Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో రాజశేఖర్ అనే వ్యక్తి ఉన్నట్టు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. మనిషిని చూసినా పేరు గుర్తుండకపోవచచు.కానీ అతడు కెప్టెన్ అయిపోయాడు. ఒక్కసారి కూడా తన గొంతును, తన అభిప్రాయాన్ని ఇంట్లో గట్టిగా వినిపించలేదు. ఇంట్లో తమ వాయిస్ ను వినిపిస్తూ, టాస్కుల్లో కొట్టుకోవడం, ఇంటి పనుల్లో, ఇతర విషయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులకు కెప్టెన్సీ దక్కలేదు. కేవలం ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను నామినేషన్లలో ఉన్నాను, ఈ వారం వెళ్లిపోయినా కెప్టెన్ అయి వెళ్లిపోయానన్న ఆనందం ఉంటుంది’ అని చెప్పినందుకు రాజ్ శేఖర్‌కే ఎక్కువ మంది ఓట్లేశారు. మరి అతడు హౌస్ ని ఎలా నడుపుతాడో చూడాలి. 


ఇక ఎపిసోడ్ ఓ ఏమైందంటే...ఇనయాకు ముందు రోజు డీజే ఆటలో ఒక్క ఓటు పడకపోయేసరికి చాలా బాధపడింది. అప్పుడు శ్రీ సత్య వచ్చి బయట ప్రేక్షకులకు నచ్చితే నువ్వు చివరి వరకు ఉంటావ్ అంటూ చెప్పి వెళ్లిపోయింది. ఇక శ్రీహాన్- రేవంత్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. శ్రీహాన్ మాట్లాడుతూ తన పని గిన్నెలు తోమడం అని, రెండు గిన్నెలు కనిపించినా వెంటనే తోమేస్తానని, అందరిలా సింకు నిండా గిన్నెలు అయ్యాక తోమనని, అందుకే పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని అన్నాడు. రేవంత్ కూడా బాత్రూమ్ క్లీన్ చేసే పని తనకిచ్చారని, చంటిని చేయమంటే ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతాను కానీ చేయనని చెప్పాడన్నాడు. ఫైమా అయితే ఏ పనీ చేయదని అన్నాడు. 


ఇక డీజే ఆట మొదలైంది. అందులో సుదీప - కీర్తి కలిసి రాజ్ కి ఓటేశారు. ఆ తరువాత అభినయశ్రీ - బాలాదిత్యలు కూడా రాజ్ కే ఓటేశారు. నేహా- ఆరోహిలు మాత్రం ఇనయకు వేశారు. ఈ ఒక్క ఓటే ఆమెకు పడింది. ఆది రెడ్డి - మెరీనా రోహిత్  సూర్యకి ఓటేశారు. దీంతో రాజశేఖర్ ఎక్కువ ఓట్లు పొంది ఇంటి కెప్టెన్ గా మారాడు. అతను కేవలం సానుభూతి ఓట్లతోనే గెలిచాడు. ఇనయ కన్నీళ్లు పెట్టుకుని ఇలా ఓట్లేసే పద్ధతి కన్నా ఆటల్లో గెలిచి ఎప్పటికైనా కెప్టెన్ అవుతానంటూ చెప్పుకొచ్చింది. 


ఇంట్లో సుధీర్ బాబు - కృతి శెట్టి
సుధీర్ బాబు- కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ‘ఆ అమ్మాయి గురించి ఒకటి చెప్పాలి’. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వారు ఇంట్లోకి వచ్చారు. ఇంటి సభ్యులతో పాపులర్ సినిమా డైలాగులు చెప్పింది నవ్వించారు. రేవంత్ ‘ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండు గాడు’ డైలాగ్ చెప్పాడు. అలాగే గీతూ బుజ్జిగాడు సినిమా డైలాగ్ చెప్పింది. ఆర్జే సూర్య పవన్ కళ్యాణ్ వాయిస్ ను ఇమిటేట్ చేశాడు. అలాగే గీతూని కూడా చేశాడు. శ్రీహాన్ - ఫైమా కామెడీతో నవ్వించారు. ఫైమా జబర్ధస్త్ లో చేసినట్టే కాస్త ఓవర్ చేసింది. విజయ్ దేవరకొండలా ఆర్జే సూర్య చక్కగా గొంతు మార్చి నటించాడు. 


వచ్చేశావా అక్కా...
రాజశేఖర్ - శ్రీసత్య కలిసి చేసిన స్కిట్ చాలా బావుంది. ఇదే స్కిట్లో శ్రీహాన్, ఆర్జే సూర్య కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో శ్రీహాన్ సప్తగిరిలా మాట్లాడి నవ్వించాడు. అలాగే ఆర్జే సూర్య విజయ్ దేవరకొండలా మాట్లాడి నవ్వించాడు. స్కిట్ మాత్రం అదిరిపోయింది. వీరిలో శ్రీహాన్ కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ నటిగా శ్రీ సత్యను ఎంపిక చేశారు. 


Also read: నేను ఎప్పటికీ తల్లి కాలేను, పెంచుకున్న పాప చనిపోయింది: ‘కార్తీక దీపం’ కీర్తి భట్ కన్నీటి గాథ


Also read: టీ ఎలా చేయాలో తెలియదు కానీ కెప్టెన్ అయిపోతాడంట, చంటి సెటైర్లు - డ్యాన్సులతో దద్దరిల్లిన ఇల్లు