Naga Panchami Today Episode:  ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మోక్ష లేచి కూర్చొంటాడు. మోక్షతో శబరి మేం చాలా భయపడ్డాం నాయనా.. మన ఇంట్లో ఉంటున్న మేఘన దేవతలా వచ్చి నిన్ను కాపాడింది అని చెప్తుంది. దీంతో మేఘన నేను ఏం చేయలేదు మోక్ష ఏదో నాకు తెలిసిన వైద్యం చేశా అని పని చేసింది అని చెప్తుంది. 


వైదేహి: లేదు మేఘన నీ చేతిలో ఏదో మహాత్యం ఉంది. ఆ రోజు నా కాలి నొప్పిని ఒక్క క్షణంలో మాయ చేశావ్. ఇప్పుడు ఇలా.. నీ మేలుని మేం ఎవ్వరం ఎప్పటికీ మర్చిపోలేం.
మోక్ష: పంచమి.. పంచమి.. అమ్మా పంచమి.. అప్పుడే వచ్చిన పంచమి.. మోక్షాబాబు అని అనడంతో మోక్ష పంచమి దగ్గరి వెళ్తాడు. దీంతో ఒకర్ని ఒకరు హత్తుకుంటారు. నేను బతికాను పంచమి. నీ మోక్ష ప్రాణాలతో ఉన్నాడు. నీ పూజలు ఫలించాయి. 
వైదేహి: మోక్షా.. 
మోక్ష: నన్ను బతికించింది ఆకు పసరులు కాదు. నా భార్య పంచమి. ఇదిగో పంచమి వాళ్ల బంధువు ఫణేంద్ర, ఇంక నాగసాధువు. నా పంచమినే నా ప్రాణాలు కాపాడింది అమ్మా. చాలా థ్యాంక్స్ స్వామి. ఫణేంద్ర నీ మేలు నేను మర్చిపోలేను. నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. 
వైదేహి: మేం వచ్చేటప్పటికి నువ్వు కొన ఊపిరితో ఉన్నావు మోక్ష. డాక్టర్లు కూడా ఇక లాభం లేదు అన్నారు. అలాంటి సమయంలో మేఘన వచ్చి నీకు ప్రాణాలు పోసింది. మనం రుణ పడాల్సింది మేఘనకు. వీళ్లెవ్వరకీ కాదు. 
మోక్ష: మేఘన చాలా థాంక్స్. నీ వైద్యం నన్ను బతికించొచ్చు మేఘన. కానీ నన్ను నాగ గండం నుంచి బయట పడేసింది మాత్రం వీళ్లు ముగ్గురే. 
వైదేహి: అసలు నీకు ఇలాంటి స్థితి వచ్చింది ఇదిగో ఈ పంచమి వల్ల. లేకపోతే ఈ అడవిలో నీకేం పని. పాము ఎందుకు నిన్ను కాటేస్తుంది. అంతా దీన్ని పెళ్లి చేసుకోవడం వల్లే. 
మోక్ష: అమ్మా పంచమి నాకు భార్యగా దొరకడం నా అదృష్టం అమ్మా.
వైదేహి: కాదు ఖర్మ. అవును మోక్ష నా బుద్ధి తక్కువ అయి దీంతో నీ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇక దీని మొఖం కూడా మనం చూడకూడదు. తొందరగా బయల్దేరు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం. రా..
మోక్ష: ఆగు అమ్మా.. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా. పంచమి నా భార్య. 
వైదేహి: కాదు మోక్ష ఇది మన పాలిట శనిలా దాపరించింది. ఇప్పుడు నేను చెప్తున్నా మోక్ష ఈ క్షణం నుంచి నువ్వు దీని పేరు కూడా పలకడానికి వీల్లేదు. ఒక తల్లిగా నీ మీద ఉన్న అధికారంతో నిన్ను ఆదేశిస్తున్నాను. నా మీద నీకు ఏమాత్రం ప్రేమ, గౌరవం ఉన్నా నువ్వు నా మాట జవదాటకూడదు. ఈ క్షణం నుంచి ఇది నీ భార్య కాదు. దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడే ఇక్కడే దీని జ్ఞాపకాల్ని మర్చిపోయి నువ్వు నాతో వస్తున్నావ్.
మోక్ష: ఇక ఆపు అమ్మ. 
వైదేహి: నా చివరి మాట కూడా విని అప్పుడు నీ నిర్ణయం చెప్పు మోక్ష. దీన్ని వదిలేసి నువ్వు ఇప్పుడు నాతో రాకపోతే నీ చేతులతోనే నువ్వే ఇక్కడ నా శవాన్ని ఇక్కడే పూడ్చిపెట్టు. 
మోక్ష: ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. నేను పంచమిని వదిలిపెట్టలేను. 
వైదేహి: సరే అయితే నేను ఇక్కడే చచ్చిపోతాను.. 
మోక్ష: అమ్మా ఆగు అమ్మా.. నువ్వు చచ్చిపోవడం కాదు. నీ మాటలతో నన్ను కత్తితో పొడిచి పొడిచి చంపేస్తున్నావ్. మీరంతా హ్యాపీగా ఉండండి నేనే చచ్చిపోతాను. నేనే చచ్చిపోతాను. 
శబరి: ఇది నాకు న్యాయంగా అనిపించడం లేదు వైదేహి.
మీనాక్షి: ఒకసారి మోక్ష మొఖం చూడు వదినా.. 
వైదేహి: మీనాక్షి.. ఎవరూ మాట్లాడకండి.. నా కొడుకు విషయం ఏం చేయాలో నాకు తెలుసు.
మోక్ష: ఏం తెలుసు అమ్మా నీకు ఏం తెలుసు. భార్యాభర్తలను విడదీయడమా.. దాని కంటే నువ్వే మా ఇద్దరిని చంపేయ్.. అక్కడ అయినా మేం ఇద్దరం కలిసే ఉంటాం. 
వైదేహి: నువ్వు నాతో మాట్లాడకు మోక్ష. నా మాట వింటేనే నువ్వు నా కొడుకువి. నేనేం చెప్పినా నువ్వు వినకుండా ఉన్నావ్ అంటే నువ్వు నా చావుని కోరుకున్నట్లే. పంచమి నువ్వు ఏం చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు నా మోక్షని నువ్వే నాతో పంపించాలి. నా కోడలిగా ఉండటానికి నీకు ఏమాత్రం అర్హత లేదు. ఎంత అసహ్యించుకున్నా నువ్వు ఇంకా నా కొడుకుని పట్టుకొని వేలాడుతున్నావంటే.. అసలు నీ ఒంట్లో చీము నెత్తురు లేదు. కొంచెం కూడా రోషం లేదు. నువ్వు నిజంగా మనిషి పుట్టుగ పుట్టి ఉంటే నా కొడుకుని నాతో పంపించు. 
మోక్ష: పంచమి ఒప్పుకోవద్దు. ప్లీజ్ పంచమి వద్దు. కావాలి అంటే మనద్దరం కలిసే చచ్చిపోదాం. నన్ను మాత్రం నీకు దూరం చేయొద్దు పంచమి ప్లీజ్.
పంచమి: వదలండి మోక్షాబాబు. 
మోక్ష: ప్లీజ్ పంచమి.. నేను నీతోనే ఉంటాను. ప్లీజ్ పంచమి ఒప్పుకోవద్దు.
పంచమి: నన్ను ముట్టుకోవద్దు. ఇంకొక్క క్షణం మీరు ఇక్కడున్నా మీ కళ్లముందే నేను ప్రాణం తీసుకొని చనిపోతా మోక్షాబాబు. 
మోక్ష: అలా అనకు పంచమి కావాలంటే చెప్పు నీతోపాటు నేను చనిపోతాను.
పంచమి: నిమిషం దగ్గర పడుతుంది. నా చావు చూడాలి అనుకుంటే ఉండండి.
మోక్ష: వద్దు పంచమి నువ్వు చనిపోవద్దు నేనే వెళ్లిపోతాను. అని మోక్ష ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


పంచమి తన తల్లి ఒకర్ని ఒకరు పట్టుకొని గట్టిగా ఏడుస్తారు. ఇక పంచమి శివుడి దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. ఇక తొందర పడ్డావని పంచమి తల్లి అంటే పంచమి తప్పలేదు అంటుంది. తన నుదిటిన భర్తతో కలిసి ఉండే రాత లేదని అంటుంది. తన కారణంగా వైదేహి కలలు వారసత్తం ఆగిపోకూడదు అని చెప్తుంది. 


ఫణేంద్ర: యువరాణి ఎవరో చేసిన మోసానికి మనద్దరం బలి అయ్యాం. 
పంచమి: నాగలోకంతో పూర్తిగా సంబంధం తెగిపోయింది ఫణేంద్ర. నన్ను పంచమి అని పిలు చాలు..
ఫణేంద్ర: అలాగే పంచమి. కానీ అనుమానం అంతా మేఘన మీదే. తనే నీ రూపంలో వచ్చి నన్ను మోసం చేసి నా దగ్గర మంత్రం చెప్పించుకుంది. 
పంచమి: మేఘనకు అలాంటి శక్తులు ఉన్నాయి అంటే నేను నమ్మలేకపోతున్నా. 
ఫణేంద్ర: మేఘన నాకు పరిచయం అయిన రోజు ఒక ఆశ్రమానికి తీసుకెళ్లి రకరకాల మాయలు చేసింది. అందుకే నాకు మేఘన మీద అనుమానం. ఏవో పిచ్చి పసరులతో ఇష్టరూప నాగు విషం విరుగుడు అయింది అంటే నేను నమ్మను. 
పంచమి: ఆశ్రమానికి తీసుకెళ్లా అన్నావ్ అది ఎక్కడుంది.
ఫణేంద్ర: అక్కడే సిటీలో పంచమి. అది ఒకప్పుడు నంబూద్రీ ఆశ్రమం అంట. నువ్వు పాముగా మారి తనని కాటేసి చంపావ్ అంట. 
పంచమి: అర్థమైంది ఫణేంద్ర నీకు మేఘన ఎన్ని రోజుల నుంచి పరిచయం. 
ఫణేంద్ర: ఆరోజు గుడి దగ్గరే.. తను ఓ నాగకన్య అని పరిచయం చేసుకుంది. దాంతో పాటు నీకు రక్షణగా ఉన్న నాగకన్యల్లో తాను ఒకరని చెప్పింది. 
పంచమి: మనల్ని మోసం చేసింది ఎవరో అర్థమైంది ఫణేంద్ర.  ఇదంతా కరాళి చేయిస్తుంది ఫణేంద్ర. దానికి వశీకరణ చేయడం తెలుసు. నాగకన్య అయిన మేఘనను వశీకరణ చేసుకొని మనమీద ప్రయోగించింది. కరాళి కనిపిస్తే నేను కనిపెట్టేస్తాను అని మేఘనని రంగంలోకి దింపింది. నిజానికి మేఘనకు ఏమీ తెలీదు. కరాళి వశీకరణలో ఉండి తను ఏం చేప్తే అది చేస్తుంది. 
ఫణేంద్ర: అయితే ఇప్పుడు ఏం చేద్దాం పంచమి. 
పంచమి: మేఘనని అనుమానిస్తే అది కరాళికి తెలిసి జాగ్రత్తపడుతుంది. మోక్షని అది ఏం చేయకముందే మనం కరాళి అచూకి తెలుసుకొని పనిపట్టాలి. కరాళి సామాన్యురాలు కాదు ఫణేంద్ర. నిదానంగా ఆలోచించి ప్రయత్నిద్దాం.
ఫణేంద్ర: నీ ఇష్టం పంచమి. నాగదేవత దగ్గర మన నిజాయితీ నిరూపించుకోవాలి. 
పంచమి: అది చూద్దాం ఫణేంద్ర. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావ్. మా ఇంటికి రా అక్కడే ఉండొచ్చు. 
ఫణేంద్ర: వద్దు పంచమి నా కారణంగా నీకు కొత్త కష్టాలు రావొచ్చు. నేను ఇక్కడే నాగసాధువుల దగ్గర గడిపేస్తాను. నువ్వు బయల్దేరు పంచమి అని ఫణేంద్ర చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 23rd: ఇంటికి వచ్చేస్తున్న ఆదర్శ్.. టెన్షన్‌తో తలపట్టుకున్న ముకుంద!