గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan Birthday) మార్చి 27న. ఆ రోజు మెగా అభిమానులకు కొత్త సినిమా అప్డేట్ రానుంది. ఒకవేళ లుక్ వచ్చినా రావచ్చు. బర్త్ డే కంటే ముందు కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి ఆయన రెడీ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...


మార్చి లేదా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు RC16!
'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. హీరో డేట్స్ కోసం దర్శకుడు వెయిట్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్' చేస్తున్న చరణ్... ఆ సినిమాలో మేజర్ వర్క్ కంప్లీట్ కావడంతో బుచ్చి బాబు సినిమా మీదకు ఫోకస్ షిఫ్ట్ చేశారట. ఫిబ్రవరి రెండో వారం తర్వాత లేదంటే మార్చి మొదటి వారంలో సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట. 


సరికొత్త మేకోవర్... సర్‌ప్రైజ్ చేసే లుక్!
నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్ల ముందు వరుసలో ఉంటుంది. దాని కోసం ఆయన మేకోవర్ కూడా ఉన్నారు. చిట్టిబాబు కంటే 'RC16' సినిమాలో తనది  బెస్ట్ క్యారెక్టర్ అని గతంలో ఒకసారి రామ్ చరణ్ చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆ రోల్ కోసం ఆయన స్పెషల్ మేకోవర్ అవుతున్నారట. ఈ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ తెలిపారు.   


చరణ్ సినిమాకు రెహమాన్ సంగీతం!
రామ్ చరణ్ - బుచ్చి బాబు సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. 'నాయకుడు' (ఉదయనిధి స్టాలిన్ తమిళ సినిమా 'మామన్నన్' తెలుగు అనువాదం) విడుదల సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చటించిన రెహమాన్ తమ మధ్య చర్చలు జరుగుతున్న విషయం చెప్పారు.


Also Read: ఎన్టీఆర్ 'దేవర' డేట్ మీద కన్నేసిన దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'


ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా ''హ్యాపీ బర్త్ డే ఇసై పుయల్. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారిని మా సినిమాలోకి స్వాగతిస్తున్నాం'' అని చిత్ర బృందం పేర్కొన్నారు. రామ్ చరణ్ 16వ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.


Also Readగోదారోళ్లతో ఈషా రెబ్బా స్పెషల్ సాంగ్ - మామూలుగా ఉండదు మరి!



రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌గ‌ర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయం, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని దర్శక నిర్మాతలు తెలియ‌జేశారు.


Also Readనిర్మాత ఎస్కేఎన్ ఇంటికి అల్లు అర్జున్... తండ్రి మరణించిన బాధలో ఉన్న ఆత్మీయుడికి ధైర్యం చెప్పిన బన్నీ