UPSC Combined Defence Services Examination (I), 2023 (OTA) Final Result: యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDSE 1)-2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. త్రివిధ దళాల పరిధిలోని విభాగాల వారీగా ఫలితాలను విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాలకు సంబంధించి మొత్తం 347 మంది అభ్యర్థులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి (OTA) ఎంపికయ్యారు. వీరిలో 242 మంది పురుష అభ్యర్థులు, 43 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను 15 రోజుల్లో యూపీఎస్సీ వెల్లడించనుంది. దీనిద్వారా 119వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు (మెన్)లో 170 ఖాళీలను, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు (ఉమెన్)లో 17 ఖాళీలను భర్తీచేస్తారు.
యూపీఎస్సీ సీడీఎస్(1) - 2023 (OTA) తుది ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://www.upsc.gov.in/
➥ అక్కడ్ హోంపేజీలో కనిపించే 'Final Result: Combined Defence Services Examination (I), 2023 (OTA)' లింక్ పై క్లిక్ చేయాలి.
➥ ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతోంది.
➥ అక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుటులో ఉన్న ఫలితాలు కనిపిస్తాయి.
➥ 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే.
➥ ఆ పీడీఎఫ్ ఫైల్‌లో అభ్యర్థులు తుది ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
➥ ఫలితాలతో కూడిన పీడీఎఫ్‌ను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్ర పర్చుకోవాలి.
యూపీఎస్సీ సీడీఎస్(1) - 2023 (OAT) తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..
వివరాలు..
➥ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మెన్), చెన్నై: 170
➥ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఉమెన్), చెన్నై: 17
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I)-2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అక్టోబరు 27న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు త్రివిధ దళాల పరిధిలోని విభాగాల వారీగా ఫలితాలను విడుదల చేయగా. తాజాగా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి ఎంపికైన అభ్యర్థుల తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. త్వరలోనే అభ్యర్థుల మార్కులను వెల్లడించనున్నారు.
ఇండియన్ మిలటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నియామకానికి సంబంధించి మొత్తం 235 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో ఇండియన్ మిలిటరీ అకాడమీకి 156 మంది, ఇండియన్ నేవల్ అకాడమీకి 57 మంది, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 22 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక తాజాగా విడుదల చేసిన ఫలితాలకు సంబంధించి ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీకి 347 మంది ఎంపికయ్యారు.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్(I)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) డిసెంబరు 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి 2023, జనవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులు ఏప్రిల్ 10న రాతపరీక్ష నిర్వహించగా.. ఫలితాలను మే 4న విడుదల చేశారు. రాతపరీక్షలో మిలిటరీ అకాడమీకి 2696 మంది, నేవల్ అకాడమీకి 843 మంది, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 629 మంది అర్హత సాధించారు. వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలను తాాజాగా విడుదల చేసింది.