ప్రపంచంలో ప్రతి ఇంట్లోను ఒక మధుమేహం వ్యాధిగ్రస్తుడు ఉన్నట్టు అంచనా. గణాంకాల ప్రకారం మన దేశంలోని ఎనిమిది కోట్లకు పైగా ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. 2045 నాటికి పదమూడు కోట్లకు ఈ సంఖ్య చేరుకుంటుందని అంచనా. అయితే చాలా మందిలో రోగనిర్ధారణ చేయని కారణంగా డయాబెటిస్ ఉన్నా తెలియడం లేదు. వారు అకాల మరణం బారిన పడుతున్నారు. అందుకే డయాబెటిస్ తేలికగా తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు. 


ఈ మొక్క ఉండాల్సిందే
రక్తంలో చక్కెరస్థాయిలు చాలా సహజ పద్దతుల్లో అదుపులో ఉంచుకోవడం అవసరం. మీరు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. తీపి పదార్థాలు మానివేయడం, తెల్లన్నం తగ్గించడం, ఆకు కూరలు, కూరగాయలు వంటకాలను అధికంగా తీసుకోవడం వంటివి చేస్తే చాలు. కానీ చాలా మంది ఇవి పాటించారు. అయితే ఇన్సులిన్ మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. రోజూ ఉదయానే ఆ మొక్క ఆకులను రెండు నమిలితే చాలు.ఈ మొక్కను కాస్టస్ ఇజెనస్ అంటారు. వాడుక భాషలో ఇన్సులిన్ మొక్క అంటారు. కొంతమంది షుగర్ మొక్క అని కూడా అంటారు. అంటే అర్థం ఆ మొక్కలో షుగర్ ఉంటుందని కాదు, అలాగే ఇన్సులిన్ కూడా ఉండదు. కాకపోతే ఈ ఆకులను తింటే ఆహారంలోని చక్కెరను గ్లైకోజన్ గా మారుస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 


ఆకుల రుచి?
ఈ ఆకులు కాస్త పుల్లని రుచిని కలిగి ఉంటాయి. వీటిని నమలడం అంత రుచిగా అనిపించకపోవచ్చు. కానీ నమలాలి. అదే ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలిక మధుమేహాన్ని అడ్డుకోవడం ఇది ముందుంటుంది. ఈ మొక్కలోని సహజ రసాయనం రక్తంలో చక్కెరను గ్లైకోజెన్‌గా మారుస్తుంది, ఇది చక్కెరను నియంత్రించడంలో, సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.


మధుమేహంతో బాధపడేవారు తక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. వాతావరణం మారిందంటే చాలు వారు అనారోగ్యం బారిన పడతారు. ఇన్సులిన్ ఆకులు దగ్గు, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు, ఉబ్బసం, అతిసారం, మలబద్ధకం వంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇన్సులిన్ మొక్కల ఆకుల్లో కార్బోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ స్రావాన్ని అధికంగా ఉత్పత్తి అయ్యేలా పెంచుతుంది. 


ఎలా వినియోగించాలి?
ఈ ఆకులను రెండు విధాలుగా తినవచ్చు. ఒకటి ఆకులను కడిగి నమిలేయడం, రెండోది ఆకులను మెత్తగా రుబ్బి ఒక టీస్పూను రుబ్బును గ్లాసు నీటిలో కలుపుకుని తాగడం. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలా మంచిది. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 


Also read: ఈ భారీ థాలీని పూర్తిగా తింటే రూ.8.5 లక్షల బహుమతి, మోడీ పుట్టినరోజు స్పెషల్


Also read: వేడి వేడి ఆహారంపై నిమ్మకాయ రసాన్ని పిండి తప్పు చేస్తున్నాం - చెబుతున్న పోషకాహార నిపుణులు



























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.