చాలా మంది ఇష్టంగా తినే పండ్లు అల్ బుకరా. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు సీజనల్ గా వచ్చే ఆరోగ్య సమస్యలని కూడా ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఎన్నో పోషకాలు కలిగిన ఈ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఉండే ఈ పండ్లు నోటికి చాలా రుచిగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో నిండి ఉన్నాయి. ఇవి అనేక దీర్ఘకాలిక వ్యాధులని అభివృద్ధి చేసే అవకాశాన్ని తగ్గిస్తాయి. ఈ పండ్లతో నోరూరించే కేకులు, జామ్, ఊరగాయ , స్వీట్లు కూడా తయారు చేస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జీవక్రియని మెరుగుపరిచి రక్తప్రసరణ పెంచేందుకు సహాయపడతాయి.


గుండెకి మేలు: అల్ బుకరా పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: వీటిలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. కాలేయం కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది.


ఎముకలకి మంచిది: ఈ పండ్లలో లభించే బోరాన్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులో అదనంగా ఫినాలిక్, ఫ్లేవనాయిడ్ రసాయనాలు ఉన్నాయి. ఇవి ఎముకలకి నష్టం కలగకుండా కాపాడతాయి.


రోగనిరోధక శక్తి ఇస్తుంది: ఫ్లూ, జలుబు, జ్వరాలతో పోరాడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. ఈ పండులోని గుజ్జు కణజాలాల పెరుగుదలని ప్రోత్సహిస్తుంది.


చర్మానికి మంచిది: అల్ బుకరా పండ్లు తీసుకోవడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. ముడతలని తగ్గిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అందుకోసం క్రమం తప్పకుండా ఈ పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిది.


మలబద్ధకం పోగొడుతుంది: ఈ పండ్లలో ఇసాటిన్, సార్బిటాల్ ఉన్నాయి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడానికి జీర్ణక్రియని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని ఎండబెట్టిన తర్వాత తీసుకుంటే గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


గర్భిణులకి మేలు: ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి ఇది చాలా మేలు చేస్తుంది. ఇవి తినడం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. రక్తహీనతని తగ్గిస్తుంది.


పెదవులకి రంగునిస్తుంది: నల్లని పెదవులు అందాన్ని చెడగొట్టేస్తాయి. అందుకే పెదాల సంరక్షణ కూడా అవసరం. ఎర్రటి పెదవులు పొందటం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎర్రగా ఉండే ఈ పండ్ల తొక్కలతో పెదవులు మర్దన చేసుకోవచ్చు. దాని వల్ల నల్లగా ఉండే పెదవులు ఎర్రగా కనిపిస్తాయి.


జుట్టుకి మేలు: జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రు సమస్యని నివారిస్తుంది. జుట్టు కుదుళ్లు బలపడేందుకు సహాయపడుతుంది.


రక్తపోటు నియంత్రణ: రోజుకి 3 లేదా 4 పండ్లు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: శీతాకాలంలో పిల్లలకి కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే