Horoscope 17th September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీరు మానసికంగా ఇబ్బంది పడతారు.ఒత్తిడిని తగ్గించుకోవడానికి పిల్లలతో సమయం గడపండి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేక బహుమతిని పొందవచ్చు. అప్పులు తీర్చేందుకు ప్రయత్నించండి. మీకు మీ స్నేహితుల మద్దతు లభిస్తుంది.
వృషభ రాశి
మీ ఖర్చులను నియంత్రించుకోండి. కుటుంబంతో సమయం గడిపేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడేందుకు మీ ప్రయత్నం మీరు చేయండి.
మిథున రాశి
మీ వినయ స్వభావాన్ని అందరూ మెచ్చుకుంటారు. మూడో వ్యక్తి కారణంగా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. మీకోసం మీరు సమయాన్ని కేటాయించండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
Also Read: బుధుడు, సూర్యుడు ఉన్న రాశిలోనే శుక్రుడి సంచారం, ఈ 5 రాశులవారికి శుభసమయం
కర్కాటక రాశి
పాత మిత్రులు లేదా బంధువులను కలుసుకోవడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి అనుకూలమైన రోజు. జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఎక్కడికైనా వెళ్లాల్సి రావొచ్చు.
సింహ రాశి
ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఆర్థిక సంబంధిత విషయాలపై ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రయాణంలో మీకు కొందరు పరిచయడం అవుతారు.
కన్యా రాశి
ఈ రోజు మీపై పనిభారం ఉంటుంది. రోజంతా కొంత చికాకుగా ఉంటారు. ఒక స్నేహితుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగే అవకాశం ఉంది.స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తండ్రి సహకారంతో ధనలాభం ఉంటుంది. రోజు ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆలోచించి మాట్లాడండి.
Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!
వృశ్చిక రాశి
మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి...లేగంటే మీరు తర్వాత పశ్చాత్తాపడాల్సి రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధనలాభం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో పని - కుటుంబం మధ్య సమతుల్యతను కాపాడుకోండి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఆనందకరమైన ఆశ్చర్యాన్ని పొందవచ్చు.
ధనుస్సు రాశి
తెలియని వ్యక్తుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఆహారంపై శ్రద్ధ వహించండి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. రోజంతా ఆనందంగా ఉంటారు. సృజనాత్మక పనిని ఆనందిస్తారు.
మకర రాశి
ఈ రోజు మీ దీర్ఘకాల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సన్నిహితులతో విభేదాలు రావొచ్చు. మీరు ఓ పార్టీకి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. పనిలో బిజీగా ఉండటమే కాదు..పిల్లల కోసం కూడా సమయం కేటాయించండి.
కుంభ రాశి
పని భారం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక సమస్యల కారణంగా మీ సృజనాత్మకత పనిపై ప్రభావం పడుతుంది..కానీ త్వరోలనే మీ జీవితంలో సానుకూల ఫలితాలు చూస్తారు.
మీన రాశి
ఇంటికి అతిథి రాకతో మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించండి. ఈ రోజు మీరు వైవాహిక జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు.