Heatstroke Emergency Care : సమ్మర్ వల్ల ఎండలు మండిపోతున్నాయి. అతి వేడి, సూర్యరశ్మి కారణంగా డీహైడ్రేషన్, సన్​స్ట్రోక్ వంటి ఇబ్బందులకు ప్రజలు గురి అవుతారు. ఈ ఇబ్బందులతో ఎవరైనా సఫర్ అవుతున్నా.. కళ్లు తిరిగి పడిపోయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఏ టిప్స్ ఫాలో అయితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

నీడకు తీసుకెళ్లాలి.. 

ఎవరైనా ఎండవల్ల కళ్లు తిరిగి పడిపోయినా సన్​స్ట్రోక్​కి గురి అయినా వారిని నీడలోకి తీసుకెళ్లాలి లేదా చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. బాధితుల ముఖాన్ని తడి క్లాత్​తో తుడవాలి. కూల్ వాటర్ కాకుండా.. గది టెంపరేచర్​లో ఉండే నీటిని వాడాలి. 

వదులు చేయాలి.. 

కళ్లు తిరిగి పడిపోతే దుస్తులు వదులు చేయాలి. వారికి గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరానికి గాలి బాగా అందుతుంది. బాడీ టెంపరేచర్​ నార్మల్​కి వచ్చేలా చూడాలి. నేలపై పడుకోబెట్టి సపర్యలు చేయాలి. 

అందించాల్సినవి ఇవే

ఓఆర్​ఎస్, కొబ్బరి నీళ్లు, ఫ్రూట్స్ జ్యూస్, నిమ్మరసం వంటివి చిన్న చిన్ని సిప్​లుగా అందించాలి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలేట్స్​ని బ్యాలెన్స్ చేస్తాయి. శరీరాన్ని డీహైడ్రేషన్​ నుంచి దూరం చేస్తాయి. చల్లగా ఉండేవాటిని, కూల్​ డ్రింక్స్​ని ఇవ్వకూడదు.

హీట్ స్ట్రోక్ ఫస్ట్ వస్తే.. 

హీట్ స్ట్రోక్ వచ్చిన స్పృహలో ఉంటే.. అతనికి నీటిని లేదా ఇతర డ్రింక్స్​ని తాగించాలి. నేలపై పడుకోబెట్టి కాళ్లు కాస్త ఎత్తుగా ఉండేలా ఎలివేట్ చేయాలి. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. గాలి తగిలేలా ఫ్యాన్ వేయడం వంటివి చేయాలి. 

తడి క్లాత్​తో నుదురు, మెడ, చేతులను తుడుస్తూ ఉండాలి. దీనివల్ల శరీరంలోని ఉష్ణోగ్రత కంట్రోల్​ అవుతుంది. అలాగే వెంటనే దగ్గర్లోని మెడికల్ స్పాట్​కి తీసుకెళ్లాలి. పరిస్థితి చేయి జారకుండా ఉంటుంది. బాధితులకు ఏదైనా హెల్ప్ వచ్చేవరకు వారితోనే ఉండండి. అది వారి పరిస్థితి చేజారకుండా చూస్తుంది.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సమ్మర్​లో బయటకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు నేరుగా ఎండ తగలకుండా స్కార్ఫ్ కట్టుకోవాలి. అలాగే కళ్లకు షేడ్స్ పెట్టుకుంటే మంచిది. మీతో పాటు వాటర్​ బాటిల్ క్యారీ చేయాలి. కుదిరితే ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేయండి. ఎక్కువసేపు ఎండలో ఉన్నారనుకుంటే కాసేపు నీడలో రెస్ట్ తీసుకుని వెళ్తే మంచిది. శరీరాన్ని కూల్ చేసే ఫుడ్స్​ని రెగ్యులర్​గా తీసుకుంటే మంచిది. కొబ్బరి నీళ్లు కూడా తీసుకుంటూ ఉంటే మంచిది. ఇవన్నీ సమ్మర్​లో హీట్​ స్ట్రోక్​ నుంచి డీహైడ్రేషన్​ నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.

 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.