Pariksha Pe Charcha 2024 Event: పరీక్షల సమయంలో విద్యార్థుల్లో సహజంగా ఉండే భయాలను, ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు ప్రధాని. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో, భారత్ మండపం టౌన్‌హాల్‌లో ఈ రోజు (జనవరి 29) 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.  


ఈ ఏఢాది దాదాపు 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు, పేరెంట్స్, టీచర్లు ఇందులో పాల్గొననున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది.వారికి పీఎం మోదీని కలవడానికి, సంభాషించడానికి అవకాశం కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థుల కోసం పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులతోపాటు 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మందికిపైగా తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకున్నారు.


ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా త్వరలో జరుగనున్న బోర్డు పరీక్షల్లో రాణించేందుకు చిట్కాలను కూడా ప్రధాని మోదీ విద్యార్థులతో పంచుకుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని.. స్వయం ప్రభా యొక్క 32 ఛానెళ్లతోపాటు దూరదర్శన్, వివిధ ప్రభుత్వ వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.


'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకం..
యువతకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధాని మోదీ ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకం రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో  ప్రధాన మంత్రి ఒత్తిడి లేని ప‌ద్ధతిలో బోర్డు ప‌రీక్షలు, ప్రవేశ ప‌రీక్షల‌ను ఛేదించడానికి చిట్కాలను పంచుకున్నారు. పరీక్షా పే చర్చా-2024 అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శక, అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఎగ్జామ్ వారియర్స్. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని ఒకచోట చేర్చి, విద్యార్థుల ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించే వాతావరణాన్ని పెంపొందించడమే ఈ పుస్తకం ప్రధాన లక్ష్యంగా ఉంది. తమను తాము పూర్తిగా వ్యక్తీకరించడానికి ఇదివేదిక అవుతుంది. ఈ కార్యక్రమం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ పుస్తకం ద్వారా, ప్రధాన మంత్రి విద్యకు సంబంధించిన కొత్త విధానాన్ని వివరించారు. విద్యార్థుల జ్ఞానం, సమగ్ర అభివృద్ధికి ప్రాథమిక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. మితిమీరిన ఒత్తిడి, ఒత్తిడితో పరీక్షలను జీవన్మరణ పరిస్థితిగా మార్చకుండా సరైన దృక్పథంలో ఉంచాలని ప్రధాన మంత్రి ప్రతి ఒక్కరినీ కోరారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...