Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో కాళీ ని వెంబడిస్తాడు అమర్. అమర్ నుంచి తప్పించుకుంటాడు కాళీ.


కాళీ : భాగితో పెళ్లి ఏమో గాని దొరికితే ఈ మిలిటరీ వాడు నా పెళ్లి చేసేలా ఉన్నాడు అనుకుంటాడు. కానీ ఎలాగైనా భాగి ని అనుభవించాలని ఆశలో ఉన్న కాళీ ఎదురుగా ఉన్న సర్వర్స్ ని చూసి మంచి ఐడియా ఈ రూపంలో అయితే ఆ మిలిటరీ వాడు కూడా కనిపెట్టలేడు ఎలాగైనా ఈరోజు భాగ్య జీవితం నాశనం చేయాలి అనుకుని సర్వర్ లా రూపం మార్చుకుని అదే పార్టీలో తిరుగుతూ ఉంటాడు.


మరోవైపు వెనక్కి తిరిగి వచ్చిన అమర్ ని ఏం జరిగింది? ఎవరిని వెంబడించారు అని అడుగుతుంది మిస్సమ్మ.


అమర్: ఇప్పుడు నిజం చెప్తే మిస్సమ్మ భయపడుతుందేమో అని మనసులో అనుకొని ఎవరూ లేరు కానీ నువ్వు లోపల గడియ పెట్టుకో అని చెప్పి జాగ్రత్త కూడా చెప్పి వెళ్ళిపోతాడు. అతని ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది మిస్సమ్మ.


ఆ తర్వాత అందరూ రెడీ అయ్యి వస్తారు. తాత నానమ్మల్ని ఆట పట్టిస్తారు పిల్లలు. అమర్ తండ్రి తన భార్యని ఆట పట్టించడంతో ఆమె సిగ్గు పడిపోతుంది.


మనోహరి : వాళ్ల సంతోషాన్ని చూసి ఓర్వలేక పోతుంది టైం అయిపోతుంది వచ్చి కేక్ కట్ చేయండి అంటుంది.


అమర్: కాసేపు వెయిట్ చేయండి ఇంకా మిస్సమ్మ రాలేదు అంటాడు.


ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది మనోహరి. అంతలో మిస్సమ్మ రావడం చూసిన పిల్లలు అదిగో మిస్సమ్మ వచ్చేస్తుంది అంటారు. మిస్సమ్మని చీరలో చూసిన అమర్ మెస్మరైజ్ అయిపోతాడు. తననే చూస్తూ ఉన్న అమర్ దగ్గరికి వచ్చిన మిస్సమ్మ ని ఆరు అని పిలుస్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.


మిస్సమ్మ : ఏమైంది సార్ అని అడుగుతుంది.


అమర్: ఈ చీర అని ఇంకేం మాట్లాడలేక నసుకుతాడు.


మిస్సమ్మ: మీరిచ్చిందే సార్, ఏమైంది అని అడుగుతుంది.


అమర్: ఇది నా వైఫ్ కోసం కొన్నది పొరపాటున నీకు ఇచ్చేసినట్లుగా ఉన్నాను అంటాడు.


మిస్సమ్మ: అయ్యో నాకు తెలియదు మార్చుకొని వచ్చేస్తాను అంటే పర్వాలేదు అంటాడు అమర్. అతని ప్రవర్తనకి మళ్ళీ ఆశ్చర్య పోతుంది మిస్సమ్మ.


వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి భరించలేక పోతుంది మనోహరి.


పిల్లలు నానమ్మ తాతయ్యలు చేత కేక్ కట్ చేయిద్దాం అంటే మిస్సమ్మ వాళ్ల చేత దండలు మార్పించి ఆ తర్వాత తలంబ్రాలు వేయించి అప్పుడు కేక్ కట్ చేస్తుంది. ఫోటోగ్రాఫర్ వచ్చి ఫ్యామిలీ అంతా ఒక దగ్గర నించోండి ఫోటో తీస్తాను అనటంతో మనోహరి వచ్చి అమర్ పక్కన నుంచుంటుంది.


అంజు: ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి దూరంగా ఉన్న మిస్సమ్మ ని తీసుకువచ్చి మనోహరి ముందు నిలబెడుతుంది. కోపంతో రగిలిపోయిన మనోహరి అక్కడ నుంచి సైడ్ అయిపోతుంది.


కోపంతో రగిలిపోతున్న మనోహరి దగ్గరికి వచ్చిన నీల ఫోటో పోతే పోనీయండమ్మా మన ప్లాన్ ఉంది కదా దాన్ని అమలు చేద్దాం అంటుంది. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది మనోహరి. రిలేటివ్స్ లో ఒక ఆవిడకి కనుసైగ చేస్తుంది నీల.


బంధువుల ఆవిడ : షష్టిపూర్తి కార్యక్రమాలు బాగున్నాయి నిర్మలమ్మ. మీ అబ్బాయి మీ గురించి ఆలోచించి ఇదంతా చేశాడు మరి మీరెందుకు మీ అబ్బాయి జీవితం గురించి ఆలోచించడం లేదు. మీ తరువాత అతను ఒంటరివాడైపోతాడు కదా అంటుంది. ఆ మాటలకి బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అమర్. ఆ తర్వాత మళ్లీ ఆవిడే వెనక్కి తిరిగి వచ్చిన జనాలతో అసలు మనోహరినే అమర్ ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నాడట కానీ ఆ అరుంధతిని చేసుకున్నాడు. అమర్ తో మనోహరి కి రాసిపెట్టి ఉంది అందుకే అరుంధతి చనిపోయింది అంటుంది.


ఆ మాటలకి మనోహరి ఆనందపడుతుంది కానీ అమర్ పేరెంట్స్ బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతారు.


బాధపడుతున్న అమర్ దగ్గరికి మిస్సమ్మ వస్తుంది. వాళ్లు అన్న మాటలు పట్టించుకోవద్దు అని చెప్తుంది మీ వైఫ్ కోసం కొన్న చీర నేను కట్టుకున్నాను అందుకే మీరు మరీ డిస్టబెన్స్ ఫీల్ అవుతున్నారు చీర మార్చుకొని వచ్చేస్తాను అంటుంది.


అమర్: అలా అని కాదు మిస్సమ్మ నిజంగానే నా వైఫ్ ని ఈరోజు బాగా మిస్ అవుతున్నాను. అందరి ముందు బాధపడే అదృష్టం కూడా నాకు లేదు కదా అందుకే పక్కకి వచ్చేసాను అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.