Daily Sugar Limit : షుగర్​ని పూర్తిగా మానేయ్యాల్సిన పనిలేదు.. ఈ మోతాదులో తీసుకుంటే హెల్త్​కి ప్రాబ్లమ్ ఉండదట

Sugar intake : షుగర్ లేదా స్వీట్స్​ను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయంటున్నారు. అయితే తెలియకుండా కొన్ని ఫుడ్స్​లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. మరి దీనిని ఎలా కంట్రోల్ చేయాలంటే..

Continues below advertisement

Daily Sugar Intake Guidelines : షుగర్ ఆరోగ్యాన్ని ప్రతికూలం ప్రభావితం చేస్తుంది. వివిధ ఆరోగ్య సమస్యలు దీనివల్లే వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను కూడా ఇది పెంచుతుంది. ముఖ్యంగా అధిక చక్కెర, స్వీట్స్ ఉపయోగించేవారికి ఇది ఆరోగ్యపరంగా ఎన్నో నష్టాలను కలిగిస్తుంది. మరి ఆరోగ్యానికి హాని కలిగించకుండా రోజుకు ఎంత షుగర్ తీసుకోవచ్చో? షుగర్, స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Continues below advertisement

బరువు

షుగర్​లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు తక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే బరువు పెరిగేలా చేస్తాయి. అయితే వీటిని ఎక్కువకాలం తీసుకుంటే ఊబకాయం వచ్చే అవకాశాలను పెంచుతుంది.  

మధుమేహం

శరీరంలో చక్కెర అధికంగా ఉంటే అది ప్యాంక్రియాస్​ను ఓవర్​ లోడ్ చేస్తుంది. ఇది టైప్​ 2 డయాబెటిస్​ ప్రమాదాన్ని పెంచుతుంది. 

గుండె సమస్యలు

చక్కెరను, స్వీట్స్​ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ మొదలై చెడు కొలెస్ట్రాల్​ను పెంచుతుంది. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది. 

పంటి ఆరోగ్యం

షుగర్ దంత సమస్యలను పెంచుతుంది. దంత క్షయం, పిప్పళ్లను ప్రేరేపించే బ్యాక్టీరియాను ఇది డెవలప్​ చేసి దంతాలను పూర్తిగా దెబ్బతీస్తుంది.

రోజుకు ఎంత షుగర్ తీసుకోవచ్చంటే.. 

రోజువారీ మీరు తీసుకునే కేలరీల్లో షుగర్ వినియోగం 10 శాతం మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization (WHO)) తెలిపింది. అయితే మీరు హెల్తీగా ఉండేందుకు.. 5 శాతం తీసుకుంటే మంచిది. పెద్దలు అయితే రోజుకు 25 గ్రాముల షుగర్ తీసుకోవచ్చట. 

ఆ ఫుడ్స్​కి దూరంగా ఉండాలి.. 

సాధారణంగా పంచదారను వినియోగిస్తే షుగర్ అనుకుంటారు. కానీ కొన్ని ఆహార పదార్థాల్లో కూడా చక్కెర ఉంటుంది. తేనె, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్​లు, ప్రాసెస్​ చేసిన ఫుడ్స్​లో షుగర్​ ఉంటుంది. సాస్​లు, బ్రెడ్​లలో కూడా చక్కెర ఉంటుంది. ప్రాసెసింగ్ లేదా తయారీ సమయంలో షుగర్ వేయడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. 

ఎలా కంట్రోల్ చేయాలంటే.. 

షుగర్​ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా షుగర్ క్రేవింగ్స్​ ఉన్నవారికి చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ సింపుల్ టిప్స్​తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్​ని తీసుకుంటే మంచిది. సహజంగా, ప్రాసెస్ చేయని ఫుడ్స్​ని మీ డైట్​లో చేర్చుకోవాలి. కూల్ డ్రింక్స్​కి బదులు నీరు, టీ, సహజమైన పండ్ల రసాలు తీసుకోవచ్చు. వాటిలో షుగర్ వేసుకోకపోవడం లేదా వాటిలోని షుగర్​ మొత్తాన్ని తగ్గిస్తే మంచిది. 

షుగర్​ని కంట్రోల్ చేసేముందు కచ్చితంగా మీ డైటీషన్ లేదా మీ పర్సనల్ డాక్టర్​ని సంప్రదించండి. వారి సూచనలతో మీరు షుగర్ కంట్రోల్ డైట్​లు ఫాలో అవ్వొచ్చు. 

Also Read : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Continues below advertisement