టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా 'అల్లూరి' (Alluri). నిజాయితీకి మారు పేరు... అనేది ఉపశీర్షిక. ఇదొక ఫిక్షనల్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. 


అయితే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని శ్రీ విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అల్లూరి కోసం అల్లు అర్జున్ అంటూ ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ఈ మధ్యకాలంలో బన్నీ చాలా సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తూ.. తన సపోర్ట్ అందిస్తున్నారు. ఇప్పుడు శ్రీ విష్ణుని ఎంకరేజ్ చేయడానికి గెస్ట్ గా వెళ్లబోతున్నారు. 


అల్లు అర్జున్ గెస్ట్ అంటే.. ఇక ఆ ఈవెంట్ మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోవడం ఖాయం. సెప్టెంబర్ 18న ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో నిజాయతీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజు పాత్రలో శ్రీ విష్ణు కనిపించనున్నారు.


శ్రీ విష్ణు సరసన కయ్యదు లోహర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుమన్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృథ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, 'వెన్నెల' రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి  ఛాయాగ్రహణం : రాజ్ తోట, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, కళ : విఠల్, ఫైట్స్ : రామ్ క్రిషన్, సాహిత్యం : రాంబాబు గోసాల, సమర్పణ : బెక్కెం బబిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ ('ఫిదా' ఫేమ్).






ఇక బన్నీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'పుష్ప2' సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. 


'పుష్ప' సినిమాకి క్రేజీ డీల్:
'పుష్ప' పార్ట్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి కొన్ని సంస్థలు. 'పుష్ప'తో డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ చేసిందట ఓ సంస్థ. మైత్రి మూవీస్ బ్యానర్ ఈ డీల్ పై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బన్నీ మాత్రం వద్దని చెప్పారట. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బిజినెస్ ఇంకా బాగా జరుగుతుందని.. కాబట్టి అప్పటివరకు ఎలాంటి డీల్స్ ఓకే చేయొద్దని చెప్పారట. దీంతో ప్రస్తుతానికి ఈ క్రేజీ డీల్ ను పక్కన పెట్టేశారు. 'పుష్ప' పార్ట్ 1 సమయంలో మాత్రం డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను ముందే అమ్మేశారు. ఈసారి మాత్రం అలా చేయడం లేదు.