బ్రెయిన్ ట్యూమర్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మెదడులో అసాధరణ రీతిలో కణాలు ఏర్పడి నియంత్రించలేని విధంగా పెరుగుతాయి. ఇవి ఒక్కోసారి ప్రాణాపాయంగా మారితే మరికొన్ని సార్లు పక్షవాత, మాట్లాడటంలో ఇబ్బంది వంటి సమస్యలను కలుగజేస్తుంది. కణితులు ఉన్న వ్యక్తులు అలసట, వికారం, తలనొప్పి వంటి అనేక లక్షణాలని అనుభవిస్తారు. కొన్ని సార్లు బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళలో ఎటువంటి లక్షణాలు కనిపించవని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది ప్రాణాంతకం కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం విస్మరించొద్దు. మెదడు కణితి లక్షణాల్లో మొదటిగా అనిపించేది తీవ్రమైన తలనొప్పి. ఇది మైగ్రేన్ వల్ల అని చాలా మంది అనుకుంటారు కానీ ట్యూమర్ లక్షణం కూడా ఇలాగే ఉంటుంది. ఇది మెదడు, వెన్నుపాముపై ఒత్తిడి కలిగిస్తుంది. ఇంతకముందు 50 ఏళ్లు పైబడిన వారసత్వం ఉన్న వారిలో మాత్రమే బ్రెయిన్ ట్యూమర్ వచ్చేది కానీ ఇప్పుడు వయసు వారసత్వంతో సంబంధం లేకుండా దాడి చేస్తుంది.


సెల్ ఫోన్ వినియోగం


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సెల్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉంటే అది బ్రెయిన్ ట్యూమర్ తో సంబంధం కలిగి ఉందని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం మొబైల్ ఫోన్లు విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తాయి. ఇది క్యాన్సర్ కారకం కావచ్చు. అందుకే సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. వీలైతే స్పీకర్ ఫోన్ ఆయన చేసి మాట్లాడటం మంచిది.


రసాయన పదార్థాలు


బ్రెయిన్ ట్యూమర్ గురించి నిర్వహించిన వివిధ అధ్యయనాల ప్రకారం పురుగుమందులు, చమురు ఉత్పత్తులు, రబ్బరు, వినైల్ క్లోరైడ్, ఇతర పారిశ్రామిక సమ్మేళనాలు వంటి రసాయన పదార్థాలు ఎక్కువగా పీల్చడం వల్ల కూడా మెదడు కణితులు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బెంజీన్, టోలున్, ట్రైక్లోరెథైలీన్ వంటి రసాయనాలు పీలిస్తే మెదడులో కణితులు ఏర్పడటానికి మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు.


అధిక సంతృప్త కొవ్వు


సంతృప్త కొవ్వులు అధికంగా విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉన్న ఆహారం మెదడు కణితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారంతో పాటు ధూమపానం, వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన జీవణశైలి ప్రభావాలు కూడా దీని మీద పడతాయి.


హార్మోన్లు


పిట్యూటరీ కణితి లక్షణాలు మెదడు సమీపంలోని శరీర ఇతర భాగాల మీద కూడా కణితి ఏర్పడే ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ లక్షణాలు హార్మోన్ అసమతుల్యత వల్ల సంభవించవచ్చు. పిట్యూటరీ కణితి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హార్మోన్లను ఎక్కువగా తయారు చేసినప్పుడు హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ తీసుకునే మహిళల్లో మెదడు కణితులు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.


వయస్సు


బ్రెయిన్ ట్యూమర్ ఏ వయసునైనా ప్రభావితం చేస్తుంది. కణితులు పెద్దగా అయితే అవి క్యాన్సర్ ని అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది. 85 నుంచి 89 ఏళ్ల మధ్య వయసు వారిలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రోజూ అప్లై చేసుకోవాలా? ఎటువంటి లోషన్ ఎంచుకోవాలి