Kishan Reddy: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా రేపు ఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ జవాన్లు కవాతు నిర్వహిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో భాగంగానే అమరవీరుల స్ఱూపం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పిస్తారని తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ వరకు విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విముక్తి దివాస్ పేరుతో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో వేడుకలు జరుగుతాయని వివరించారు. విమోచన దినోత్సవ వేడుకల కోసం 25 సంవత్సరాలు బీజేపీ పోరాడిందని తెలిపారు. కానీ అప్పటి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ విమోచన వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. అది తమ అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.


తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న బురుజుల పైన జెండా ఎగుర వేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని గ్రామాల సర్పంచ్ లకు లేఖలు రాశామని తెలిపారు. రేపు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు వస్తారని సమాచారం. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపించామని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పంపించామని స్పష్టం చేశారు. 


హైదరాబాద్ కు అమిత్ షా..


రేపు తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరిట కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుంది. రేపు పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల వేడుకలను అధికారిక నిర్వహిస్తోంది. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో కాంగ్రెస్‌ వేడుకలను నిర్వహిస్తుంది. పరేడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏర్పాటుచేశారు.


రేపు పబ్లిక్ గారెండ్ లో వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు..


తెలంగాణ జాతీయ స‌మైక్యత దినోత్సవం సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ రేపు ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. అనంత‌రం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను ముఖ్యమంత్రి ప్రారంభించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్రసంగించ‌నున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ర్యాలీలు, జెండా ప్రదర్శనలు చేపట్టారు. వజ్రోత్సవాల వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.