Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఏడుస్తున్న తల్లిని ఓదారుస్తారు అక్కి, అభయ్.
పిల్లలు: నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మాకు తెలుసు కానీ దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడని చెప్తావు కదా అందుకే ఈ పెళ్లి చేసుకో అమ్మ. మనం నలుగురం హ్యాపీగా ఉండొచ్చు అంటారు.
సరే అని చెప్పి పిల్లల్ని పడుకోబెడుతుంది అను మనసులో మాత్రం నేను ఏం చేసినా మీ సంతోషం కోసం ఆయన క్షేమం కోసమే చేస్తాను. ఈ పెళ్లి వలన ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటే అంతే చాలు అంతా దేవుడి దయ అనుకుంటుంది.
మరుసటి రోజు పొద్దున్నే నీరజ్ ఆర్య కి ఫోన్ చేసి కెనడీ ల్యాండ్ అయిపోతున్నాడు అని చెప్తాడు.
ఈ మాటలు నీరజ్ ఆఫీసులో ఉన్న వ్యక్తి ఒకడు విని మాన్సీ కి చేరవేస్తాడు. ఈ విషయాన్ని జలంధర్ కి చేరవేస్తారు మాన్సీ వాళ్ళు.
ఆర్య: కెనడీ చేత స్కెచ్ వేయించి పిల్లల తండ్రిని కనిపెట్టేయొచ్చు అనుకుని పిల్లల్ని పిలుస్తాడు బయటికి వెళ్దాం అని చెప్పి బయటికి వచ్చేసరికి అక్కడ సుగుణ కనిపిస్తుంది.
సుగుణ: పెళ్లి పనులు పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి అని అడుగుతుంది.
ఆర్య పెళ్లి కార్డులు ప్రింట్ అయ్యాయో లేదో చూసి వస్తాను అంటాడు. పిల్లలు ఎందుకు అని సుగుణ అడిగితే బోర్ కొడుతుందంట అందుకే తీసుకువెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు ఎయిర్ పోర్ట్ దగ్గర ఉన్న ఆర్య కార్ డ్రైవర్ ని కొట్టి తన డ్రైవర్ని ఆ ప్లేస్ లో పెడతాడు జలంధర్. ఫ్లైట్ దిగి వచ్చిన కెనడిని పరిచయం చేసుకొని ఆర్య వర్ధన్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చాను అని చెప్పి తన కారులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాడు.
ఛాయాదేవి : అతడిని పట్టుకున్నావా అని అడుగుతుంది.
జలంధర్: నా కార్ లోనే ఉన్నాడు వాడు ట్రాప్ అయ్యాడు అని తెలిస్తే తెల్ల ముఖం వేస్తాడేమో తెల్లోడు అని నవ్వుతాడు.
మాన్సీ : ఎట్టి పరిస్థితుల్లోనూ అతను మా బ్రో ఇన్ లా ని కలవకూడదు అంటుంది.
జలంధర్: అదంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు ఇంతలో కారు డ్రైవర్ రాంగ్ డైవర్షన్ తీసుకోవడంతో షాకవుతాడు. నువ్వు గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతున్నావా రాంగ్ రూట్ లో తీసుకు వెళ్తున్నావు అంటాడు.
డ్రైవర్: కాదు నేను మా గురువుగారిని ఫాలో అవుతున్నాను అని చెప్పి కారుని ఆపుతాడు. అక్కడ ఆర్య పిల్లల్ని చూసి షాక్ అవుతాడు జలంధర్. విషయం అర్థం చేసుకున్న కెనడీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అతడిని పట్టుకొని పీక మీద గన్ పెట్టి బెదిరిస్తాడు.
ఆర్య జలంధర్ దగ్గర గన్ లాక్కొని తిరిగి జలంధర్ కే గురిపెట్టి ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోతావు నీకు బోర్ కొట్టడం లేదా అని చెప్పి బెదిరించి పంపించేస్తాడు.
మరోవైపు గుడికి వచ్చిన సుగుణ మెట్టెలు,నల్లపూసలు అవి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయిస్తుంది. తర్వాత ప్రసాదం తింటున్నప్పుడు జ్యోతి పరధ్యానంగా ఉండడం గమనిస్తాడు యాదగిరి. ఏం జరిగింది అని అడుగుతాడు.
జ్యోతి: నాకు రాధ గారిని చూస్తే అనుమానంగా ఉంది నిన్న ఆవిడ గుడి దగ్గర ముష్టి ఎత్తుకుంటుంది అన్నప్పుడు రాధ ముఖంలో కలవరపాటు చూశాను. నిన్న పొద్దున్న పాత చీరలు మూట కట్టుకోవడం చూసాను అంటుంది.
యాదగిరి: ఆవిడకి ఏం కర్మ పట్టింది ముష్టెత్తుకోటానికి అని జ్యోతి మాటలు లైట్ తీసుకుంటారు అత్త, అల్లుడు.
కింద కూర్చొని ప్రసాదాలు తింటున్న సుగుణ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవటానికి లెగుస్తున్న సమయంలో ఒడిలో ఉన్న కాలిమెట్టె దొర్లి కింద పడిపోతుంది అది తిన్నగా వెళ్లి బిచ్చమెత్తుకుంటున్న అను దగ్గరికి వెళ్లి ఆగుతుంది.
సుగుణ పరిగెత్తుకుంటూ వచ్చి అది నాదేనమ్మ అని చెప్పి మెట్టె తీసుకుంటూ అను ముఖంలోకి చూసి షాక్ అవుతుంది. అను కూడా సుగుణను చూసి షాక్ అవుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?