Beach Trip Essentials : సన్​ సెట్ అయినా.. సన్ రైజ్​ అయినా.. బీచ్​ దగ్గరుంటే ఈ రెండూ సమయాలు స్వర్గమనే చెప్పొచ్చు. అందుకేనేమో చాలామంది బీచ్​కు వెళ్లేందుకు ఇష్టపడుతూ ఉంటారు. చలికాలమైనా, వేసవికాలమైన బీచ్​లనేవి ఎప్పుడూ బోర్ కొట్టవు. సీజన్​తో సంబంధం లేకుండా బీచ్​కి వెళ్లేవారు కూడా ఉన్నారు. అయితే మీరు బీచ్​కి వెళ్లేప్పుడు కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వకపోతే.. మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే నెక్స్ట్​ టైమ్​ బీచ్​కి వెళ్లేప్పుడు కచ్చితంగా కొన్ని వస్తువులు తీసుకువెళ్లండి. అవేంటంటే.. 


డ్రై టవల్


కచ్చితంగా బీచ్​కి వెళ్లేప్పుడు తీసుకువెళ్లాల్సిన వాటిలో డ్రై టవల్ ఒకటి. మీరు నీటిలో తడిచిన వెంటనే బాడీని తుడుచుకునేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. లేదంటే ఉప్పు నీరు శరీరంపై డర్ట్ పేరుకుపోయేలా చేస్తుంది. పైగా నార్మల్ టవల్​లాగా కాకుండా చాలా త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి.. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. టవల్​కి బదులుగా వీటిని ఉపయోగిస్తే చాలా బెస్ట్ ఆప్షన్. 


వెనిగర్, దూది


బీచ్​కి వెళ్లేప్పుడు వెనిగర్ చిన్న బాటిల్, దూది తీసుకువెళ్తే మంచిది. ఎందుకంటే.. బీచ్​లలో కొందరు జెల్లి ఫిష్ స్టింగ్స్​తో ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో దానిపై వెనిగర్ పోస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే బ్యాండేజ్​లు, వైప్స్, పెయిన్ రిలీవర్స్ కూడా మీ లగేజ్​లో ఉండేలా చూసుకోండి.


సన్​స్క్రీన్


బీచ్​లకు వెళ్లినప్పుడు కచ్చితంగా తీసుకువెళ్లాల్సిన వాటిలో సన్​స్క్రీన్ ముందు ఉంటుంది. ఎందుకంటే వాటర్​లో తడవడం, ఉప్పు, ఇసుక వల్ల చర్మం త్వరగా డార్క్ అయిపోతుంది. పైగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల స్కిన్​ టోన్ మారిపోతుంది. డ్రైగా అయిపోతుంది. కాబట్టి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్​స్క్రీన్​ కచ్చితంగా ఉపయోగించాలి. రెగ్యూలర్​గా ముఖానికే ఉపయోగించినా.. బీచ్​లకు వెళ్లేప్పుడు శరీరం మొత్తానికి సన్​ స్క్రీన్ అప్లై చేసుకుంటే మంచిది. SPF 50 ఉండే సన్​ స్క్రీన్​లు ఎంచుకోవడం మంచిది. 


వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచ్


బీచ్​కి వెళ్లినప్పుడు ఫోటోలు దిగకుండా ఉండలేము. కానీ నీటిలో ఫోన్స్ తడిచిపోతే.. అదొక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి బీచ్​ ట్రిప్​కి వెళ్లేప్పుడు వాటర్​ ప్రూఫ్ ఫోన్​ పౌచ్​లు ఉపయోగిస్తే మంచిది. వాటర్ గేమ్స్ ఆడేప్పుడు కూడా ఇది మీకు హెల్ప్ ఫుల్​గా ఉంటుంది.


Also Read : సమ్మర్ స్పెషల్ లుక్స్​.. బీచ్​ నుంచి ఫంక్షన్లవరకు ఇలాంటి డ్రెస్​లను ఎంచుకుంటే అదిరిపోతారంతే


స్నార్​కెలింగ్ గేర్


మీరు సముద్రంలో డైవ్ చేయాలనుకుంటే కచ్చితంగా Snorkeling Gear ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇది మీకు తక్కువ కాస్ట్​లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇవి మీరు స్విమ్ చేస్తున్నప్పుడు ఇబ్బంగి లేకుండా చేస్తాయి. 


వీటంన్నిటినీ కచ్చితంగా మీ బీచ్​ ట్రిప్​లో ఉండేలా చూసుకోండి. వీటివల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. అలాగే బీచ్​ నుంచి రూమ్​కి వెళ్లిన తర్వాత కచ్చితంగా స్నానం చేస్తే మంచిది. అలాగే స్విమ్ చేసేప్పుడు నీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మింగకూడదు. ఇవన్నీ మీ బీచ్​ ట్రిప్​ని బాగా ఎంజాయ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. 



Also Read : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే