Healthy Detox Drinks : పండుగల సమయంలో స్వీట్స్, ఇతర ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. వీటిలో కొన్ని బయటకు వెళ్లిపోతాయి. మరికొన్ని టాక్సిన్ల రూపంలో శరీరంలోనే ఉండిపోతాయి. ఈ టాక్సిన్లే.. చెడు కొవ్వుగా మారి.. ఆరోగ్య సమస్యలను పెంచుతాయి. దీనివల్ల బరువు పెరగడం, మధుమేహం, బీపీ వంటి ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడుతాయి. లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే.. శరీరంలోని టాక్సిన్లను ఎలా బయటకు పంపించాలో.. హెల్తీగా బరువును కంట్రోల్​లో ఉంచే డ్రింక్స్​ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


ఏబీసీ జ్యూస్.. 


యాపిల్, బీట్ రూట్, క్యారెట్ జ్యూస్. దీనితో ఆరోగ్యానికి, అందానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. లివర్​ను డీటాక్స్ చేసి.. టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. క్యారెట్స్​లో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తూనే టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే కూడా హెల్త్​కి చాలా మంచిది. 


నిమ్మకాయలతో.. 


ఉదయాన్నే నిమ్మరసం తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే మీరు నిమ్మరసంతో పాటు.. కాస్త అల్లాన్ని కూడా వేసుకుని తాగితే చాలామంచిది. లేదంటే అల్లం షాట్​లో నిమ్మరసం పిండుకుని తాగొచ్చు. లేదంటే అల్లం టీ పెట్టుకుని దానిలో నిమ్మరసం కూడా కలిపి తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి.. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. నిమ్మరసం లివర్​ని క్లెన్స్ చేస్తుంది. అల్లం మంటను తగ్గించి.. మెటబాలీజంను పెంచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. 


పాలలో అది కలిపి.. 


జలుబు, ఫ్లూ వంటివి చేసినప్పుడు పాలల్లో మిరియాలు, పసుపు కలుపుకుని తాగుతారు. అయితే దీనిని శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడం కోసం కూడా తాగవచ్చు. ఎందుకంటే దీనిలో ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడమే కాకుండా.. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 


యాపిల్ సైడర్ వెనిగర్.. 


యాపిల్ సైడర్ వెనిగర్ కూడా అందానికి, ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. శరీరంలోని షుగర్ లెవెల్స్​ని కంట్రోల్ చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. అలాగే శరీరాన్ని డీటాక్స్ చేసి బరువు తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు కూడా నిరూపించాయి. అయితే దీనిని ఓ స్పూన్ తీసుకుని.. గ్లాస్​ గోరువెచ్చని నీటిలో డైల్యూట్ చేసి తాగాలి. దీనిని డైరక్ట్​గా ఎప్పుడూ తీసుకోకూడదు. 



పాలకూరతో.. 


పాలకూరను చాలామంది స్మూతీగా తీసుకుంటారు. అయితే దానిలో అరటిపండు, యాపిల్, నీళ్లు వేసి స్మూతీ చేసుకుని తాగితే.. శరీరంలోని టాక్సిన్లు బయటకు వచ్చేస్తాయి. అలాగే జుట్టు సమస్యలు ఉన్నవారు కూడా దీనిని రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. పైగా ఇది ఆరోగ్యానికి ఎన్నో మంచి ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి.. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సాహిస్తాయి. 


ఈ డీటాక్స్​ డ్రింక్స్​ అనేవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కానీ మీది సెన్సిటివ్ బాడీ అయినా.. ఏ పదార్థామైన మీకు సూట్ కాదు అనుకుంటే.. వైద్యులు, నిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే వీటిని మీ రెగ్యూలర్​ డైట్​లో తీసుకుంటే మంచిది. 



Also Read : దీపావళి స్పెషల్ స్వీట్స్.. సింపుల్​గా ఇంట్లో చేసుకోగలిగే రెసిపీలు ఇవే