Shukra Rashi Parivartan 2022:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశిమార్పు ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. ఇప్పటికే బుధుడు కన్యారాశిలో తిరోగమనంలో ఉన్నాడు.ఆగస్టు 21 నుంచి కన్యారాశిలో సంచరిస్తున్న బుధుడు..సెప్టెంబరు 10 నుంచి అక్టోబరు 2 వరకూ అదే రాశిలో తిరోగమనం చెందనున్నాడు.  సెప్టెంబరు 17 నుంచి సూర్యుడు కూడా సింహ రాశి నుంచి కన్యారాశిలో సంచరించనున్నాడు. ఇక్కడికి మరో వారంలో అంటే.. సెప్టెంబరు24 నుంచి శుక్రుడు కూడా కన్యారాశిలోనే సంచరించనున్నాడు.


బుధుడి సంచారం మేధస్సు, తెలివితేటలు, ఆకర్షణీయమైన మాటతీరుపై చూపిస్తుంది... సూర్యుడి ప్రభావం ఆరోగ్యం, ఆదాయంపై ఉంటుంది శుక్రుడి ప్రభావం ఆనందం, విలాసంపై ఉంటుంది. వాస్తవానికి ఈ మూడు గ్రహాల సంయోగం మంచిదే అయినా..ఫలితాలు మాత్రం అంత బాగా ఉండవు. ఎందుకంటే ఏదైనా గ్రహం సూర్యుని దగ్గరికి వచ్చినప్పుడు దాని వెలుగు తగ్గిపోతుంది..అలాంటప్పుడు ఆ గ్రహానికి ఉన్నశుభ ఫలితాలు క్షీణం అవుతాయి. ముఖ్యంగా శుక్రుడి బలం లేకుండా ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ కాలేరని చెబుతారు జ్యోతిష్యశాస్త్ర పండితులు...


బుధుడు, సూర్యుడు, శుక్రుడు గ్రహాల సంచారం వల్ల ఎలాంటి ప్రభావం ఉండని రాశులేంటంటే..మేష రాశి, కర్కాటక రాశి,  కన్యా రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం .. మరి సానుకూల ఫలితాలు పొందే రాశులేంటంటే....


​వృషభం
కన్యారాశిలోకి శుక్రుడు ప్రవేశించినప్పుడు..ఈ రాశినుంచి ఐదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశివారికి సంతానం పరంగా కలిసొస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. కోర్కెలు నెరవేరుతాయి. శక్రుడి ప్రబావంతో మీరు ఎంచుకున్న రంగంలో ఆర్థికంగా లాభపడతారు.


​మిథునం
కన్యారాశిలోకి శుక్రుడి సంచారం మీ రాశినుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ ప్రభావంతో ఇంటా-బయటా మీకు మంచి ఫలితాలే ఉన్నాయి. కార్యాలయంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ ఆలోచన, ఆలోచనా శక్తి కూడా బలంగా ఉంటుంది.కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.వైవాహిక జీవితంలో భాగస్వామి మంచి మద్దతు లభిస్తుంది. 


​సింహం
కన్యా రాశిలో శుక్రుడి సంచారం సింహ రాశివారికి శుభఫలితాలను అందిస్తోంది. వృత్తి, వ్యాపారాలు కలిసొస్తాయి. పురోగతికి నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. ఉద్యోగం చేస్తున్నవారికి కొంత అదనపు పని ఉంటుంది. త్వరలో మీరు ఈ పరిస్థితి నుంచి బయటకు వస్తారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం శుభకరం.


​తుల
మీ రాశినుంచి శుక్రుడి సంచారం 12వ స్థానంలో ఉందన్నమాట. ఈ ఫలితంగా వ్యాపారంలో లాభాలు, వ్యవహార జయం సిద్ధిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరి లాభాలు పొందుతారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సులభంగా వాటిని ఎదుర్కొంటారు.


​మకరం
ఈ రాశివారికి కన్యారాశిలో సంచరిస్తున్న శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉంటాడు. ఫలితంగా మీకన్నీ సానుకూల ఫలితాలే ఉన్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం 9వ పాదంలో శుక్రసంచారం అదృష్టాన్ని సూచిస్తోంది. చాలా కాలంగా ఉద్యోగాలు మారడం గురించి ఆలోచిస్తున్నవారికి ఈ సమయంలో నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. స్థానికుల నుంచి పూర్తిస్థాయి మద్దతు పొందుతారు.


నవగ్రహ శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||