Prema Entha Madhuram Serial Today Episode: అభయ్‌ కోపంగా అకికి రాకేష్‌తో పెళ్లి చేస్తానంటాడు. దీంతో శంకర్‌, గౌరి వద్దన్నా.. వినకుండా ఇది ఫైనల్‌ అంటూ చెప్పడంతో రాకేష్‌ లోపల హ్యాపీగా ఫీలవుతూ.. బయటకు మాత్రం ఇష్టం లేనట్టు నటిస్తాడు. అభయ్‌ మాత్రం ఈ పెళ్లి జరగాల్సిందే అంటాడు. అకి ఏడుస్తూ పైకి వెళ్లిపోతుంది. అభయ్‌ కూడా వెళ్లిపోతాడు. గౌరి వెళ్లి అభయ్‌తో మాట్లాడతానని చెప్తే వద్దని కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకూడదని కూల్‌ అయ్యాక రేపు మాట్లాడదామని చెప్తాడు. తర్వాత గౌరి అకి రూంలోకి వెళ్లగానే అకి ఏడుస్తుంది. గౌరిని అమ్మా అని పిలవడం శంకర్‌ వింటాడు. షాక్‌ అవుతాడు. గౌరి కూడా అమ్మ చెప్తే ఎవరైనా కాదంటారా అనగానే మరింత ఆలోచనలో పడిపోతాడు శంకర్‌. తర్వాత గౌరి బయటకు వస్తుంది. శంకర్‌ను చూసి షాక్‌ అవుతుంది.


గౌరి: శంకర్‌ గారు మీరు ఎప్పుడు వచ్చారు. అది అభయ్‌ కోప్పడ్డాడని ఓదారుస్తున్నాను.


శంకర్‌: విన్నాను..


జెండే: శంకర్‌  నేనే అకిని ఓదార్చమని గౌరిని పంపాను. గౌరి దగ్గర అయితే అకి కాస్త రిలీప్‌ అవుతుందని..


శంకర్‌: గౌరి గారు మీరు అకిని ఎలా ఓదార్చారు. చెప్పండి ఎలా ఓదార్చారు.. అమ్మలా ఓదార్చారు.. అందుకే ఆడపిల్ల బాధ ఆడపిల్లకే తెలుస్తుంది. ఏమంటారు గౌరిగారు. మీరు అకిని అలా ఓదారుస్తుంటే ఒక్క నిమిషం మీరు అకికి నిజమైన అమ్మలా అనిపించారు. ఇప్పుడండి మీ మీద నాకు ఒక ఇంచు గౌరవం పెరిగింది. అకిని మీరు అమ్మలా ఓదార్చారు కదా.. ఇప్పుడు నేను అకిని నేను నాన్నలా ఓదారుస్తాను. మీరు అమ్మ అయితే నేను నాన్న అవుతాను.. ఇప్పుడే వెళ్లి నాన్నలా ఓదారుస్తాను.


 అంటూ శంకర్‌ వెళ్లిపోతాడు.


గౌరి: హమ్మయ్యా.. ఆర్య సార్‌ కు డౌటు వచ్చిందేమోనని టెన్షన్‌ పడిపోయాను సార్‌ దేవుడి దయ వల్ల ఆయనే ఏదో అర్తం చేసుకుని కన్వీన్స్‌ అయిపోయారు. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితుల్లోనే నిజం బయటపడుతుందేమో.. అది సరే కానీ అభయ్‌ ఏంటి సార్‌ ఇంత మొండిగా ఆలోచిస్తున్నాడు.


జెండే: నాకు తెలుసు అను. కానీ అభయ్‌ తనలా ఆలోచించడం లేదు. రాకేష్‌ వల్ల ఇంపాక్ట్ అవుతున్నాడు.


గౌరి: కానీ నేను చెప్తున్నా కూడా ఎందుకు సార్‌ వినడం లేదు.


జెండే: రవి మీద కోపం. తను ఏదో అకిని ట్రాప్‌ చేస్తున్నాడనే డౌటులో ఉన్నాడు. కానీ అది మాత్రం జరగకూడదు.


గౌరి: జరగకూడదు సార్. అభయ్‌ని ఈ విషయంలో ఒప్పించాలి.


  అని గౌరి అనగానే అయితే ఇప్పుడు వద్దు అని రేపు ఉదయం మాట్లాడదామని చెప్పి వెల్లిపోతాడు. మరుసటి రోజు అభయ్‌ రాకేష్‌, అకి లకు ఎంగేజ్‌మెంట్‌ ఇవాళే చేస్తున్నామని.. కొద్ది సేపట్లో పంతులు గారు వస్తున్నారని గౌరి, జెండేలకు చెప్తాడు. జెండే, గౌరిలు వద్దని నీ నిర్ణయం కేర్‌ఫుల్‌గా తీసుకోమని చెప్తుంది గౌరి. దీంతో అభయ్‌ని కన్వీన్స్‌ చేయాలని చూసిన వినకుండా అకిని తొందరగా రెడీ చేయమని చెప్పి వెళ్లిపోతాడు. గౌరి, జెండే ఆర్య దగ్గరకు వెళ్తారు. అకి, రాకేష్‌ల ఎంగేజ్‌మెంట్‌ లకు అభయ్‌ రెడీ చేస్తున్నాడని చెప్పగానే శంకర్‌ ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. మీరు చెప్తేనే అభయ్‌ వింటాడని గౌరి, జెండేలు చెప్తారు. సరే ఆలోచిస్తాను అంటాడు శంకర్‌. మరోవైపు అకి ఎంగేజ్‌మెంట్‌ కు వెళ్లడానికి యాదగిరి రెడీ అయి వచ్చి జ్యోతిని ఇంకా రెడీ కాలేదేంటి అని అడుగుతాడు. దీంతో జ్యోతి కోపంగా యాదగిరిని తిడుతుంది.  ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!