Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode  లక్ష్మీ, విహారి వెళ్లిపోతామని ఆదికేశవ్‌తో చెప్తారు. దానికి ఆదికేశవ్ సడెన్‌గా మీరు వెళ్లిపోతా అంటుంటే నా గుండె ఆగిపోయిన అంత పని అవుతుందని బాధ పడతాడు. వస్తుంటాం అని విహారి అంటే మీరు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మాటి మాటికీ రమ్మని చెప్పలేను అని అంటాడు. అయినా విహారి ఒప్పుకోకపోవడంతో ఈ రోజు రాత్రి గుడిలో కార్తీక దీపం వదిలి వెళ్లండి అని చెప్తుంది. ఇక కనకం సైగ చేయడంతో విహారి ఉండటానికి ఒప్పుకుంటాడు.


గౌరీ కనకాన్ని పక్కకు తీసుకెళ్తుంది. ఇక విహారితో మాట్లాడాలి అని ఆదికేశవ్ చెప్పి మా అమ్మాయి మిమల్ని అమెరికాలో ఏం ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడుగుతాడు. దాంతో విహారి లక్ష్మీకి తన ఇంట్లో జరిగే అవమానాలు గుర్తు చేసుకుంటాడు. ఇక గౌరీ కనకంతో అల్లుడు గారు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా అంటే కనకం కూడా అన్నీ గుర్తు చేసుకుంటుంది. బాగా చూసుకుంటున్నారని చెప్తుంది. అమెరికా వాళ్లకి ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ అమ్మాయిల్ని పని మనుషుల్లా చూస్తారు కదా అలా ఏం లేదు కదా అంటే అలా ఏం లేదు అని కనకం చెప్తుంది. ఇక వేరే అమ్మాయితో స్నేహం ఉందా అని గౌరీ అడిగితే కనకం సహస్రని గుర్తు చేసుకుంటుంది. అయినా అలాంటిదేమీ లేదని తన భర్త తనకు అన్యాయం చేయడు అని చెప్తుంది. ఇక కనకాన్ని రాణితో కలిసి వేరే ఇంటికి వెళ్లి జున్ను పాలు తీసుకురమ్మని చెప్తుంది. ఇక ఆదికేశవ్ విహారి చేతులు పట్టుకొని మీ చేతుల్లో నా కూతురిని పెట్టినందుకు గర్వంగా ఉన్నానని మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఏమోషనల్ అవుతాడు. విహారి చేతులు చూసుకుంటూ బాధ పడతాడు.


ఇక సహస్ర ఓ చోట కారు ఆపి వాటర్ బాటిల్ కొని తీసుకొస్తా అని షాపు దగ్గరకు వెళ్తుంటుంది. అటుగా కనకం, రాణి నడుచుకుంటూ వస్తుంటారు. ఇక రాణి కనకంతో నువ్వు బావ డోర్ లాక్ చేయకుండా రొమాన్స్ చేసుకుంటున్నారని సెటైర్లు వేస్తుంది. ఇక సహస్ర వాటర్ బాటిల్ కొన్న తర్వాత కాస్త దూరంలో లక్ష్మీని చూస్తుంది. అయితే మొక్కలు చాటు ఉండటంతో వెళ్లి చూసే సరికి లక్ష్మీ వెళ్లిపోతుంది. ఇక వెనుక నుంచి లక్ష్మీని చూసి సహస్ర ఫాలో అవుతుంది. కాస్త దూరం వెళ్లే సరికి సహస్ర లక్ష్మీని మిస్ అయిపోతుంది. ఇంతలో అంబిక వస్తే సహస్ర లక్ష్మీని చూశానని చెప్తుంది. చుట్టూ చూస్తే ఎవరు అక్కడ ఉండకపోవడంతో లక్ష్మీ ఇక్కడెందుకు ఉంటుందని అంబిక అంటుంది. తన ఊరు కూడా ఇదే అయిండొచ్చు అని సహస్ర అంటుంది. దాంతో అంబిక రేపటి వరకు ఉంటాం కదా చూద్దాంలే అంటుంది అంబిక.  


ఇక లక్ష్మీ రెడీ అవుతుంది. లక్ష్మీని చూసి తల్లి గౌరీ కుందనపు బొమ్మలా ఉన్నావని మురిసిపోతుంది. ఎప్పుడూ మొగుడికి ముద్దు వచ్చేలా ఉండాలని చెప్తుంది. ఇంతలో ఆదికేశవ్ కూడా వచ్చి కనకాన్ని చూసి లక్ష్మీ దేవిలా ఉన్నావ్ తల్లి అని కూతురిని ముద్దాడుతాడు. లక్ష్మీ తల్లి దండ్రులు వెళ్లిపోయిన తర్వాత రాణి లక్ష్మీతో నిన్ను ఇలా బావ గారు చూస్తే కొరికేస్తారని ఎప్పుడూ నువ్వు బావగారికి సుకుమారంగా కనిపించాలని అంటుంది. ఇంతలో విహారి వచ్చి అలా చూస్తూ ఉంటే కనకం సిగ్గు పడుతుంది. దాంతో రాణి బావగారు ఏంటి మా అక్కని అలా చూస్తున్నారు కొరికేయాలి అని ఉందా అంటూ బావని ఆటపట్టిస్తుంది. దాంతో లక్ష్మీ రాణిని పంపేస్తుంది.


విహారి లక్ష్మీ దగ్గరకు వచ్చి లక్ష్మీ రాణి కాస్త ఓవర్‌గా చెప్పినా కూడా నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావ్ అని అంటాడు. ఇక లక్ష్మీ నిన్ను మావాళ్లు ఇబ్బంది పెడుతున్నారు కదా మీకు ఇష్టం లేకపోతే గుడికి వెళ్లడం మానేద్దాం అని అంటే విహారి వాళ్ల సంతోషం కోసమే వచ్చాం కదా ఏం పర్లేదు అంటాడు. ఇక లక్ష్మీని అలాగే చూసి నవ్వుకుంటాడు. ఏంటి అలా చూస్తున్నారు అని కనకం అంటే నీకు నీ ఫ్యామిలీకి ఎదుటి వాళ్లని సంతోష పెట్టడం తప్ప బాధ పెట్టడం తెలీదు అని పొగిడేస్తాడు. నీ జీవితం నా వల్ల  ఎందుకు పనికి రాకుండా అయిపోయింది నీకు మంచి జీవితం ఇవ్వాలి అని చెప్పబోయేలోపు లక్ష్మీ ఆపి ఈ పెళ్లి అనే మజిలీ మరోసారి నా జీవితంలోకి రాదని నా మెడలో ఒక్కసారి తాళి పడిపోయింది మీతో పెళ్లి అయింది దాన్ని నేను అర్థం లేని పెళ్లిగా వదిలేయలేను అంటుంది. ఇంతలో ఆది కేశవ్ వచ్చి ఇద్దరినీ పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీకి తనకు సంబంధించి విస్తుపోయే నిజం చెప్తానని మిత్రకి షాక్ ఇచ్చిన లక్ష్మీ!