Virupaksha Movie Review : 'విరూపాక్ష' హిట్టు బొమ్మ అంటున్నారు నెటిజనులు! సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హిట్టు కొట్టాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఇది. 


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'విరూపాక్ష' నేడు థియేటర్లలోకి వచ్చింది. ఆయనకు బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత నటించిన తొలి చిత్రమిది. అందువల్ల, సినిమా మీద ఎక్కువ ఆసక్తి నెలకొంది. పైగా, రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకోవడం కూడా సినిమా మీద ఆసక్తి కలిగించింది. 


సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండును దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్  'విరూపాక్ష' సినిమాను నిర్మించారు. ఇందులో సంయుక్తా మీనన్ కథానాయిక. ఈ సినిమా ప్రీమియర్ షోలు అమెరికాలో పడ్డాయి. సినిమా బావుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 


హారర్ అంశాలతో మంచి విలేజ్ థ్రిల్లర్!
హారర్ అంశాలతో కూడిన మంచి విలేజ్ థ్రిల్లర్ 'విరూపాక్ష' అని అమెరికాలో ఆడియన్స్ చెబుతున్నారు. స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ అంటున్నారు. ట్విస్టులు కూడా బావున్నాయట. అయితే... లవ్ ట్రాక్ బాలేదని, బోర్ కొట్టించిందని మెజారిటీ జనాలు అభిప్రాయ పడుతున్నారు. అదీ సంగతి! దాంతో సాయి ధరమ్ తేజ్ హిట్టు కొట్టాడని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 


Also Read : 'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి






ఇంకో చంద్రముఖి అవుతుందా?
'విరూపాక్ష'ను కొంత మంది సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార నటించిన 'చంద్రముఖి' సినిమాతో పోలుస్తున్నారు కొందరు. ఆ ట్విస్టులు, టర్నులు ఆ విధంగా ఉన్నాయట! సుకుమార్ స్క్రీన్ ప్లే హైలైట్ అని చాలా మంది చెబుతున్నారు.  


'విరూపాక్ష' సినిమా 'చంద్రముఖి'కి 2023 వెర్షన్ అంటూ కొందరు కామెంట్ చేశారు. నిజం చెప్పాలంటే... సాయి ధరమ్ తేజ్ సినిమా కథ 2023లో జరగదు. కాలంలో వెనక్కి వెళ్లి 80, 90వ దశకంలో జరిగినట్టు చూపించారు. కానీ, ఆడియన్స్ ఫీలింగ్ అలా ఉంది మరి. అదీ సంగతి!


'విక్రాంత్ రోణ'కు అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చిన అజనీష్ లోక్ నాథ్, 'విరూపాక్ష'కు కూడా నేపథ్య సంగీతం అందించారు. ఆయన రీ రికార్డింగ్ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యిందని నెటిజన్స్ చెబుతున్నారు. 


Also Read బిడ్డకు తండ్రి ఎవరు? ఇలియానాపై దారుణమైన ట్రోల్స్