థైరాయిడ్ అధికంగా ఉత్పత్తి  అయ్యేవారిలో వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోను అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల జీవక్రియ రేటు పెరిగిపోతుంది. అలాగే బరువు తగ్గడం, చేయి వణకడం, గుండు వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్) వంటి ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కీళ్ల సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్సులు కూడా అధికం. 


ఆస్టియోపొరోసిస్ అనేది ఒక సైలెంట్ డిసీజ్. ఇది ప్రధానంగా  మహిళల్లోనే కలుగుతుంది. హైపర్ థైరాయిడిజం బారిన పడిన స్త్రీలలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. వీరిలో  ఎముకల గట్టిదనం తగ్గి చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎముకలు పెళుసుగా మారి ఫ్రాక్చర్లు త్వరగా అవుతాయి. గాయం తగిలి ఎముకలు విరిగే వరకు ఆస్టియోపొరోసిస్ వచ్చిన సంగతి కూడా తెలిసే అవకాశం తక్కువ. కాబట్టి హైపర్ థైరాయిడిజంతో బాధపడే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎముకలు బలహీనంగా మారడానికి కారణం కాల్షియం, విటమిన్ డి తక్కువగా అందడమే.  


థైరాయిడ్ ఎముకలను ఎలా ప్రభావితం చేస్తుంది?
బ్రిటీష్ థైరాయిడ్ ఫౌండేషన్ ప్రకారం, హైపర్ థైరాయిడిజం, ఎముకలతో సహా మొత్తం శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలలో ఏదైనా భంగం ఏర్పడితే, దాని కారణంగా ఎముక అణువులు కరిగిపోవడం, సమతుల్యత దెబ్బతినడం వంటివి జరుగుతాయి.


థైరాయిడ్ హార్మోన్ అధికంగా విడుదలై, ఎముకను కోల్పోయే రేటును వేగవంతం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 
ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, సెకండరీ బోలు ఎముకల వ్యాధికి హైపర్ థైరాయిడిజం ఒక ముఖ్యమైన కారణం.


హైపర్ థైరాయిడిజంతో బాధపడేవాళ్లు ఖనిజాలు, విటమిన్ల లోపం రాకుండా చూసుకోవాలి. విటమిన్ డి పుష్కలంగా అందేలా సూర్యకాంతిలో నిల్చోవాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. థైరాయిడ్ అదుపులో ఉండేలా చూసుకోవాలి. థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి.


ఆహారపరంగా కూడా  చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొన, పాలు, పెరుగు, పనీర్, తాజా పండ్లు, కూరగాయలు తినాలి. రోజు గ్లాసుడు పాలు తాగితే కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. విటమిన్ డి కోసం పచ్చసొన తినాలి. సూర్యకాంతిలో నిలబడాలి.


 


Also read: ప్రేమమూర్తి అయిన అమ్మకు అందంగా ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి



Also read: మీకు ఇష్టమైన పండు ఏదో చెప్పండి, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతుంది



Also read: షుగర్ వ్యాధిని అదుపులో పెట్టే అద్భుత ఔషధం ఇది, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.