Hrithik Roshan's Fighter movie public review: 'వార్', 'పఠాన్' తర్వాత బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన సినిమా 'ఫైటర్'. హిందీ హీరో హృతిక్ రోషన్ ఇందులో హీరో. దీపికా పదుకోన్ హీరోయిన్. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు (జనవరి 25, గురువారం) థియేటర్లలోకి వచ్చింది. మరి, ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు? పబ్లిక్ టాక్ ఎలా ఉంది? క్రిటిక్స్ ఏం కామెంట్స్ చేశారు? అనేది చూడండి.
డోంట్ మిస్ అంటోన్న తరణ్ ఆదర్శ్
ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అయితే 'ఫైటర్' మూవీ బ్రిలియంట్ అని, డోంట్ మిస్ ఇట్ అని సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'X' (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఆయన డిటైల్డ్ రివ్యూ రాశారు. 4.5/5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. బజ్ తక్కువ ఉందన్నారు. కట్ చేస్తే... తరణ్ ఆదర్శ్ బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చారు.
''దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ హ్యట్రిక్ అందుకున్నారు. ఏరియల్ కాంబాట్, యాక్షన్, డ్రామా, ఎమోషన్స్, దేశభక్తి... 'ఫైటర్'లో అన్నీ ఉన్నాయి. కింగ్ సైజ్ ఎంటర్‌టైనర్. హృతిక్ రోషన్ సాహసోపేతమైన నటన టాప్ క్లాస్. ఈ సినిమాను మిస్ అవ్వొద్దు'' అని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.
దేశం కోసం నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న, దేశ రక్షణ కోసం పాటుపడుతున్న వీరులకు 'ఫైటర్' ఘన నివాళి అర్పిస్తుందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. సెకండాఫ్ చాలా బావుందని, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయని ఆయన చెప్పారు. లార్జర్ దేన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా 'ఫైటర్' అని ఆయన ట్వీట్ చేశారు.
Also Read: ఎన్టీఆర్ 'దేవర' డేట్ మీద కన్నేసిన దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'
హృతిక్ రోషన్ 'ఫైటర్' సినిమాలో షో టాపర్ అని, అందులో మరో డౌట్ లేదని తరణ్ ఆదర్శ్ వివరించారు. నిజాయతీగా నటించాడని చెప్పారు. దీపికా పదుకోన్ సైతం బాగా నటించిందన్నారు. హృతిక్, దీపికా జోడి సినిమాకు మరింత అందం తీసుకొచ్చిందని చెప్పారు. ''అనిల్ కపూర్ నటనలో లోపాలు లేవు. ఎప్పటిలా అద్భుతంగా నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్... సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగా చేశారు'' అని తరణ్ ఆదర్శ్ చెప్పారు.
Also Read: రామ్ చరణ్ బర్త్ డేకి ముందు - నయా మేకోవర్‌తో సెట్స్ మీదకు!
'ఫైటర్'కు ఓవర్సీస్ నుంచి సైతం మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు ఆకాశమే హద్దు అని, నిజంగా బావుందని కొందరు ట్వీట్ చేస్తున్నారు. 'ఫైటర్' బ్లాక్ బస్టర్ అని పేర్కొంటున్నారు. ఏబీపీ దేశం రివ్యూ కోసం మా వెబ్ సైట్ చూడండి. అప్పటి వరకు సోషల్ మీడియాలో 'ఫైటర్' గురించి ఆడియన్స్ చెప్పిన పబ్లిక్ రివ్యూలు పాఠకుల కోసం...