Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీని చంపడానికి ఓ యువతి ఇంటికి వస్తుంది. మహాలక్ష్మీ తప్పించుకొని బయటకు వస్తే ఆ యువతి కత్తిని విద్యాదేవి చేతిలో పెట్టి పారిపోతుంది. మహాలక్ష్మీ టీచర్ చేతిలో కత్తి చూసి షాకైపోతుంది. నన్ను చంపడానికి వస్తావా అని విద్యాదేవిని పట్టుకొని కిందకి వెళ్తుంది. ఇంట్లో అందరిని పిలుస్తుంది.
మహాలక్ష్మీ: ఈ విద్యాదేవి నన్ను చంపడానికి వచ్చింది. ఏదో నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను.
విద్యాదేవి: లేదు నేను చంపడానికి రాలేదు. మీరు కేకలు వేయడంతో బయటకు వచ్చా ఈ లోపు ఎవరో నా చేతిలో కత్తి పెట్టి వెళ్లిపోయారు. అప్పుడే మీరు లైట్ వేశారు అంతకు మించి నాకు ఏం తెలీదు. నిజంగా నాకు ఏం తెలీదు నమ్మండి.
గిరిధర్: ఆల్రెడీ మీరు ఒక మర్డర్ చేశారు మళ్లీ మరొకసారి మా వదినను చంపాలి అని చూస్తున్నారా.
సీత: అత్తమ్మ ఎందుకు మహాలక్ష్మీ అత్తయ్యని చంపాలని ప్రయత్నిస్తారు. ఆవిడకు అవసరం ఏంటి. నాకు ఏదో తేడా కొడుతుంది.
రామ్: తేడా ఏం లేదు సీత ఆవిడను పిన్ని నమ్మడం లేదు కాబట్టి ఆవిడ పిన్నిని చంపాలి అనుకుంది. పోనీలే పాపం అని మా పిన్ని ఆవిడకు బెయిల్ ఇస్తే ఆవిడ మా పిన్నినే చంపాలి అనుకుందా.
జనార్థన్: అనవసరంగా బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చావ్ మహా.
గిరిధర్: అనవసరంగా తనని ఇంటికి తీసుకొచ్చావ్ వదిన.
విద్యాదేవి: మిమల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు మహాలక్ష్మీ గారు.
మహాలక్ష్మీ: ఉంది నువ్వు సుమతి కాదు అని తెలిస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుందని చంపాలనుకున్నావ్.
రామ్: అసలు ఈవిడ మా అమ్మే కాదు.
మహాలక్ష్మీ: రేపు పోలీసుల్ని పిలిచి అటమ్‌టూ మర్డర్ కేసు పెట్టి జైలుకి పంపిస్తా. నా కోడలు పదే పదే చెప్పడంతో నువ్వే సుమతి అని అనిపించి తీసుకొచ్చా కానీ నువ్వు సుమతి కాదు రేపు జైలుకి వెళ్లడానికి రెడీగా ఉండు.
మహాలక్ష్మీ తర్వాత సీఐకి కాల్ చేసి ప్లాన్ సక్సెస్ అయిందని మీరు పంపిన కిలాడీ లేడీ ఫెర్‌ఫెక్ట్‌గా చేసిందని అంటుంది. ఇక ఉదయం సీఐ త్రిలోక్ ఇంటికి వస్తాడు. అందరూ హాల్‌లో ఉంటారు. మహాలక్ష్మీ విషయం చెప్తుంది. ఇక ఇంట్లో అందరూ విద్యాదేవిని అరెస్ట్ చేయమని చెప్తారు. దాంతో పోలీస్ విద్యాదేవితో ఇప్పటికే ఒక మర్డర్ చేశావ్ మళ్లీ ఇంకొకటి చేయాలి అనుకున్నావా అని అడిగి ఆమెను అరెస్ట్ చేయమని చెప్తాడు. పోలీసులు విద్యాదేవిని అరెస్ట్ చేసే టైంకి సీత ఆపుతుంది. ఆవిడ ఏ తప్పు చేయలేదని చెప్తుంది.
అందరూ సీతని ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్తారు. తనే మర్డర్ చేసింది అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉందని తను చేయలేదు అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా అని మహాలక్ష్మీ అడిగితే తీసుకొస్తానని చెప్పి సీత కిచెన్ నుంచి ఓ మూట లాక్కొని వస్తుంది. అందులో రాత్రి మహాలక్ష్మీ మీద హత్యాప్రయత్నం చేసిన కిలాడీ లేడీ ఉంటుంది. మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. నిజం చెప్పమని సీత ఆమెను వాయించేస్తుంది. పోలీస్ వద్దని చెప్పినా సీత వినదు. దాంతో సీఐ సీతని ఆపి ఆ లేడీని తీసుకొని వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.