Seethe Ramudi Katnam Today Episode: రామ్ బెడ్ మీద పడుకొని ఉంటాడు. కింద పడుకొని ఉంటుంది. రాత్రి సమయంలో నక్కలు అరుపులు వినిపించడంతో రామ్ అదిరిపడి లేస్తాడు. భయంతో చెమటలు పట్టేస్తాడు. కింద పడుకున్న సీతని పిలుస్తాడు. సీత లేచాక దెయ్యం అరుపులు, నక్కల ఈలలు నీకు వినిపిస్తున్నాయా అని అడుగుతాడు. సీత అవును మామ అవి దెయ్యం శబ్దాలే అని అనడంతో భయపడి సీత పక్కకు చేరుకుంటాడు.


సీత: మామ దెయ్యం రావడానికి ముందు వచ్చే శబ్దాలే అవి.
రామ్: అంటే ఈ గదిలోకి దెయ్యం వస్తుందా మనల్ని ఏమైనా చేస్తుందా..
సీత: దెయ్యం అంటే నీకు అంత భయమా మామ. 
రామ్: చచ్చేంత భయం. అందుకే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ దెయ్యం సినిమాలు కూడా చూడలేదు. కథలు కూడా వినలేదు.
సీత: ఏంటి మామ పాములు అంటే భయం.. దెయ్యాలు అంటే భయం ఏంటి మామ నువ్వు. అయినా మామ భయపడని వాటికి భయపడుతున్నావ్ కానీ కంటికి కనిపిస్తున్న ఈ పెళ్లానికి భయపడటం లేదు. ఆ శబ్దాలు ఏంటో నేను చూసి వస్తాఅని సీత బయటకు వెళ్తుంది. కిందకి వచ్చి చూస్తే ఉషా వాళ్లు దెయ్యం సినిమా చూస్తారు. అది చూసిన సీత వాళ్లని రెచ్చగొట్టి తన భర్త తనకు దగ్గరయ్యేలా చేస్తాను అని టీవీకి ఎదురుగా వెళ్లి నిల్చొంటుంది. 
ఉష: ఏయ్ దెయ్యంలా వచ్చి టీవీకి అడ్డుగా నిల్చొన్నావ్ ఏంటి.
సీత: అర్థరాత్రి ఈ దెయ్యాల సినిమాలు ఏంటి వెళ్లి పడుకోండి.
ఉష: మా ఇష్టం మేం ఏమైనా చూస్తాం నువ్వు వెళ్లి పడుకో.
సీత: మీరు మరీ ఇంత సౌండ్ పెడితే నాకు నిద్ర ఎలా పడుతుంది. నాకు దెయ్యాలు అంటే భయం. 
ఉష: అయితే టీవీ అస్సలు ఆపం. 
సీత: రూమ్‌లో మీ అన్నయ్య నిద్ర పోతున్నాడు. నాకు ఈ శబ్దాలకు భయం వేసి నిద్ర పట్టడం లేదు. ఉష వాళ్లు ఇంకా సౌండ్ పెంచుతారు. మరోవైపు రామ్ బాగా భయపడతాడు. సీత తన ప్లాన్ సక్సెస్ అయిందని నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. 
రామ్: హర్రర్ సౌండ్ ఇంకా పెరిగింది ఏంటి సీత.. ఏమైంది.
సీత: ఇళ్లంతా తిరిగి వచ్చాను మామ. ఏ దెయ్యాలు ఎక్కడ కనిపించడం లేదు. బయట అంతా చీకటిగా ఉంది. దెయ్యాలు చీకట్లో శబ్దాలు చేస్తున్నాయేమో.. దెయ్యాలకు ఆకలి వేస్తే అలా చేస్తాయి. వాటికి ఆకలి వేసినప్పుడే మనుషుల్ని పీక్కుతింటాయి. భయంతో రామ్ సీత పక్కకు చేరి సీతని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. 


శివ: కూతురు మధుమిత, రామ్‌ల ఫొటో పేపర్‌లో రావడంతో ఆ పేపర్ పట్టుకొని ఇంటికి వస్తాడు. తన భార్య కాఫీ తెస్తాను అంటే వద్దు విషం తీసుకురా.. మనల్ని వదిలి లేచిపోయిన దాని గొంతులో పోస్తా.
మధుతల్లి: మధు మళ్లీ ఏం చేసింది అండీ ఎందుకు అంత కోపంగా ఉన్నారు. 
శివ: అది మళ్లీ మళ్లీ మన పరువు తీయడానికే పుట్టింది. దాని మీద కోపం ఎంత తగ్గించుకుందాం అనుకున్నా అది తన రోజు రోజుకు పెంచుతుందే తప్ప దాని బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. ఆ రోజు అది రిసెప్షన్‌లో ఉండకూడదు పంపించేయండి అని నేను ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. పైగా అందరి దృష్టిలో నేను విలన్ అయ్యాను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అంటూ రామ్‌తో మధు కలిసి ఉన్న ఫొటో చూపిస్తాడు. అందరూ షాక్ అవుతారు. 
మధుతల్లి: ఎవరండీ ఈ పని చేసింది ఎవరైనా చూస్తే మన పరువు ఏం కావాలి.
శివతల్లి: రామ్‌బాబు, మధు జంట ఏంటి శివ. ఎందుకు ఇలా చేశారు.
శివ: మన పరువు తీయడానికి నలుగురూ మన మీద ఉమ్ము వేయడానికి, మన పరువు గంగలో కలిపేయడానికి ..
మధుతల్లి: ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అండి ఎవరో తప్పుగా అనుకొని పేపర్‌లో వేసుంటారు.
శివ: ఇది పొరపాటో ఎవరి తప్పో కాదు అంతా దాని ప్లాన్ కావాలనే ఇలా చేసింది. 
మధుతల్లి: దీనికి మధుకి ఏ సంబంధం ఉండి ఉండదు.
శివ: సంబంధం ఉంది. అది ఓ ప్లాన్ ప్రకారమే ఆ ఇంటికి వచ్చింది. కావాలనే సీతలా రెడీ అయింది. తగుదనమ్మ అంటూ రామ్ పక్కనే నిల్చొంది. అది సీతకు అక్కని అని ఎప్పుడో మర్చిపోయింది. నా కూతురుగా చచ్చిపోయింది. ఏ అదృష్టాన్ని ఏ ఐశ్వర్యాన్ని కాలదన్ని వెళ్లిపోయిందో అదే ఇంటిమీద దాని కన్ను పడింది. స్వార్థంతో సీత స్థానాన్ని లాగేసుకోవాలి అనుకుంటుంది. తన సుఖం తాను చూసుకొని ఒకసారి సీతను ప్రమాదంలోకి లాగింది. ఇప్పుడు సీత సంతోషం చూడలేక సీతకు పెద్ద ప్రమాదంలో పడేసింది. దాన్ని క్షమించకూడదు.
మధుతల్లి: మీరు కోపంలో ఏదేదో మాట్లాడుతున్నారు. అది మీ పెంపకంలో పెరిగింది. మధు అలాంటిది కాదు. 
శివ: అవమానం నేను దానికి చేయడం లేదు అదే నాకు చేస్తుంది. దానికి ఏ ప్లాన్ లేకపోతే ఆ ఇంటికి వచ్చేదికాదు. సీతలా రెడీ అయి రామ్ పక్కన నిలబడేదే కాదు. ఇప్పుడు ఈ ఫొటో చూసి జనం ఏమనుకుంటారు. సీత పరిస్థితి ఏంటి. సీత భవిష్యత్ ఏ ప్రశ్నార్థకం అయింది. దీని సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. అంటూ మధు ఇంటికి వెళ్తాడు. 
మధు: నాన్న మా పెళ్లి అయ్యాక ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారు రండి. మీతో పాటు అమ్మ పిన్ని, నానమ్మ వచ్చారా నాన్న.
శివ: నన్ను నాన్న అని పిలవొద్దు అని నీకు ఎన్ని సార్లు చెప్పాలి. నేను సీత తండ్రిగా వచ్చాను. నా ఇంట్లో వాళ్లకి ఈ వల్లకాడుకి వచ్చే పని ఇంకా పట్టలేదు. మీ వాళ్లు అందర్ని పిలు మాట్లాడాలి. 
సూర్య: పోస్ట్ మ్యాన్ రావాల్సిన ఇంటికి పోలీస్ వచ్చాడు ఏంటి. 
శివ: సీత ఫాదర్‌గా వచ్చాను కాబట్టి మాట్లాడాలి అన్నాను పోలీస్‌లా వచ్చుంటే మీ అందరి చేతులకి బేడీలు వేసి ఈడ్చుకెళ్లేవాడిని. దీని ఫొటో పేపర్‌లో పడింది. చూడవే నువ్వు చేసిన నీచమైన పని. ఎంత చండాలం చేశావే చూడు. ఎంత పెద్ద తప్పు చేశావో తెలిసొచ్చిందా.. నువ్వు చేసిన తప్పు నీకు తెలిసొచ్చిందా.. సూర్య ఇంట్లో వాళ్లు అందరూ ఆ ఫొటో చూసి షాక్ అవుతారు. ఇక శివ మధుని తిడతాడు.  
ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు అని మధు చెప్పినా తన తండ్రి వినడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: త్రినయని సీరియల్ జనవరి 24th: గాయత్రీ దేవి జాడ తెలుసుకోవడానికి తిలోత్తమకు మరో అవకాశం.. ఆ పెట్టె తెరిచిన విశాల్!