ISRO PSLV-C54: 


ఇస్రో చేపట్టిన PSLV-C54 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరులోని శ్రీహరి కోట నుంచి 9 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. Oceansat-3తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటిలో ఒకటి భూటాన్‌కు చెందిన శాటిలైట్ కూడా ఉంది. 11.56 గంటలకు ఈ ప్రయోగం లాంచ్ కాగా...విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లినట్టు ఇస్రో ప్రకటించింది. ఈ మొత్తం ఉపగ్రహాల బరువు 1,117 కిలోలు. ఈ 8 నానో శాటిలైట్స్‌లో భూటాన్‌ సాట్, పిక్సెల్‌కు చెందిన ఆనంద్, ధ్రువ స్పేస్ అందించిన రెండు Thybolt ఉపగ్రహాలు, స్పేస్‌ఫ్లైట్‌ యూఎస్ఏకు చెందిన నాలుగు ఉపగ్రహాలున్నాయి. EOS శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. Oceansat-3 శాటిలైట్స్ ద్వారా భూవాతావరణాన్ని పరిశీలించడం, తుఫానులను ముందుగానే గుర్తించడం, వాతావరణంలో తేమను అంచనా వేయడం సాధ్యమవుతుంది. వీటితో పాటు సముద్ర వాతావరణాన్నీ అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తాయి. ప్రయోగం విజయవంతం కావడంపై ఇప్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.ఓషన్ శాట్...భూ పరిశీలన ఉపగ్రహం. సముద్ర పరిశీలనలను లక్ష్యంగా చేసుకున్న ఉపగ్రహాల శ్రేణిలో ఇది మూడోదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.