Good Friday Interesting Facts : క్రైస్తవులు స్పెషల్​గా చేసుకునే అతి ముఖ్యమైన రోజుల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. అయితే దీనిని సంతోషంతో కాకుండా బాధతో సెలబ్రేట్ చేసుకుంటారు. జీసస్​ని శిలువు వేసిన దినంగా గుడ్​ ఫ్రైడేని చేసుకుంటారు. యేసు క్రీస్తును శిలువ వేస్తే గుడ్ ఎందుకవుతుందనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఆయన త్యాగం వల్ల తమకు రక్షణ వచ్చిందని నమ్ముతూ.. దీనిని గుడ్​ ఫ్రైడేగా పిలుస్తారు. అయితే ఈ గుడ్​ ఫ్రైడే గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

క్రైస్తవ ఆచారం

గుడ్​ ఫ్రైడే క్రైస్తవుల్లోని ప్రాచీన పండుగల్లో ఒకటిగా చెప్తారు. దీనిని నాలుగవ శతాబ్దం నుంచే జరుపుకున్నట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అందుకే దీనిని పురాతనమైన క్రైస్తవ ఆచారంగా భావిస్తారు. 

నో బెల్స్.. 

గుడ్​ ఫ్రైడే రోజున చర్చుల్లో ప్రార్థనలు చేస్తారు కానీ కొన్ని క్రైస్తవ మత సంస్థల్లో చర్చి గంటలు మోగించరు. యేసు త్యాగాన్ని గౌరవించడంలో దీనిని ఓ భాగంగా చెప్తారు. 

ఉపవాసం.. 

గుడ్​ ఫ్రైడే రోజు కొందరు క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు. మరికొందరు నాన్​వెజ్​ తినరు. 

అంధకారం.. 

బైబిల్ ప్రకారం గుడ్​ ఫ్రైడే రోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు భూమి మీద అంధకారం జరిగిందని చెప్తారు. ఇది యేసు మరణ సమయంలో జరిగినట్లు చెప్తారు. అయితే ఆ సమయంలో కొన్ని చోట్లో మబ్బులు కమ్ముకుంటుందని.. వర్షం వస్తుందని కూడా కొందరు నమ్ముతారు. 

నాటకాలు.. 

ఫిలిప్పీన్స్, లాటిన్ అమెరికా వంటి కొన్ని దేశాల్లో యేసు శిలువ వేయబడిన సీన్​ని రిప్రెజెంట్ చేస్తూ నాటకాలు వేస్తారు. 

విభిన్న ఆచారాలు.. 

గుడ్​ ఫ్రైడే ఒక్కో దేశంలో ఒక్కోలా చేసుకుంటారు. ఫిలిప్పీన్స్​లో కొందరు తాము కూడా శిలువ వేస్తున్నట్లు భావిస్తూ.. నిజంగానే గాయాలు చేసుకుంటారు. జర్మనీలో గుడ్​ ఫ్రైడే రోజు డ్యాన్స్​లు, వినోద కార్యక్రమాలు నిషేదం. బర్ముడాలో ప్రజలు గాలిపటాలు ఎగురవేస్తారు. ఇది పరలోకారోహణకు సంకేతంగా చెప్తారు. ఇండియాలో చాలా ప్రదేశాల్లో అందరూ చర్చికి వెళ్లి ఉపవాస ప్రార్థనలు చేస్తారు. 

తేదీ మారుతుంది.. 

గుడ్ ఫ్రైడే తేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. మూన్​ క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్​ ఫ్రైడేగా చేసుకుంటారు. 

ఈ గుడ్​ ఫ్రైడేతో లెంట్​ డేస్ పూర్తి అవుతాయి. గుడ్​ ఫ్రైడే తర్వాత ఆదివారం ఈస్టర్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. గుడ్​ ఫ్రైడే రోజు ఏసును శిలువ వేస్తే.. ఆయన ఆదివారం తిరిగి లేచాడని గుర్తు చేసుకుంటూ.. ఈస్టర్​ పండుగను చేసుకుంటారు.