Food Combinations to Avoid : కొన్ని ఫుడ్స్​ని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తప్పవంటున్నారు. రెండూ హెల్తీ ఫుడ్సే అయినా.. వాటిని కలిపి తినడం వల్ల శరీరంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయట. అయితే ఎలాంటి కాంబినేషన్స్ తింటే హెల్త్​పై ఎలాంటి ప్రభావం పడుతుందో? ఏ ఫుడ్స్ కలిపి తీసుకోకూడదో.. వాటికి ఆల్ట్రనేటివ్​గా ఏమి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఈ కాంబినేషన్స్ జోలికి వద్దు.. 


సిట్రస్ ఫ్రూట్స్, పాలు : సిట్రస్ ఫ్రూట్స్​ని పాలు కలిపి తీసుకోకూడదట. అంటే నిమ్మకాయలు, ఆరెంజ్, ద్రాక్షలు వంటి సిట్రస్ పండ్లను పాలతో కలిపి తీసుకోకూడదట. ఇవి జీర్ణసమస్యలను పెంచుతాయని, ఎసిడిటీని పెంచుతాయట. కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు పాలను, వాటికి సంబంధించిన ఉత్పత్తులు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు. 


బీన్స్, క్యాబేజి : బీన్స్, క్యాబేజి కలిపి తింటే.. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో ఇబ్బంది కలుగుతాయట. వీటిలోని సల్ఫరో కంపౌండ్స్ జీర్ణ సమస్యలు పెంచుతాయట. 


టోమాటోలు, స్టార్చ్ ఫుడ్స్ : టోమాటోలు బ్రెడ్, పాస్త, రైస్​తో కలిపి తీసుకుంటే.. శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుందట. కాబట్టి మధుమేహ సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటికి దూరంగా ఉంటే మంచిది. 


పాలు, అరటిపండ్లు : చాలామంది పాలు, అరటిపండ్లు కలిపి తీసుకుంటారు కానీ ఈ కాంబినేషన్ అంత మంచిది కాదట. ఇది జీర్ణ సమస్యల్ని పెంచుతుందట. పాలల్లోని లాక్టోస్, అరటిపండ్లలోని స్ట్రాచ్స్​ కలిపి కడుపులో ఇబ్బందిని కలిగిస్తాయట.


పులియబెట్టిన ఆహారాలు, షుగర్ డ్రింక్స్ : సాధారణంగానే షుగర్ డ్రింక్స్ ఆరోగ్యానికి అంతమంచివి కావు. అలాగే ఫెర్మెంట్ చేసినవి కొన్ని ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ షుగర్ డ్రింక్స్​తో కలిపి తీసుకోవద్దని చెప్తున్నారు. ఇది గట్ బ్యాక్టీరియాను, జీర్ణ సమస్యలను పెంచుతుంది. 


ఫ్యాట్ ఫుడ్స్, పచ్చి కూరగాయలు : ఫ్రై చేసిన, సాస్​లలో ఉండే హై ఫ్యాట్ ఫుడ్స్​ను పచ్చి కూరగాయలతో కలిపి తీసుకుంటే మంచిది కాదు. ఇలా కలిపి తీసుకుంటే శరీరానికి అందాల్సిన న్యూట్రెంట్స్ సరిగ్గా అందవట. 


మీరు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే.. నట్స్, సీడ్స్​తో కలిపి హెల్తీ స్నాక్​గా తీసుకోవచ్చు. బీన్స్​ని రైస్​, క్వినోవాతో కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. టోస్ట్​ను అవకాడో, గుడ్లతో కలిపి బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు. టోమాటోలను చికెన్, చేపలతో కలిపి బ్యాలెన్స్డ్​ మీల్​గా తీసుకోవచ్చు. అరటిపండ్లు, బాదం బట్టర్, పీనట్ బట్టర్​తో కలిపి తీసుకోవచ్చు. 



ప్రతి ఒక్కరి శరీరం ఒక్కోలా బిహేవ్ చేస్తుంది కాబట్టి.. మీ బాడీకి ఏమి పడుతున్నాయో లేదో కచ్చితంగా తెలుసుకోవాలి. దానికి తగ్గట్లు డైట్ ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 


Also Read : ఈ ఫుడ్స్ తింటూ కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు తెలుసా? లిస్ట్ ఇదే
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.