక్కమాట చెప్పమంటున్నాడు మామయ్య.. చెప్తే ఇక్కడికి వచ్చి మా నాన్నను చంపైనా నన్ను తీసుకెళ్తా అంటున్నాడు చెప్పమంటారా మామయ్య అంటూ ఏడుస్తుంది భూమి. గగన్‌ కూడా బాధపడుతుంటాడు. ఇంతలో నక్షత్ర ఫోన్‌ చేస్తుంది.


నక్షత్ర: హలో బావ..


గగన్: ఎవరు..?


నక్షత్ర: నేను అని నీకు తెలుసు.. అయినా నా పేరు నీ చెవులారా వినాలని ఆశ పడుతున్నావు కదూ..


గగన్‌: రోడ్డుపై వెళ్తున్నప్పుడు పక్కన డస్ట్‌ బిన్‌లో చాలా కనిపిస్తాయి. వాటిని కనులారా చూడాలని.. వాటి పేరు చెవులారా వినాలని ఏ స్టుపిడ్‌ అనుకోడు..


నక్షత్ర: పోలిక దరిద్రంగానే ఉన్నా అది మన ఇద్దరికీ కనెక్టివ్‌ గానే ఉంది బావ. డస్ట్‌ బిన్‌ నేను స్టుపిడ్‌ అంటే చెత్త.. ఎంతైనా చెత్త వచ్చి నాలోనే పడాలని అర్థం.


అని నక్షత్ర చెప్తుంటే.. గగన్‌ కోపంగా వెతుక్కుంటూ వచ్చి కొట్టేంత కోపం తెప్పించకు మళ్లీ నీ బాబుతో గొడవలు మొదలవుతాయి అనగానే అయ్యో నా బాబుతో నువ్వు క్లోజ్‌గా ఉండాలి. నన్ను ఇచ్చి పెళ్లి చేయమని నా బాబు కాళ్ల మీద పడి మొక్కాలి అంటూ మాట్లాడుతుంది. దీంతో గగన్‌ కోపంగా తిట్టగానే నువ్వు నాకు ఎందుకు టెక్స్‌ మెసేజ్‌ పెట్టావు కావాలంటే నీ ఫోన్‌ ఒక సారి చెక్‌ చేసుకో అంటుంది. ఫోన్‌ చెక్‌ చేసుకున్న గగన్‌ షాక్‌ అవుతాడు. ఈ మెసేజ్‌ నేను పెట్టలేదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అని గగన్‌ అనగానే అవును బావ నీ గెస్‌ కరెక్టే.. నీ ఫోన్‌ నుంచి నా ఫోన్‌కు మెసేజ్‌ చేసకుంది నేనే అంటూ జరిగింది చెప్తుంది నక్షత్ర. గగన్‌ షాక్‌ అవుతాడు. నీ బర్తుడేకు నీకు స్పెషల్‌ సూట్‌ కుట్టించాను. అది వేసుకుని నా బర్తుడేకు రావాలి. నాకు విషెష్ చెప్పాలి లేదంటే నీ మెసేజ్‌ సోషల్ మీడియాలో పెడతాను అంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!