ఒక్కోసారి ఎవరినైనా చితక బాదేయాలంత కోపం వస్తుంది. కానీ, ఏం చేయలేం. దీంతో గదిలోకి వెళ్లి గట్టిగా అరిచి కోపాన్ని చల్లార్చుకోడానికి ప్రయత్నిస్తాం. కోపం మరీ ఎక్కువైతే.. చేతికి అందిన వస్తువును నేలకేసి కొడతాం. గట్టి తిట్టుకుంటూ మనసులో ఉన్నదంతా కక్కేస్తాం. అయితే, ఈ సారి మీకు కోపం వచ్చినప్పుడు ఎవరినైనా కొట్టాలి అనిపిస్తే.. ఈ వ్యక్తిని కొట్టేయండి. ఏమీ అనుకోడు. తిరిగి కొడతాడనే భయం కూడా అక్కర్లేదు. ఎందుకంటే.. అతడి వృత్తే కొట్టించుకోవడం.
ఔనండి.. టర్కీకి చెందిన హసన్ రిజా గునాయ్ అనే వ్యక్తి.. కోపంగా ఉన్న వ్యక్తులతో కొట్టించుకుంటున్నాడు. గత 11 ఏళ్ల నుంచి అతడు ఇదే పని చేస్తున్నాడు. ఇతరుల కోపాన్ని, ఒత్తిడిని తగ్గించేందుకు తాను తన్నులు తింటున్నాడు. టర్కీ డైరెక్టర్ కెమల్ సునాల్ తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ‘సార్క్ బుల్బులు’ అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని హసన్ 2010 నుంచి కొట్టించుకుంటున్నాడు.
కొంతమంది ధ్యానం, వ్యాయామం, నిద్ర ద్వారా తమ ఒత్తిడిని తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారు. కొందరైతే గట్టిగా అరిచి తనలో బరువును తగ్గించుకుంటారు. మరికొందరికైతే ఎవరినైనా కొట్టే వరకు తమ ఒత్తిడి తగ్గదన్నంత కోపంతో ఊగిపోతారు. దీంతో హసన్ దాన్ని వృత్తిగా మలుచుకోడానికి సిద్ధమైపోయాడు. అయితే, హసన్.. ఎవరితోనూ ‘ఉచితం’గా కొట్టించుకోడు. ఇందుకు ఛార్జీలు వసూలు చేస్తాడు. ఒక్కసారి మీరు మనీ పే చేశారంటే అతడిని ఎంత సేపైనా కొట్టుకోవచ్చు. ఎంత గట్టిగా కొట్టినా.. అతడి తిరిగి కొట్టడం గానీ.. తిట్టడం గానీ చేయడు. ఈ వృత్తికి అతడు ‘స్ట్రెస్ కోచ్’ అని పేరు పెట్టాడు. దాదాపు పదేళ్ల నుంచి తన్నుల తింటున్న హసన్.. వయస్సు పెరగడంతో ఇతరులకు ఈ వృత్తిలో శిక్షణ ఇస్తున్నాడు.
మీకు ఎవరిని కొట్టాలని అనిపిస్తుందో ఆ వ్యక్తి ఫొటోను అతడికి ఇస్తే.. ముఖానికి పెట్టుకుంటాడు. ఆ తర్వాత మీ ఇష్టం ఎంత సేపైనా అతడిని కుమ్మేయొచ్చు. కొంతమంది ఆవేశంలో చాలా గట్టిగా కొట్టేస్తారట. అయినా సరే హసన్.. వారిని ఏమీ అనడు. వారికి ఆ వ్యక్తిపై ఉన్న కోపం అలాంటిదని సరిపెట్టుకుంటాడు. తనను కొట్టేవారిని తిరిగి తిట్టడం గానీ, మందలించడం గానీ చేయడు. అలా చేస్తే క్లయింట్స్ డిస్ట్రబ్ అవుతారని అంటున్నాడు. హసన్ వద్దకు వచ్చే క్లయింట్స్‌లో 70 శాతం మంది మహిళలేనట. కాబట్టి.. వారు కొట్టే దెబ్బలకు పెద్ద నొప్పి వచ్చేది కాదట. అయితే, ఎవరైనా సరదాగా కొట్టడానికి వస్తే మాత్రం అంగీకరించేవాడు కాదు. డబ్బులిస్తారు కదా? ఎందుకు అంగీకరించవని అడిగితే.. నేను కేవలం స్ట్రెస్ కోచ్ మాత్రమే. ఎంటర్‌టైనర్‌ను కాదు అని సమాధానం ఇస్తున్నాడు. దెబ్బలు గట్టిగా తగులుతాయి కాదా అని ప్రశ్నిస్తే.. అందుకు తాను ముఖానికి, శరీరానికి గార్డ్స్ ఏర్పాటు చేసుకుంటానని చెప్పాడు. సాధారణంగా ఎవరినైనా కొడితే పోలీస్ స్టేషన్‌లో కేసువుతుందని, తనని కొడితే మాత్రం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని హసన్ తెలిపాడు.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి