విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నెక్స్ట్ సినిమా ఏది? ఎవరి దర్శకత్వంలో ఆయన నటించాలని అనుకుంటున్నారు? ఆయన ఎటువంటి కథలు చేయాలని అనుకుంటున్నారు? ఈ విషయంలో క్లారిటీ మిస్ అవుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ గుసగుస ప్రకారం... 'లైగర్' డిజాస్టర్ తర్వాత లైనప్ విషయంలో విజయ్ దేవరకొండ కన్‌ఫ్యూజ్ అవుతున్నారట.
 
దూరంగా జరుగుతున్న దర్శకులు!?
'లైగర్' విడుదలకు ముందు సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. బజ్ క్రియేట్ అయ్యింది. పాన్ ఇండియా లెవల్‌లో ప్రేక్షకులు సినిమాపై ఇంట్రెస్ట్ చూపించారు. అయితే, సినిమా డిజాస్టర్ కావడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. విజయ్ దేవరకొండ కూడా డిజప్పాయింట్ అవ్వడమే కాదు, 'లైగర్' విడుదలకు ముందు ఆ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో స్టార్ట్ చేసిన మరో సినిమా 'జన గణ మణ'ను క్యాన్సిల్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అయిన సినిమాను పక్కన పెట్టేశారు. ఈ నిర్ణయం చాలా మంది దర్శకులకు షాక్ ఇచ్చినట్టు టాక్.


సినిమా ఇండస్ట్రీలో హిట్టూ ఫ్లాపులు కామన్. ఒక్క ఫ్లాప్ వచ్చిందని దర్శకుడితో స్టార్ట్ చేసిన సినిమాను పక్కన పెట్టడం ఎంత వరకు కరెక్ట్? అనే క్వశ్చన్ మొదలైందట. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి 'ఖుషి' సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. దాని తర్వాత సినిమా విషయంలో ఇంకా క్లారిటీ లేదు. 


హరీష్ శంకర్, పరశురామ్ దూరమేనా!?
విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి దర్శకులు హరీష్ శంకర్, పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. లేటెస్ట్ టాక్ ఏంటంటే... ఆ ఇద్దరూ ఇప్పుడు సినిమాలు చేసే ఉద్దేశంలో లేరట. విజయ్ దేవరకొండను ఒక్కసారి కలిస్తే ఆయనతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వండి వార్చారని ఆ మధ్య హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఇప్పుడు అయితే వాళ్ళిద్దరి కలయికలో సినిమా రావడం కష్టమేనట. అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో ఒకసారి విజయ్ దేవరకొండకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని, కాల్ చేయవద్దని మెసేజ్ చేశాడని హరీష్ శంకర్ పేర్కొన్నారు.
 
విజయ్ దేవరకొండకు 'గీత గోవిందం' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్. 'సర్కారు వారి పాట' తర్వాత మరోసారి విజయ్ దేవరకొండతో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం... పరశురామ్ స్క్రిప్ట్ విని, అక్కినేని నాగ చైతన్య ఓకే అన్నారట. దాంతో ఆయన కూడా దూరం అయ్యారు. నిజం చెప్పాలంటే... 'సర్కారు వారి పాట' సినిమాకు ముందు నాగ చైతన్యతో పరశురామ్ సినిమా చేయాలి. మహేష్ బాబు నుంచి పిలుపు రావడంతో ఆ సినిమా పక్కన పెట్టి ఇటు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య దగ్గరకు వెళ్లారు. 


సుకుమార్ సినిమా ఎప్పుడు ఉంటుందో?
విజయ్ దేవరకొండ హీరోగా ఆ మధ్య సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటన వచ్చింది. కానీ, ఇప్పట్లో ఆ సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు లేవు. 'పుష్ప 2' మీద దృష్టి పెట్టిన సుకుమార్, ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా సినిమా చేయాలని రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మరి? ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న ఏకైక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అని ఇండస్ట్రీ టాక్.


Also Read : కల్పిక అకౌంట్‌ను సస్పెండ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్


రామ్ చరణ్ హీరోగా చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడంతో గౌతమ్ తిన్ననూరి ఇటు వచ్చారు. ఆయన కథ ఓకే కాకపోతే... 'ఖుషి' తర్వాత విజయ్ దేవరకొండ ఖాతాలో మరో సినిమా లేనట్టే. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల దర్శకులు దూరం అవుతున్నారని టాలీవుడ్ గుసగుస.