Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ దీపతో గుత్తి వంకాయ కూర వండించుకొని ఎంతో ఇష్టంగా తినే టైంకి ఆఫీస్ నుంచి జ్యోత్స్న ఫోన్ చేయించి అర్జెంటుగా రమ్మని చెప్పిస్తుంది. దాంతో కార్తీక్ ఆఫీస్‌కి వెళ్తాడు. తినేసి వెళ్లమని దీప చెప్తే వద్దు అని చెప్పి కార్తీక్ పరుగులు తీస్తాడు. దీప మనసులో నా మీద కోపంతో జ్యోత్స్న కార్తీక్ బాబుగారిని ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటుంది.
కార్తీక్ ఆఫీస్‌కి వెళ్తాడు. జ్యోత్స్నతో ఏంటి అంత అర్జెంట్ రాకపోతే ఇంటికి వచ్చేస్తా అనడం ఏంటి అని అడుగుతాడు. ఇక జ్యోత్స్న మీరే మాజీ సీఈఓ కాదా అకౌంట్స్‌లో నాకు కొన్ని డౌట్స్ వచ్చి పిలిచాను అని అంటాడు. కార్తీక్ ఫైల్స్ తీసుకొని చూసి ఇంత చిన్న వాటికి నేను ఎందుకు అవతల భోజనం చేయకుండా వచ్చానని కోప్పడి తన క్యాబిన్లోకి వెళ్లిపోతాడు. ఇక కార్తీక్ తన క్యాబిన్‌లోకి వెళ్లి ఈ మేడం ఇంటికి వచ్చేస్తా అని చెప్పిందని అనవసరంగా కంగారు పడి వచ్చేశా నాకు బుద్ది లేదు అని అనుకుంటాడు. ఇక జ్యోత్స్న లంచ్ ఏర్పాటు చేసి కార్తీక్‌ని పిలుస్తుంది. కార్తీక్ వెళ్తాడు. ఇప్పుడు తినను ఇంటికి వెళ్లి తింటాను అని కార్తీక్ అంటే నీ కోసం ఎవరూ ఫుడ్ తీసుకురారు బావ నీ కోసం నేను తప్ప ఎవరూ ఆలోచించరు అని అంటుంది.
అప్పుడే దీప క్యారేజ్‌తో ఎంట్రీ ఇస్తుంది. జ్యోత్స్న ఉడికి పోతుంది. భార్య అంటే ఇలా ఉండాలి అని దీపని పొగిడేస్తాడు. దాంతో జ్యోత్స్న నన్ను ఏడిపించడానికే ఇలా చేస్తున్నావ్ అని తెలుసు అని అనుకుంటుంది. ఇక కార్తీక్ గుత్తివంకాయ పట్టుకొని సీఈఓ గారు తింటారా నా భార్య నా కోసం ప్రేమగా చేసిందని ఏడిపిస్తాడు. ఇక దీప తినలేదు అని తెలుసుకొని దీపని పక్కనే కూర్చొపెట్టుకొని ఇద్దరూ కలిసి తింటారు. జ్యోత్స్న చూసి రగిలిపోతుంది. బావని పెళ్లి చేసుకున్నావన్న కోపం ఓ వైపు అసలైన వారసురాలివి నువ్వే అన్న కోపం ఇంకోవైపు ఇంత కన్నా నా జీవితంలో దరిద్రమైన రోజు ఉండదు అని జ్యోత్స్న అనుకుంటుంది. కూర ఎలా ఉందని దీప అడిగితే కార్తీక్ మాటలు లేవు అని ఇది ఆఫీస్ కాబట్టి ఊరుకున్నా లేదంటే నిన్ను ఎత్తుకొని గిరా గిరా తిప్పేవాడిని అని అంటాడు.
కార్తీక్ దీపతో ఇక నుంచి నువ్వు రోజు నాకు ఇష్టమైన వంటకం చేసి తీసుకురావాలి మనం కలిసే తినాలి అని కార్తీక్ అంటే జ్యోత్స్న ఇక ఆపండి ఇది మీ ఇళ్లు అనుకున్నారా ఆఫీస్ అనుకున్నారా మీ ఇంటి దగ్గర ఎలా అయినా ఉండండి కానీ ఇక్కడ అలా కుదరదు అని అరుస్తుంది. దానికి అసలు సిగ్గు ఉందా అని కోప్పడుతుంది. దాంతో దీప జ్యోత్స్నకి మాటలతో కాదు రెండు తగిలిస్తే దెబ్బకి సెట్ అయిపోతుందని అంటుంది. నా ఆఫీస్‌కి వచ్చి నా మీద అరుస్తావా అని జ్యోత్స్న అంటే మీ ఇంటికి వచ్చి అయినా అరుస్తా అని దీప అంటుంది. నీ భర్తకి నువ్వు భోజనం తీసుకురావాలి అంటే బయట ఇచ్చి వెళ్లిపో అని చెప్పి మ్యానేజర్‌ని పిలిచి లాగిపెట్టి కొట్టి ఎవరినైనా లోపలికి పంపే ముందు నా పర్మిషన్ తీసుకో అని అంటుంది.
జ్యోత్స్న మాటలు పట్టించుకోకుండా కావాలనే దీప, కార్తీక్‌లు అన్నం పంచుకొని తింటారు. తినేసి దీప కొంగులో చేయి తుడుచుకొని నా మీద కోపంతో ప్రభాకర్‌ని కొట్టావ్ కదా నేను నా భార్య ఒకటే ఇద్దరం వేరు కాదు ఒకటే అని చెప్పి దీప ఇంటికి వెళ్లు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా అంటాడు. జ్యోత్స్న రగిలిపోతుంది. తల పట్టుకుంటుంది. ఏం చేయాలి అని గ్రానీ అని పెద్దగా అరుస్తుంది. ఇంటికి వెళ్లి పారిజాతం బయట ఉంటే తన మీద కారు పెట్టేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గుత్తి వంకాయతో దీపలో మార్పు.. ఎగిరి గంతులేస్తున్న కార్తీక్.. గాలి తీసేసిన జ్యోత్స్న!