Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జున్నుతో లక్కీ కేసు ఓడిపోతామని పార్వతి అమ్మ నన్ను తీసుకెళ్లిపోతుందని చెప్పి ఏడుస్తుంది. అమ్మానాన్న ఏం చేయలేకపోతున్నారని అంటుంది. మీ అందరినీ వదిలి వెళ్లిపోవాలని దేవుడే నన్ను కాపాడాలని అంటుంది. దాంతో జున్ను ఆంజనేయ స్వామిని తలచుకుంటాడు. స్వామి వస్తాడు. జున్ను స్వామి మీద కోప్పడతాడు. లక్కీకి వెళ్లడం ఇష్టం లేదని తన తల్లి ఎవరో చెప్పు అంటే స్వామి దానికి లక్కీ తన తల్లి దగ్గరే ఉందని అంటాడు. దానికి జున్ను లక్ష్మీ మా అమ్మ లక్కీ తల్లి కాదు లక్కీ తల్లి ఎవరో చెప్పు అంటాడు. నేను చెప్తుంది లక్కీ తల్లి గురించే మీరే అర్థం చేసుకోవడం లేదని స్వామి అంటారు.


దాంతో జున్ను లక్కీని తన తల్లిని కలిపే బాధ్యత నీదే స్వామి అని ఆంజనేయుడికి ఆ బాధ్యత అప్పగిస్తాడు. స్వామి లక్కీని పిలిచి లక్కీ కన్నీళ్లు తుడుస్తారు. మన సంకల్ప బలమే మనని విజయం వైపు నడిపిస్తుందని చెప్తారు. స్వామి ఏం చెప్పకుండా వెళ్లిపోయారని లక్కీ, జున్ను అనుకుంటారు. ఇక మరోవైపు సరయు, మనీషా, లాయర్ చాణక్య, పార్వతి, దేవయాని అందరూ మందు తాగుతూ మీటింగ్ పెట్టుకుంటారు. లక్ష్మీని తక్కువ అంచనా వేయొద్దని దేవయాని చెప్తుంది. 


దేవయాని: ఏదో ఒకటి చేసి కేసు గెలవండి లాయర్ గారు. 
పార్వతి: ఆ పిల్లని తీసుకొని నేను ఏం చేయాలి.
దేవయాని: దాని కోసం వేరే సెటప్ చేశాంలే. కేసు పూర్తయి తీర్పు మనకు అనుకూలంగా రాగానే పాపని తీసుకొని వచ్చేయ్.
మనీషా: బయట బీహార్ గ్యాంగ్ రెడీగా ఉండి ఆ పాపని తీసుకొని వెళ్లిపోతారు.
చాణక్య: మీరంతా క్రిమినల్స్‌లా ఉన్నారే. అయినా పాపని మీరు ఏం చేసుకుంటే నాకేంటి నా ఫీజు నాకు ఇస్తే అంతే చాలు.
మిత్ర: మనీషాకి కాల్ చేసి ఎక్కడున్నావ్ మనీషా. 
మనీషా: రేపు కేసు గెలవాలి అని పూజ చేయించడానికి వచ్చాను. 
మిత్ర: ఏం లేదు మనీషా ఉంటాను.
మనీషా: ఏదో చెప్పాలి అని ఫోన్ చేశాడు చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు.
సరయు: నువ్వు మిత్రకి కాబోయే భార్యవి కదా ఈ టైంలో మిత్ర పక్కనే ఉండాలి.


మనీషా వాళ్లు వెళ్లిపోతారు. ఇక లక్ష్మీతో జయదేవ్ మిత్ర ఏం తినలేదు అని చెప్తే బాల్యానీలో ఉన్న మిత్రని లక్ష్మీ పిలుస్తుంది. ధైర్యం చెప్పి మిత్రని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్తుంది. వడ్డిస్తుంది. కొత్త లాయర్‌ని పెట్టావా అని మిత్ర లక్ష్మీని అడిగితే రేపు అర్జున్‌ గారే వాదిస్తారు.. ఈ రోజు నా గురించే ఆగిపోయారు.. రేపు నాకు లక్కీకి సంబంధించిన ఓ విషయం చెప్తారని అంటుంది. అంత పెద్ద విషయం నా దగ్గర ఏం దాచవని మిత్ర అడిగితే కారణం లేకుండా ఏం చేయలేదు అని రేపే మీకు తెలుస్తుందని అంటుంది. ఇక లక్ష్మీ వెళ్లిపోతుంటే మిత్ర ఆపి లక్ష్మీని తనతో తినమని చెప్తాడు. ఇద్దరూ కలిసి తింటుంటే మనీషా, దేవయాలు వచ్చి చూసి షాక్ అయిపోతారు. నాకు అందుకే కాల్ చేశాడా అనుకుంటుంది. ఇక మిత్ర మనీషాని తినమంటే నేను ఉపవాసం అని చెప్తుంది. దేవయాని మనీషా చికెన్ లెగ్ పీసులు తినడం గుర్తు చేసుకొని నవ్వుకుంటుంది. 


ఉదయం అందరూ కోర్టుకి చేరుకుంటారు. ఇక లాయర్ చాణక్య తిరుగులేని ఆధారం సంపాదించామని చెప్తాడు. ఇక జడ్జీ ముందు డీఎన్‌ఏ రిపోర్ట్స్ పెడతాడు. లక్కీ పాప పార్వతి కూతురు అని నిరూపించే బ్రహ్మాస్త్రం అని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. అవి చూసి పాప పార్వతి కూతురే అని రిపోర్ట్స్‌లో క్లియర్‌గా ఉందని జడ్జీ చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. ఇక తీర్పు ఇచ్చే టైంకి లాయర్ అర్జున్ అబ్జక్ట్ చేస్తాడు. పాప పుట్టినప్పుడు ఉన్న నర్స్ సుశీలను ప్రశ్నిస్తానని చెప్తాడు. సుశీలను బోనులోకి పిలుస్తారు. ఆ రోజు పార్వతికి డెలివరీ చేశానని ఎలా అంటున్నావ్ ఆ రోజు ఇంకెవరికైనా డెలివరీ చేశావా అని అంటే నర్స్ లక్ష్మీని చూపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: ఫింగర్ ఫ్రింట్స్‌తో పట్టించే ప్రయత్నం.. చిట్టి పాప రాకతో ఏదో జరిగిందే?