అనుబంధానికి అర్ధం అమ్మ. బంధాలను, ప్రేమను, ఈ ప్రపంచాన్ని బిడ్డకు పరిచయం చేసేది అమ్మే. అమ్మ గుండె చప్పుడు వింటూ పెరిగిన బిడ్డకు ఆమెనే సర్వస్వం. బిడ్డల జీవితం కోం తమ జీవితాన్నే అంకితం చేస్తారు తల్లులు. బిడ్డల పెంపకం కోసం తమ కెరీర్ ను, చదువును పక్కన పెట్టిన తల్లులు ఎంతో. వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసమే ఏర్పడింది ‘అంతర్జాతీయ మాతృ దినోత్సవం’. ప్రతి ఏడాది మేలో వచ్చే రెండో ఆదివారాన్ని అమ్మల దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఈ రోజున తల్లుల త్యాగాలను, శ్రమను గుర్తించి వారికి అందమైన బహుమతితో శుభాకాంక్షలు చెప్పండి. వందేళ్లకు పైగా ఈ దినోత్సవాన్ని ప్రపంచం నిర్వహించుకుంటోంది. అమెరికాలో తొలి అమ్మల దినోత్సవాన్ని 1910లో నిర్వహించుకున్నారు. అమెరికా నుంచి మిగతా దేశాలకు పాకింది మాతృ దినోత్సవం. బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మకు ఒక రోజంటూ ఉండాలన్న కారణంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రపంచ హాట్ ఫేవరేట్ దినోత్సవంగా మారిపోయింది.
1. అంతులేని అనురాగం అమ్మ
అలుపెరుగని ఓర్పు అమ్మ
అరుదైన ప్రేమ రూపం అమ్మ
ప్రపంచంలోని అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
2. అమ్మ చేసే ప్రతి పని
మన ఆనందం కసమే
మన ఆనందంలోనే
తన ఆనందాన్ని వెతుక్కునే
గొప్ప ప్రేమ మూర్తి అమ్మ
అలాంటి అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
3. ప్రేమను పరిచయం చేసిన ఆమెను ప్రేమిద్ధాం
తల్లిగా ఆమె చేసిన సేవలను గుర్తిద్దాం
ఆమెకు కష్టం రాకుండా కాపాడుకుందాం
అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
4. అమ్మ అందమైన అనుబంధం
అంతులేని అనురాగం
మరపురాని మధుర బంధం
అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
5. అమ్మ గొప్పతనాన్ని తెలిపేందుకు భాష చాలడం లేదు
కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు
నాకు మరో జన్మంటూ ఉంటే
నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మ
అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
6. ఈ లోపంలో నువ్వు ఎంత ద్వేషించినా
నిన్ను ప్రేమించేది కేవలం తల్లి మాత్రమే
అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
7. ఈ లోకంలో అన్నింటికన్నా అమూల్యమైనది
అతి మధురమైనది, అనంతమైనది
అమ్మ అనురాగం ఒక్కటే
అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
8. అమ్మంటే...రేపటి మీ భవిష్యత్తు కోసం
నేటి నుంచే శ్రమించే నిత్య శ్రామికురాలు
అలాంటి అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
9. ఓడినప్పుడు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా
నేనున్నా... అంటూ ధైర్యం చెప్పే వ్యక్తి అమ్మ.
అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
10. నీకు మాకోసం చేసిన త్యాగాలు,
మమ్మల్ని పెంచడానికి పడిన బాధలు వెలకట్టలేనివి
వాటికి చిన్న థ్యాంక్స్ అనే పదంతో సరిపెట్టలేము
నీకు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము
అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
11. ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసిన
మా అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
12. ఓర్పుకు, సహనానికి మారుపేరు అమ్మ
తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
13. అమ్మ లేని ఇల్లు చందమామలేని ఆకాశంలాంటిది
అమ్మ ఉంటేనే అందం, ఆనందం
ప్రపంచంలోని అమ్మలందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
14. తన ప్రాణాలను పణంగా పెట్టి
నీకు ప్రాణం పోసే దేవత అమ్మ
తల్లులందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
15. గుడి లేని దేవత నువ్వు
కల్మషం లేనిది నీ ప్రేమ
అమృతం కన్నా తియ్యనైనది నీ మాట
అమ్మా... అందుకో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
16. కనిపించని దేవుడైనా
కని పెంచే నీ తరువాతే అమ్మా...
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు