తెలుగు రాష్ట్రాల్లో రాగల రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని  హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. వచ్చే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని వెల్లడించారు. అదే జరిగితే 19, 20 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని, ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించాయి. 


అమరావతి వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద దాదాపు 2022 సెప్టెంబరు 18వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాగల మూడు రోజులు వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.






నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన బిల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తాలో..
దక్షిణ కోస్తాంధ్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. 


రాయలసీమలో..
ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


తెలంగాణలో వర్షాలు ఇలా (Telangana Weather)
నేడు (సెప్టెంబరు 17), రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. సెప్టెంబరు 19న కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


20న భారీ వర్షాలు
భారీ వర్షాలు తెలంగాణలోని మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో  అక్కడ కురిసే అవకాశం ఉంది.







‘‘ఎటువంటి వర్షాలు లేక​, పూర్తిగా ఎండ వాతావరణ పరిస్ధితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో వడగాల్పులు లాంటి వాతావరణం కొనసాగుతోంది. గత మూడు సంవత్సరాలకు భిన్నంగా ఈ సారి వర్షాలు తక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా ఉంది. అత్యధికంగా నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్, తిరుపతి, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. రేపు కూడా ఇలాంటి వాతావరణం కొనసాగనుంది. సెప్టంబర్ 18 నుంచి అల్పపీడనం వలన ఉపశమనం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.