శీతాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల వారికి ఇచ్చే ఆహారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చల్లని వాతావరణం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. బ్యాక్టీరియాతో పోరాడటం కష్టం అవుతుంది. అందుకే వారికి రోగనిరోధక శక్తి మెరుగయ్యే ఆహారం పెట్టాలి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే కూరగాయాలని పిల్లలు ఎక్కువగా తినేలా చెయ్యాలి. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉంచాలి. చల్లని గాలుల కారణంగా జలుబు బారిన పడిపోతారు. అందుకే వారికి నచ్చే విధంగా రుచిగా ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు వ్యాధులతో పోరాడగలిగే శక్తిని పొందుతారు.


ఆకుపచ్చని కూరగాయలు


గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ చలికాలంలో తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే వాటిలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, మెంతులు, స్ప్రింగ్ ఆనియన్స్, తాజా వెల్లుల్లి, తాజా ఆకుకూరలు పెట్టాలి. వాటిలో ఫైటో న్యూట్రిఎంతలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఆకుకూరలు తినలంటే పిల్లలు అసలు మొగ్గుచూపరు. అందుకే వాటిని పరోటాలు, చిల్లాస్ మధ్య పెట్టి చేసి ఇవ్వాలి. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు వేడిగా ఉండేందుకు వేడి సూప్ లో గొప్ప మార్గం. ఆకుకూరలు బేస్ గా చేసుకుని సూప్ చెయ్యాలి. కాయధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి. అందుకే సూప్ లో వీటిని వేసి ఇవ్వడం మంచిది.


తాజాపండ్లు


చలికాలంలో పిల్లలు పండ్లు తినడానికి ఇబ్బంది పడతారు. కారణం వాటి వల్ల జలుబు చేస్తుందని. కానీ ఇది విటమిన్ లోపం వంటి సమస్యలకి దారితీస్తుంది. అందుకే వింటర్ సీజన్లో కూడా తాజా సీజనల్ పండ్లు తీసుకోవడం తప్పనిసరి. శీతాకాలంలో వచ్చే పండ్లు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. నారింజ, నిమ్మ, దానిమ్మ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తి పెంపొందేందుకు దోహదపడతాయి. ఒకే పండు తినడానికి పిల్లలు ఇష్టపడకపోవచ్చు. అందుకే రంగు రంగుల పండ్లు ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేసి ఇస్తే చక్కగా తినేస్తారు.


డ్రై ఫ్రూట్స్, నట్స్


డ్రై ఫ్రూట్స్, నట్స్ లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి. పిల్లలకి అవసరమైన శక్తి అందిస్తాయి. ఖర్జూరాలు, గింజలు, ఎండిన పండ్లు తినేలా చూసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకుని పెట్టుకుని పాలల్లో కలిపి ఇస్తే చాలా రుచిగా ఉంటాయి. అవి వాళ్ళని వెచ్చగా కూడా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. వీటితో శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. డ్రై ఫ్రూట్స్ స్మూతీస్ లో చేర్చి ఇవ్వవచ్చు.


చిలగడదుంప


చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. చిలగడదుంపలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని కాల్చిన తర్వాత తినడం మంచిది. వీటిని ఉడకబెట్టి తొక్క తీసి చాట్ మసాలా చేసుకుని తినొచ్చు. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినే అవకాశం ఉంది. ఇందులో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియని పెంచుతాయి.


తేనె


తేనె పిల్లల ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది సహజ స్వీటెనర్. శుద్ధి చేసిన చక్కెరకి ఇది చక్కని ప్రత్యామ్నాయం. షుగర్ కి బదులుగా తేనె వేసి పదార్థాలు ఇవ్వవచ్చు. మంచి పోషక విలువలు అందితాయి. తేనె తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు కూడా తగ్గుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కరివేపాకులతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం