ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే విరివిగా లభిస్తాయి. వాటిల్లో మీకు ఇష్టమైన పండు ఏమిటో చెబితే దాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో చెప్పవచ్చు. మానసిక నిపుణులు కూడా వ్యక్తిత్వ లక్షణాలను డీకోడ్ చేయడానికి పండ్లను ఉపయోగిస్తారు. మీకు ఏ పండు ఇష్టమో మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి.


అరటిపండు 
ఈ పండు విరివిగా దొరుకుతుంది. ఈ పండును ఇష్టపడేవారు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఏదీ మనసులో దాచుకోరు. అన్ని బయటకే భోళా శంకరుల్లా మాట్లాడుతారు. అంతేకాదు ఈ వ్యక్తులు సంబంధ బాంధవ్యాలకు విలువ ఇస్తారు. ఏ పని అయినా చాలా శ్రద్ధతో చేస్తారు.


ఆపిల్
రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండవచ్చని అంటారు. అలాగే ఆపిల్ ఇష్టపడే వ్యక్తులు ఆచరణాత్మకంగా ఉంటారు. ఏ పనినైనా పద్ధతిగా చేస్తారు. దినచర్య, క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు.


మామిడిపండు
వేసవిలో అధికంగా దొరుకుతుంది మామిడిపండు. దీన్ని ఇష్టపడే వ్యక్తులు చాలా స్టైలిష్ గా ఉంటారని అంటారు. ఆకర్షణీయంగా కనిపిస్తారు.  వీరిని నమ్మవచ్చు. ఆశావాదంతో ముందుకు వెళ్తారు. పండ్లలో మామిడిపండును రారాజుగా పిలుస్తారు. అలాగే వీరు కూడా తమ జీవితంలో రాజులా బతకాలని అనుకుంటారు. సున్నితమైన అంశాలపై ఇష్టాన్ని చూపిస్తారు. తమ అర్హతకు తగ్గ వస్తువులనే కొంటారు. తక్కువ స్థాయి వస్తువులను వాడడానికి ఇష్టపడరు.


పైనాపిల్ 
ఈ అనాసపండును ఇష్టపడే వ్యక్తులు ఉత్సాహంగా ఉంటారు. వారితో మాట్లాడితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సేదతీరినట్టు అనిపిస్తుంది. మీరు ఆశావాదంతో ముందుకెళ్తారు. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారితో ఎవరు ఉన్నా కూడా వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఎదుటివారిని సంతోషంగా ఉంచడంలో వీరు నిపుణులు.


ఆరెంజ్
సిట్రస్ పండ్ల జాతికి చెందినది నారింజ. ఈ పండును ఇష్టపడే వ్యక్తులు సృజనాత్మకతను కలిగి ఉంటారు. చాలా కళాత్మకంగా పనులను చేస్తారు. సాహసోపేత నిర్ణయాలను, స్వభావాన్ని కలిగి ఉంటారు. 


పండ్లను బట్టి వ్యక్తిత్వం చెప్పవచ్చని సైకాలజీలో కూడా ఉంది. అయితే పండ్లను తినడం వల్ల ఎంత ఆరోగ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిని రోజూ తినడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో మేలు జరుగుతుంది. అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే ఆపిల్, ఆరెంజ్, పైనాపిల్ వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 


Also read: ఈ బంగాళదుంపలు కిలో కొనాలంటే ఒక నెల జీతం ఖర్చు పెట్టాల్సిందే, ఇవి చాలా స్పెషల్


Also read: రెటినోబ్లాస్టోమా, కంటికి వచ్చే క్యాన్సర్ ఇది - జాగ్రత్త పడకపోతే చూపు పోతుంది


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.