Male Menopause Treatment : వయసు పెరిగేకొద్దీ.. స్త్రీల మాదిరిగానే.. పురుషుల్లో కూడా పలు మార్పులు ఉంటాయి. ముఖ్యంగా టెస్టోస్టిరాన్ స్థాయిలలో గణనీయమైన హార్మోన్ల మార్పులు ఉంటాయి. ఇది మానసిక, శారీరకం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అదే మోనోపాజ్. అవును ఆడవారిలోనే కాదు.. మగవారిలో కూడా ఈ మోనోపాజ్ ఉంటుంది. ఇది పురుషుల్లో లైంగికపరమైన మార్పులకు కారణమవుతుంది.


సాధారణంగా పురుషుల్లో లైంగిక లక్షణాల అభివృద్ధికి కీలకమైన టెస్టోస్టిరాన్ వయసుతో పాటు సహజంగా పెరుగుతుంది. తగ్గుతుంది. యుక్తవయసులో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. 30 సంవత్సరాల వరకు పెరిగి.. అక్కడి నుంచి ఒక్కో శాతం చొప్పున తగ్గడం ప్రారంభిస్తుంది. 70 సంవత్సరాల వయసులో కొంతమంది పురుషుల్లో టెస్టోస్టిరాన్ 50 శాతం తగ్గినట్లు అధ్యయనాలు తెలిపాయి. ఇది మోనోపాజ్​లోని భాగమే అంటున్నారు. 


లైంగిక తీరుపై ప్రభావం


టెస్టోస్టిరాన్ స్త్రీ, పురుషుల్లో విభిన్నమైన ఫలితాలు ఇస్తుంది. ఇది వయసుతో కలిసి లైంగిక పనితీరు, శారీరక లక్షణాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. సహజంగా టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్న స్త్రీలు ఋతుస్రావం, రుతువిరతి వంటి సమయంలో హార్మోన్ల ప్రభావాన్ని తక్కువగా కలిగి ఉంటారు. కానీ వీరు బోన్స్ హెల్త్, కండరాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే మగవారిలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


మగవారిలో మోనోపాజ్ అనేది కొత్తగా తెరపైకి వచ్చింది కాదు. ఎప్పటినుంచో ఉంది కానీ.. ప్రజలకు దీని గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఇది కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఈ మోనోపాజ్ సమయంలో లిబిడో తగ్గి, అలసట, మానసిక స్థితుల్లో మార్పులు, అంగస్తంభన, పలు శారీరక మార్పులు ప్రధానంగా కనిపిస్తాయి. ఇవి జీవిత నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. 


మీరు 40 ఏళ్లు పైబడి ఉంటే.. మీలో శక్తి తగ్గిపోయి.. లైంగిక కోరికలు తగ్గిపోయిన లక్షణాలు ఎదుర్కొంటుంటే మీరు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంది. టెస్టోస్టిరాన్ స్థాయిలను మీ శరీరంలో ఈ మార్పులకు కారణమవుతాయి. ఈ సమస్యను చాలా సాధారణంగా తీసుకుని.. పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. తమ పరిస్థితిని అర్థం చేసుకుని.. వైద్యుల సలహాలు, చికిత్సలతో శారీరక, మానసికంగా ప్రయోజనాలు పొందవచ్చు. 


ట్రీట్​మెంట్..


మగవారిలోని ఈ టెస్టోస్టిరాన్ సమస్యకు చికిత్స్ చేయించుకోవడం వల్ల శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. టెస్టోస్టిరాన్ రీప్లేస్​మెంట్ థెరపీని తీసుకోవడం వల్ల లిబిడో, అలసట, కండర ద్రవ్యరాశి వంటి లక్షణాలు మెరుగవుతాయి. మొటిమలు, స్లీప్ ఆప్నియా, రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బులును దూరం చేసుకోవచ్చు. కొన్ని జెల్స్, క్రిమ్​లు హార్మోన్లను కంట్రోల్​లో ఉంచుతాయి. ఇంజెక్షన్లు అయితే కొన్నివారాలకు ఇస్తారు. ఇవి ఎఫెక్టివ్​గా ఉంటాయి కానీ.. హార్మోన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. 


జీవనశైలిలో మార్పులు


టెస్టోస్టిరాన్ స్థాయిలు సమతుల్యంగా ఉండేందుకు చికిత్సలతో పాటు.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. రెగ్యూలర్ వ్యాయామం, సమతుల్యమైన ఆహారం, మంచి నిద్ర మీ శరీరానికి మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి. అంతేకాకుండా హెల్తీ హ్యాబిట్స్ టెస్టోస్టిరాన్ స్థాయిలను కంట్రోల్​లో ఉంచుతాయి. మీ ఫిట్​నెస్ లక్ష్యాలు మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా మంచివి. ఇది మీ శరీరంలో హార్మోన్ స్థాయిలను అదుపులో ఉంచి లైంగిక సమస్యలను దూరం చేస్తాయి. 


Also Read : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.