Health Benefits of Mushrooms : సాధారణంగా వెజిటేరియన్ లకు పోషకాలు అందాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్లు, కొన్ని రకాల విటమిన్లు కాయగూరల్లోను, పండ్లలో లభించవు. అలాంటి సమయాల్లో ప్రోటీన్ల కోసం పాల సంబంధిత పదార్థాలను డైట్‌లో స్వీకరించాల్సి ఉంటుంది. అయితే పుట్టగొడుగులు వంటి ఆహార పదార్థాలు సైతం పలు రకాల విటమిన్లు అందిస్తాయి. సాధారణ కాయగూరలు లభించని పోషకాలు పుట్టగొడుగుల్లో ఉంటాయి. పుట్టగొడుగుల్లో ఉండే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టుగొడుగుల్లో రిబోఫ్లావిన్, నియాసిన్, పాంటోథినిక్ యాసిడ్ విటమిన్లు పుష్కలం. ఇవి మొత్తం జీవక్రియ ఆరోగ్యానికి ముఖ్యమైనవి. అంతేకాకుండా, సెలీనియం, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. పుట్టుగొడుగులు రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడతాయి.
రోగనిరోధక శక్తి పెంచుతాయి
పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బీటా-గ్లూకాన్‌లను కలిగి ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని ఇవి పెంచుతాయి. శరీరానికి అంటువ్యాధులు, అనారోగ్యాలతో మరింత సమర్థవంతంగా పోరాడడంలో సహాయపడతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్ చేయడంతో పాటు, ఆక్సిడేషన్ ప్రెజర్ తగ్గించడంతో పాటు సెల్ డ్యామేజ్‌ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పుట్టగొడుగులు ఎర్గోథియోనిన్, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు.
పేగు ఆరోగ్యానికి ఉపయోగడుతుంది
పుట్టగొడుగులు ఒక ప్రీబయోటిక్ ఆహారం, అంటే ఇవి ఫైబర్ కలిగి ఉంటుంది, ఇవి గట్ బ్యాక్టీరియాను పోషిస్తాయి. ఇది మెరుగైన జీర్ణక్రియను కలిగిస్తుంది.
కొన్ని పుట్టగొడుగులు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ పుట్టగొడుగులలో కనిపించే పాలీసాకరైడ్‌లు, బీటా-గ్లూకాన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఎదుర్కొవడంలో తోడ్పడతాయి.
గుండెకు మంచివి: పుట్టగొడుగులలో తక్కువ సోడియం కంటెంట్‌తో పాటు రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడతాయి. పుట్టుగొడుగుల్లో ఉండే పొటాషియం గుండె రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బ్లాకులు ఏర్పడకుండా సహాయపడతాయి.
బ్రెయిన్ హెల్త్‌కు మంచివి
పుట్టగొడుగులలో మెదడు ఆరోగ్యానికి మేలు చేసే కోలిన్ , యాంటీఆక్సిడెంట్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. పుట్టగొడుగులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి.
విటమిన్ D లభిస్తుంది
పుట్టగొడుగులు, విటమిన్-Dని ఉత్పత్తి చేయగలవు. విటమిన్ D ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు నియంత్రణకు కీలకం.
పుట్టగొడుగులు సాగు చేయడానికి అత్యంత స్థిరమైన ఆహారాలలో ఒకటిగా కూడా ఉన్నాయి. వీటికి కనీస వనరులు, స్థలం ఉంటే చాలు , వీటిని వ్యవసాయ వ్యర్థాలపై కూడా పెంచవచ్చు.
Also Read : ఈ ఫుడ్స్ క్యాన్సర్‌ను నివారించడంలో హెల్ప్ చేస్తాయట.. నిపుణుల సలహా ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.