Stock Market News Today in Telugu: నిన్న (మంగళవారం) అతి భారీ అమ్మకాల ఒత్తిడికి గురైన ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు (బుధవారం, 24 జనవరి 2024) కూడా ఆ నష్టాలను పొడిగించాయి. బ్రాడర్‌ మార్కెట్లు తేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రేడ్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో.. నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ రికవర్‌ అయింది. రియాల్టీ ఇండెక్స్‌ చెత్త ప్రదర్శన చేసింది. పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌లు యాక్సిస్ బ్యాంక్‌, HDFC బ్యాంక్‌ షేర్లు పతనమయ్యాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో బలహీనత, IT షేర్ల కొనుగోలు ఆసక్తి కారణంగా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు అస్థిరంగా కదులుతున్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 70,371 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 206 పాయింట్లు లేదా 0.24 శాతం నష్టంతో 70,165.49 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 21,239 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 54 పాయింట్లు లేదా 0.25 శాతం క్షీణతతో 21,185.25 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


మార్కెట్‌ ఓపెన్‌ అయిన తొలి అరగంటలో, నిఫ్టీ 21,137 వద్ద కనిష్ట స్థాయిని తాకి తిరిగి గ్రీన్‌ కారిడార్‌లోకి అడుగు పెట్టింది. సెన్సెక్స్‌ కూడా 70,001.60 స్థాయికి పడిపోయి మళ్లీ పుంజుకుంది.


బ్రాడర్‌ మార్కెట్‌లో... BSE మిడ్‌ క్యాప్‌ & స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 0.5 శాతం చొప్పున పెరిగాయి.


Q3 FY24 ఫలితాలు నీరసంగా ఉండడంతో, మార్కెట్‌ పారంభంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 4 శాతం తగ్గాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లలో పతనం కంటిన్యూ అవుతోంది, 2 శాతం పడ్డాయి. డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల తర్వాత, కర్ణాటక బ్యాంక్‌ 12% క్షీణించింది. 


ఫిన్‌కేర్ SFBను మెర్జ్‌ చేసుకోవడానికి CCI అనుమతి రావడంతో AU స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 2% లాభపడింది.


మంగళవారం 31% క్రాష్ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు ఈ రోజు 7% ఎగబాకాయి. 


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు పెరిగి, మళ్లీ $80 స్థాయిని దాటడంతో ఏషియన్ పెయింట్స్ 1.6% క్షీణించింది.


మార్కెట్‌ ప్రారంభ సమయంలో, సెన్సెక్స్‌లో.. ఏషియన్ పెయింట్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, మారుతి, టాటా మోటార్స్ 1 శాతం వరకు క్షీణించి, టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఇన్ఫోసిస్, SBI, HCL టెక్నాలజీస్, టాటా స్టీల్ లాభాల్లో ఉన్నాయి.


సెక్టార్ల వారీగా చూస్తే... నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో సూచీలు తలో 0.4 శాతం తగ్గాయి. క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్ & గ్యాస్‌లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. 


ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 180.46 పాయింట్లు లేదా 0.26% పెరిగి 70,551.01 దగ్గర; NSE నిఫ్టీ 63.95 పాయింట్లు లేదా 0.30% పెరిగి 21,302.75 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్లు
నిన్న, యూఎస్‌ మార్కెట్లలో కొనుగోళ్ల ఆసక్తిక కనిపించింది. S&P 500 0.29 శాతం లాభపడి 4,864.60 వద్ద ఫ్రెష్‌గా ఆల్-టైమ్ గరిష్టాన్ని క్రియేట్‌ చేసింది. టెక్‌ స్టాక్స్‌తో కూడిన నాస్‌డాక్ కాంపోజిట్ 0.43 శాతం పెరిగింది. మరోవైపు, మూడు రోజుల ర్యాలీ తర్వాత డౌ జోన్స్ 0.25 శాతం పతనమైంది. ఈ ఉదయం ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సూచనలు మిశ్రమంగా ఉన్నాయి. కోస్పీ 0.5 శాతం, నికాయ్‌ 0.3 శాతం, ASX200 0.2 శాతం క్షీణించాయి. హ్యాంగ్ సెంగ్ మాత్రం 1.7 శాతం పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి